PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-elections-2024--ycp--tdp--jagan--chandrababua259665c-ad36-43f2-b70c-2af6cf7e5c8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-elections-2024--ycp--tdp--jagan--chandrababua259665c-ad36-43f2-b70c-2af6cf7e5c8a-415x250-IndiaHerald.jpg•ఉత్తరాంధ్రని ఊపేస్తున్న ఫ్యాన్ •విశాఖ, విజయనగరం, అనకాపల్లిలో వైసీపీ విక్టరీ ఖాయం •కీలక నియోజకవర్గాల్లో టీడీపీని తొక్కేస్తున్న వైసీపీ ఉత్తరాంధ్ర - ఇండియా హెరాల్డ్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎంతో రసవత్తరంగా జరిగిపోయాయి. ఈసారి రికార్డ్ స్థాయిలో పోలింగ్ జరిగింది. ఇక ఈ ఎన్నికల్లో ఎవరికీ ఎక్కువ ఓట్లు పడుంటాయి అనే అంశం జనాల్లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇండియా హెరాల్డ్ చేసిన సర్వే ప్రకారం ఈసారి ఎవరు సీఎం అవుతారో పక్కాగా క్లారిటీ వచ్చేసింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్నిAP Elections 2024 - YCP - TDP - Jagan - Chandrababu{#}Uttarandhra;Anakapalle;Srikakulam;SV Mohan Reddy;BOTCHA SATYANARAYANA;Vijayanagaram;Vizianagaram;Jagan;Andhra Pradesh;Survey;Yevaru;CM;India;TDP;YCPఉత్తరాంధ్ర: వైసీపీ దెబ్బకి పాతాలానికి పోతున్న టీడీపీ?ఉత్తరాంధ్ర: వైసీపీ దెబ్బకి పాతాలానికి పోతున్న టీడీపీ?AP Elections 2024 - YCP - TDP - Jagan - Chandrababu{#}Uttarandhra;Anakapalle;Srikakulam;SV Mohan Reddy;BOTCHA SATYANARAYANA;Vijayanagaram;Vizianagaram;Jagan;Andhra Pradesh;Survey;Yevaru;CM;India;TDP;YCPWed, 15 May 2024 11:59:01 GMT•ఉత్తరాంధ్రని ఊపేస్తున్న ఫ్యాన్
•విశాఖ, విజయనగరం, అనకాపల్లిలో వైసీపీ విక్టరీ ఖాయం
•కీలక నియోజకవర్గాల్లో టీడీపీని తొక్కేస్తున్న వైసీపీ


ఉత్తరాంధ్ర - ఇండియా హెరాల్డ్: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎంతో రసవత్తరంగా జరిగిపోయాయి. ఈసారి రికార్డ్ స్థాయిలో పోలింగ్ జరిగింది. ఇక ఈ ఎన్నికల్లో ఎవరికీ ఎక్కువ ఓట్లు పడుంటాయి అనే అంశం జనాల్లో  హాట్ టాపిక్ అయ్యింది. అయితే ఇండియా హెరాల్డ్ చేసిన సర్వే ప్రకారం ఈసారి ఎవరు సీఎం అవుతారో పక్కాగా క్లారిటీ వచ్చేసింది. ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో ఏ పార్టీకి ఎన్ని సీట్లు వస్తాయనేదానిపై గెలుపోటములు ఆధారపడి ఉంటాయి.ఎందుకంటే ఉత్తరాంధ్ర చాలా పెద్దది. పైగా బాగా డెవలప్ అయిన ఏరియా. చాలా మంది చదువుకున్న వాళ్ళు అక్కడే ఉంటారు. విశాఖ, విజయనగరం లాంటి పేరు గాంచిన ప్రదేశాలు ఉత్తరాంధ్రలోనే ఉన్నాయి. అయితే ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లె జిల్లాల్లో శ్రీకాకుళం మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో వైసీపీకి ఎక్కువ ఓట్లు పోల్ అయినట్లు ఇండియా హెరాల్డ్ సర్వే ద్వారా తేలింది. శ్రీకాకుళంలో మాత్రం టీడీపీకి కొంచెం వైసీపీ కంటే ఎక్కువ అనుకూల పవనాలు వీచాయని తెలిసింది.


అయితే విశాఖ, విజయనగరం,అనకాపల్లె జిల్లాలో వైసీపీ ఓట్లు పరంగా మంచి స్కోర్ చేసిందని తెలుస్తుంది. విశాఖలో బొత్స ఝాన్సీ, విజయనగరంలో బొత్స సత్యనారాయణ, అనకాపల్లిలో బూడి ముత్యాల నాయుడు ఖచ్చితంగా గెలుస్తారని ఇండియా హెరాల్డ్ సర్వేలో తేలింది. దీంతో ఉత్తరాంధ్రలో వైసీపీ దెబ్బకు టీడీపీ పాతాలానికి పోవడం పక్కా అని తెలుస్తుంది. ఇంకా ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని కీలక నియోజకవర్గాల్లో అయితే ఇంతకాలం అక్కడ బలంగా ఉన్న టీడీపీ పార్టీ, టీడీపీ అభ్యర్థులకు సైతం ఖచ్చితంగా షాక్ లు తప్పకపోవచ్చనే కామెంట్లూ బలంగా వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు ఏపీలో అధికారంలోకి ఖచ్చితంగా మరోసారి జగన్ మోహన్ రెడ్డి రావడం పక్కా అని స్పష్టం అవుతుంది.పైగా ఈ ఎన్నికలలో పురుషుల కంటే మహిళలు చాలా ఉత్సాహంగా పోలింగ్ లో పాల్గొన్నారు.ఎందుకంటే మహిళలకు సీఎం వైఎస్ జగన్ చేసిన మేలు అంతా ఇంత కాదు.


ఆయన కల్పించిన సాధికారతకు ప్రతి రూపమే ఇలా పోలింగ్ శాతం పెరిగేందుకు నిదర్శనమని తెలిసింది. ముఖ్యంగా అమ్మ ఒడి, ఆసరా, ఇళ్ల పట్టాలు, చేయూత లాంటివి మహిళలకే అందించడం వల్ల వైసీపీకి ఓట్లు బాగా పడ్డాయి.ఈ విధంగా... మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చడం కోసం సీఎం జగన్ మోహన్ రెడ్డి చాలా కృషి చేశారు. అందువల్ల ప్రస్తుతం జనాల నుంచి వైసీపీకి సూపర్ రెస్పాన్స్ వస్తుంది. పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తమకు ఎంతగానో మేలు చేసిన వైఎస్ జగన్ ను మళ్ళీ సీఎంగా చూడాలనుకుంటున్నారు. అందువల్ల జగన్ మోహన్ రెడ్డి గెలిచి సీఎం అవ్వడం పక్కా అంటూ పలు విశ్లేషణలూ తెరపైకి వస్తున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>