PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan--chandra-babu--ycp--tdp9fa81c23-fa48-41c1-a1c6-acaf92715ba3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/jagan--chandra-babu--ycp--tdp9fa81c23-fa48-41c1-a1c6-acaf92715ba3-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దేశావ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి. ఢీ అంటే ఢీ అనే రేంజ్ లో ఉన్నాయి. రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యర్థుల్లా కాక.. బద్ధ శత్రువుల్లా తెగ తలపడుతున్నాయి. ఒకరిపై ఒకరు చేసుకున్న విమర్శలు ఎప్పుడో దూషణల స్థాయికి వెళ్లాయి.ఇక ఎంతో హోరాహోరీగా సాగిన ఎన్నికలు మొత్తానికి అయిపోయాయి. ఇక ఫలితం కోసం జూన్ 4 వ తేదీ దాకా ఆగాల్సిందే. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలని గెలిచిన సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తరువాత అసెంబ్లీలో సభ్యుల ప్రమాణం. ఇంకా వర్షాకాల సమావేశాJagan - Chandra Babu - YCP - TDP{#}Telugu Desam Party;media;politics;DWCRA;Survey;Andhra Pradesh;June;CM;CBN;Jagan;India;TDP;Elections;Father;Partyఏపీ: మళ్ళీ జగనే సీఎం.. బాబు కాదు.. ఎందుకంటే?ఏపీ: మళ్ళీ జగనే సీఎం.. బాబు కాదు.. ఎందుకంటే?Jagan - Chandra Babu - YCP - TDP{#}Telugu Desam Party;media;politics;DWCRA;Survey;Andhra Pradesh;June;CM;CBN;Jagan;India;TDP;Elections;Father;PartyThu, 16 May 2024 00:00:00 GMTఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దేశావ్యాప్తంగా హాట్ టాపిక్ అవుతున్నాయి.  ఢీ అంటే ఢీ అనే రేంజ్ లో ఉన్నాయి. రెండు ప్రధాన రాజకీయ పార్టీలు ప్రత్యర్థుల్లా కాక.. బద్ధ శత్రువుల్లా తెగ తలపడుతున్నాయి. ఒకరిపై ఒకరు చేసుకున్న  విమర్శలు ఎప్పుడో దూషణల స్థాయికి వెళ్లాయి.ఇక ఎంతో హోరాహోరీగా సాగిన ఎన్నికలు మొత్తానికి అయిపోయాయి. ఇక ఫలితం కోసం జూన్ 4 వ తేదీ దాకా ఆగాల్సిందే. ఆ తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలని గెలిచిన సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ తరువాత అసెంబ్లీలో సభ్యుల ప్రమాణం.తన భార్యను అవమానించారంటూ రెండున్నరేళ్ల కిందట తెలుగుదేశం అధినేత చంద్రబాబు నిండు అసెంబ్లీలోనే ఆవేదన వ్యక్తం చేసి.. ఆవేశపూరితంగా మాట్లాడిన విషయం తెలిసిందే. అయితే అదే ఆగ్రహంతో ఆయన సభలో చాలెంజ్ కూడా చేశారు. ''సీఎంగానే ఇకపై సభలో అడుగుపెడతానంటూ'' శపధం చేసి వెళ్లిపోయారు. ఆ తర్వాత మీడియా ముంగిట తన కుటుంబానికి జరిగిన అవమానాన్ని తలచుకుంటూ కన్నీరుమున్నీరయ్యారు కూడా. ఇప్పుడు ఎన్నికల్లో గనుక చంద్రబాబు గెలిస్తే.. ఆయన శపథం నెరవేరుతుంది. ఆయన సీఎంగా నేరుగా అసెంబ్లీలోకి అడుగుపెడతారు. కానీ ఓడిపోయారంటే.. మాత్రం ఆయన చాలెంజ్ ప్రకారమే మళ్లీ చంద్రబాబును అసెంబ్లీలో చూడలేం. అందుకే గెలవాలని జనసేన, బీజేపీతో పొత్తు పెట్టుకొని కూటమిని ఏర్పరచుకొని గట్టిగా పోటీ చేశారు. కానీ గెలుస్తారని నమ్మకం లేదు.


ఎందుకంటే తాజాగా రిలీజ్ అయిన ఈసి లెక్కలు ఇంకా ఇండియా హెరాల్డ్ చేసిన సర్వే ప్రకారం.. ఈ ఎన్నికల్లో మహిళలే పురుషులు కంటే ఎక్కువ ఓట్లు వేశారు. అదే బాబుకి వణుకుపుట్టిస్తుంది. ఎందుకంటే డ్వాక్రా విషయంలో మహిళలకి బాబు బాగా నెగటివ్ అయ్యారు. ఆ కారణంతో గెలవకపోవచ్చు. ఖచ్చితంగా ఓడిపోతారు.ఈ ఎన్నికల్లో మాత్రం వైఎస్ జగన్ వరుసగా రెండోసారి సీఎం అయి తండ్రి రికార్డును అందుకుంటారు. గతంలోకి వెళితే తమ గొంతును అణచివేస్తున్నారంటూ 2017లో టీడీపీ ప్రభుత్వం ఉండగా జగన్ అసెంబ్లీని బాయ్ కాట్ చేశారు. అసలు ఆ పార్టీ ఎమ్మెల్యేలు ఎవరూ కూడా శాసన సభకు వెళ్లలేదు. ఆ తర్వాత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర చేపట్టారు. కష్టపడి అధికారం సాధించి సీఎంగానే సభలో అడుగిడారు. ఈసారి కూడా గెలుస్తారు. ఎందుకంటే మహిళలు, బడుగు బలహీన వర్గాలకు జగన్ చాలా మంచి చేశారు. చంద్రబాబుతో పోల్చుకుంటే జగన్ చాలా బెటర్ అనే అభిప్రాయం జనాల్లో ఉంది. కాబట్టి జగన్ ఖచ్చితంగా సీఎం అయ్యి అసెంబ్లీకి వెళతారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>