PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sridevi-5e88d1f3-0dd9-42c0-b073-df37fe96ae1a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/sridevi-5e88d1f3-0dd9-42c0-b073-df37fe96ae1a-415x250-IndiaHerald.jpgవైసీపీ నాయకురాలు కంగాటి శ్రీదేవి ఈసారి పత్తికొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2019లో భారీ మెజారిటీతో గెలిచిన ఆమెకే వైసీపీ అధిష్టానం ఈసారి కూడా ఆ నియోజకవర్గం పోటీ చేసే అవకాశాన్ని అందించింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే పత్తికొండ ప్రజలలో శ్రీదేవి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజలకు దగ్గరయ్యారు. ఆమె పాలన పట్ల ప్రజలందరూ బాగా సంతృప్తిగా ఉన్నారు. కర్నూలులో ఓటింగ్ శాతం దాదాపు 80 వరకు నమోదయింది. ఎక్కువగా మహిళలు, వృద్ధులు పల్లెటూరు ప్రజలకు ఓటు హక్కు వినియోగించుSridevi {#}Sridevi Kapoor;shyam;KANGATI SREEDEVI;pattikonda;Kothapalli;MLA;Assembly;TDP;Jagan;YCPవిక్టరీ: పత్తికొండలో టీడీపీ అభ్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించేసిన శ్రీదేవి..?విక్టరీ: పత్తికొండలో టీడీపీ అభ్యర్థిని చిత్తుచిత్తుగా ఓడించేసిన శ్రీదేవి..?Sridevi {#}Sridevi Kapoor;shyam;KANGATI SREEDEVI;pattikonda;Kothapalli;MLA;Assembly;TDP;Jagan;YCPWed, 15 May 2024 09:53:00 GMTవైసీపీ నాయకురాలు కంగాటి శ్రీదేవి ఈసారి పత్తికొండ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేశారు. 2019లో భారీ మెజారిటీతో గెలిచిన ఆమెకే వైసీపీ అధిష్టానం ఈసారి కూడా ఆ నియోజకవర్గం పోటీ చేసే అవకాశాన్ని అందించింది. దీనికి ముఖ్య కారణం ఏంటంటే పత్తికొండ ప్రజలలో శ్రీదేవి చాలా మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి అభివృద్ధి పనులు చేపడుతూ ప్రజలకు దగ్గరయ్యారు. ఆమె పాలన పట్ల ప్రజలందరూ బాగా సంతృప్తిగా ఉన్నారు. కర్నూలులో ఓటింగ్ శాతం దాదాపు 80 వరకు నమోదయింది. ఎక్కువగా మహిళలు, వృద్ధులు పల్లెటూరు ప్రజలకు ఓటు హక్కు వినియోగించుకున్నారు. వీరందరూ వైసీపీకి అనుకూలం కాబట్టి శ్రీదేవి ఈసారి కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

ఆమెకు తమ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని ఈ నియోజకవర్గ ప్రజలు ఆల్రెడీ స్పష్టం చేశారు. ఓటింగ్ సరళిని బట్టి కూడా ఆమె గెలుపు ఖాయం అని పొలిటికల్ అనలిస్టులు సందేహం లేకుండా చెబుతున్నారు. ఈ అన్ని విషయాలను పరిగణలోకి తీసుకుంటే 2024 అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె మరోసారి గెలుస్తుందని అర్థమవుతోంది.శ్రీదేవిపై టీడీపీ పొత్తు నుంచి కెఈ శ్యామ్ కుమార్ పోటీ చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పత్తికొండ నియోజకవర్గంలో ఆయన గెలిచే అవకాశాలు దాదాపు శూన్యం. శ్రీదేవి 2019లో వైసీపీ అభ్యర్థిగా కేఈ శ్యామ్‌బాబుపై పోటీ చేశారు.

 ఆ సమయంలో ఆమె ఏకంగా 42,065 ఓట్ల మెజారిటీతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. ఈ విజయంతో ఆమె ఫస్ట్ టైమ్‌ ఎమ్మెల్యేగా అవతరించారు. ప్రజలు ఇచ్చిన ఆ అవకాశాన్ని బాగా సద్వినియోగం చేసుకుంటూ గడిచిన ఐదేళ్లలో అనేక మంచి పనులు చేశారు. దూదేకొండ, కొత్తపల్లి బ్రిడ్జి నిర్మాణాన్ని కంప్లీట్ చేసే ప్రజల రవాణాను సులభతరం చేశారు. ఆమె మళ్లీ వస్తే నియోజకవర్గం ఇంకా అభివృద్ధి అవుతుందని ప్రజలు బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. అలాగే జగన్ ని చూసి ఓట్లు వేసినా వారు కూడా వేలాది సంఖ్యలో ఉంటారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>