MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/allu-arjuncc7435ac-b0da-45d2-a463-0d09e222048a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/allu-arjuncc7435ac-b0da-45d2-a463-0d09e222048a-415x250-IndiaHerald.jpgఅల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప-2 సినిమాపై దేశావ్యాప్తంగా ఎలాంటి బజ్ క్రియేట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.పుష్ప-1కు మించి ఉండేలా సుకుమార్ ప్రతి విషయంలో చాలా అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బిట్ టు బిట్ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్నారు.మరో మూడు నెలల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇక విడుదలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. ఈ మూవీ టీమ్ నుంచి కీలక టెక్నీషియన్ తప్పుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఎడిటర్ ఆంటోనీ రూబెన్ ఈ సినిమా నుంచి వైదొలిగినట్Allu Arjun{#}Varun Dhawan;ala venkatapuram lo;Jaan;Mersal;Naveen Nuli;Ala Vaikunthapurramloo;sujeeth;Blockbuster hit;Rangasthalam;sukumar;John;bollywood;Cheque;News;Cinemaపుష్ప2: ఎక్కువైన అతి జాగ్రత్తలు.. అతను ఔట్?పుష్ప2: ఎక్కువైన అతి జాగ్రత్తలు.. అతను ఔట్?Allu Arjun{#}Varun Dhawan;ala venkatapuram lo;Jaan;Mersal;Naveen Nuli;Ala Vaikunthapurramloo;sujeeth;Blockbuster hit;Rangasthalam;sukumar;John;bollywood;Cheque;News;CinemaThu, 16 May 2024 22:16:09 GMTఅల్లు అర్జున్, సుకుమార్ కాంబోలో తెరకెక్కుతున్న పుష్ప-2 సినిమాపై దేశావ్యాప్తంగా ఎలాంటి బజ్ క్రియేట్ అయిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.పుష్ప-1కు మించి ఉండేలా సుకుమార్  ప్రతి విషయంలో చాలా అతి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. బిట్ టు బిట్ ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుని సినిమా షూటింగ్ పూర్తి చేస్తున్నారు.మరో మూడు నెలల్లో ఈ మూవీ రిలీజ్ కానుంది. ఇక విడుదలకు సమయం దగ్గర పడుతున్న వేళ.. ఈ మూవీ టీమ్ నుంచి కీలక టెక్నీషియన్ తప్పుకున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. ఎడిటర్ ఆంటోనీ రూబెన్ ఈ సినిమా నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. డేట్స్ సమస్యల కారణంగా ఈ ప్రాజెక్టు నుంచి ఫ్రెండ్లీగా ఆయన తప్పుకున్నట్లు సమాచారం. తప్పనిసరి పరిస్థితుల్లో వేరే కమిట్మెంట్స్ వల్ల ప్రాజెక్టుకు బై చెప్పినట్లు సమాచారం తెలుస్తుంది.మూడేళ్ల క్రితం వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ అయిన పుష్ప: ది రైజ్ తో పాటు జవాన్, బిగిల్, మెర్సల్ ఇంకా వివేగం వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాలకు ఆంటోనీ రూబెన్ ఎడిటర్ గా పని చేశారు. అయితే పుష్ప-2 కాకుండా అట్లీ, బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ కాంబోలో వస్తున్న బేబీ జాన్ సినిమాకు కూడా ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు ఆంటోనీ.


ఇంకా మరో చిత్రానికి కూడా ఇప్పటికే కమిట్ అయ్యారు. దీంతో ఎవరికీ ఇబ్బంది కలగకుండా ఉండేందుకు పుష్ప-2 నుంచి ఆంటోని తప్పుకున్నారట.అనుకున్న తేదీకి సినిమా రిలీజ్ చేయాలంటే ఆంటోనీ రూబెన్ ప్లేస్ ను వేరే వారితో ఖచ్చితంగా రీప్లేస్ చేయాలి. అందుకే సుకుమార్ టీమ్ కొత్త ఎడిటర్ విషయంలో చాలా ఆలోచించడం జరిగింది. చివరకు నేషనల్ అవార్డు గెలుచుకున్న నవీన్ నూలికి సుకుమార్ ఎడిటింగ్ బాధ్యతలు అప్పగించారని సమాచారం తెలుస్తోంది. ప్రస్తుతం ఎడిటింగ్ వర్క్ ను త్వరగా నవీన్ నూలి పూర్తి చేస్తున్నారని సమాచారం తెలుస్తుంది. కాబట్టి మూవీ రిలీజ్ డేట్ విషయంలో ఎలాంటి ఛేంజ్ ఉండదని సమాచారం తెలుస్తుంది.నవీన్ నూలి గతంలో సుకుమార్ తో కలిసి పలు సినిమాలకు వర్క్ చేశారు. నాన్నకు ప్రేమతో, రంగస్థలం చిత్రాలకు ఆయనే ఎడిటర్ గా వ్యవహరించారు. ఇక అల వైకుంఠపురములో మూవీకి వర్క్ చేశారు. ఇప్పుడు పుష్ప-2తో పాటు పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబోలో వస్తున్న ఓజీ మూవీకి కూడా ఎడిటర్ గా వ్యవహరిస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>