PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pavan-kalyan8ae285e6-8c7e-42e9-b7bf-7dce3077f9bb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pavan-kalyan8ae285e6-8c7e-42e9-b7bf-7dce3077f9bb-415x250-IndiaHerald.jpgజనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ రాష్ట్రంలో బలోపేతం కావడానికి ఎంతో కృషి చేశాడు. బీజేపీ టీడీపీతో పొత్తు కుదుర్చుకునేలా చేశాడు. టీడీపీ పార్టీ బలహీన పడిన నేపథ్యంలో దానిని బలమైన పార్టీగా నిలబెట్టాడు. అందువల్ల టీడీపీ కూటమి గెలిస్తే పవన్ కళ్యాణ్ మంత్రి కావడం ఖాయం. అయితే ఇంకా ఎన్నికల రిజల్ట్స్ కూడా రిలీజ్ కాలేదు కానీ పవన్‌కు ఏ మంత్రిత్వ శాఖను అప్పజెప్తారనే చర్చ ఇప్పుడు మొదలైంది.Pavan kalyan{#}Jayanthi;hari;hari music;Godavari River;Aqua;kalyan;TDP;Bharatiya Janata Party;Minister;YCP;Cinema"పవన్ అనే నేను" అంటూ ప్రమాణస్వీకార ప్రసంగం ప్రాక్టీస్ చేస్తున్న జనసేన అధినేత..??"పవన్ అనే నేను" అంటూ ప్రమాణస్వీకార ప్రసంగం ప్రాక్టీస్ చేస్తున్న జనసేన అధినేత..??Pavan kalyan{#}Jayanthi;hari;hari music;Godavari River;Aqua;kalyan;TDP;Bharatiya Janata Party;Minister;YCP;CinemaThu, 16 May 2024 15:50:00 GMT
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీ రాష్ట్రంలో బలోపేతం కావడానికి ఎంతో కృషి చేశాడు. బీజేపీ టీడీపీతో పొత్తు కుదుర్చుకునేలా చేశాడు. టీడీపీ పార్టీ బలహీన పడిన నేపథ్యంలో దానిని బలమైన పార్టీగా నిలబెట్టాడు. అందువల్ల టీడీపీ కూటమి గెలిస్తే పవన్ కళ్యాణ్ మంత్రి కావడం ఖాయం. అయితే ఇంకా ఎన్నికల రిజల్ట్స్ కూడా రిలీజ్ కాలేదు కానీ పవన్‌కు ఏ మంత్రిత్వ శాఖను అప్పజెప్తారనే చర్చ ఇప్పుడు మొదలైంది.

పవన్ హోం శాఖ మంత్రి కావడానికి ఇష్టపడతారని ఆయన ప్రసంగాలను విన్నవారు చెబుతున్నారు. కాపు నాయకుడు, మాజీ మంత్రి చేగొండి హరి రామజోగయ్య ఇటీవల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీడీపీ గెలిస్తే ఎంతో కష్టం చేసిన పవన్‌ని హోమ్‌మంత్రి హోదా కల్పించాలన్నారు. అలాగే ఉప ముఖ్యమంత్రిని చేసి గౌరవించాల్సిన అవసరం ఉందని నొక్కి చెప్పారు. పవన్ మూవీ ఇండస్ట్రీకి చెందిన వాడు కాబట్టి అతనికి సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ ఇవ్వొచ్చని మరికొంతమంది అంటున్నారు. ఇలా చేస్తే సినీ రంగానికి, ప్రభుత్వానికి మధ్య మంచి అనుబంధం ఏర్పడుతుందని, ఇరువైపులా అనేక ప్రయోజనాలు లభిస్తాయి అని మరి కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

అయితే నాయకులు విశ్లేషకులు ప్రజలు ఇలా అనుకుంటే పవన్ మాత్రం అన్ని మంత్రిత్వ శాఖలలో అతి ముఖ్యమైన జలవనరుల శాఖ మంత్రి అవ్వాలనే కోరికతో ఉన్నాడని సమాచారం. ఈ మాటలకు అనుగుణంగానే పవన్ రీసెంట్‌గా వారణాసి వెళ్లి ఏపీలో కాలువలకు పూడికలు తీయాలని డిమాండ్ చేశాడు. వైసీపీ నీటి పారుదల ప్రాజెక్టుల విషయంలో అలసత్వంగా ప్రవర్తిస్తోందని ఫైర్ అయ్యాడు. ఇంకో నెల రోజుల సమయం ఆగితే వానాకాలం మొదలవుతుందని, కాబట్టి ముందుగానే పూడికలు తీయిస్తే వాన నీటితో కాలువలు నిండుకుండలా మారి అనేక అవసరాలకు ఉపయోగపడతాయని అన్నాడు. ఇలా నీటికి సంబంధించి రెస్పాన్సిబుల్‌గా ప్రవర్తించడమే కాక ఇటీవల సర్ ఆర్ధర్ కాటన్ జయంతి సందర్భంగా ఆయనకి నివాళులు అర్పించాడు పవన్.

గోదావరి తీరం పచ్చగా కళకళలాడటానికి సర్ ఆర్థర్ కాటన్ ఆనకట్ట నిర్మించడమే అని పేర్కొన్నాడు. సాగు నీటి కాలువలు సర్ ఆర్థర్ కాటన్ తవ్వించడం వల్ల గోదావరి ప్రజలకు ఎంతో ప్రయోజనం చేయకూడదని తెలిపాడు. తరతరాల ప్రజలకు ఉపయోగపడేలా నీటి ప్రాజెక్టులను కాటన్ నిర్మించాలని అన్నారు. ఈ విధంగా పవన్ మంచి ఆలోచనలను పెట్టుకున్నట్లు తెలుస్తోంది. టీడీపీ అధికారంలోకి వస్తే మంచి పనులు చేయాలని చూస్తున్నట్లు అర్థమవుతోంది. అన్నీ కుదిరితే "పవన్ అనే నేను" అంటూ జలవనరుల శాఖ మంత్రిగా పవన్ ప్రమాణ స్వీకారం చేసేయొచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>