MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh8b1cd834-ce22-427d-a743-6f345a0c50cd-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mahesh8b1cd834-ce22-427d-a743-6f345a0c50cd-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాడు. కొన్ని అపజయాలను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. మహేష్ ఎప్పుడు కూడా రొటీన్ కథలకు దూరంగా ఉంటూ సరికొత్త కథాంశాలతో అంతే కొత్త స్క్రీన్ ప్లే తో సాగే సినిమాలలో నటించడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు. అందులో భాగంగా తన కెరీర్ లో ఎన్నో డిఫరెంట్ సినిమాల్లో మహేష్ నటించాడు. మహేష్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో అంతే డిఫరెంట్ వే లో ఉన్న స్క్రీన్ ప్లే తో నడిచే కొన్ని సినిమాలలో నటించినప్పటికీ అందులో కొన్ని అపజాయలMahesh{#}Ameesha Patel;mahesh babu;s j surya;Box office;Nani;Music;kushi;Kushi;Audience;Hero;cinema theater;Cinemaమహేష్ డేరింగ్ స్టెప్ కి 20 సంవత్సరాలు... వర్కౌట్ అయ్యి ఉంటేనా..?మహేష్ డేరింగ్ స్టెప్ కి 20 సంవత్సరాలు... వర్కౌట్ అయ్యి ఉంటేనా..?Mahesh{#}Ameesha Patel;mahesh babu;s j surya;Box office;Nani;Music;kushi;Kushi;Audience;Hero;cinema theater;CinemaWed, 15 May 2024 15:06:05 GMTసూపర్ స్టార్ మహేష్ బాబు తన కెరీర్ లో ఎన్నో అదిరిపోయే రేంజ్ బ్లాక్ బాస్టర్ విజయాలను అందుకున్నాడు. కొన్ని అపజయాలను కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్నాడు. మహేష్ ఎప్పుడు కూడా రొటీన్ కథలకు దూరంగా ఉంటూ సరికొత్త కథాంశాలతో అంతే కొత్త స్క్రీన్ ప్లే తో సాగే సినిమాలలో నటించడానికి ఎక్కువ ఆసక్తిని చూపిస్తూ ఉంటాడు. అందులో భాగంగా తన కెరీర్ లో ఎన్నో డిఫరెంట్ సినిమాల్లో మహేష్ నటించాడు. మహేష్ డిఫరెంట్ కాన్సెప్ట్ తో అంతే డిఫరెంట్ వే లో ఉన్న స్క్రీన్ ప్లే తో నడిచే కొన్ని సినిమాలలో నటించినప్పటికీ అందులో కొన్ని అపజాయలను కూడా సాధించాయి. 

అయినప్పటికీ మహేష్ మాత్రం తన రూట్ నీ మార్చకుండా ప్రేక్షకులకు సరికొత్త కంటెంట్ ను ఇవ్వాలి అనే ఉద్దేశంతో ఎప్పటికప్పుడు డిఫరెంట్ స్టోరీలతో రూపొందే సినిమాలలో నటిస్తూ వస్తున్నాడు. ఇకపోతే మహేష్ హీరో గా రూపొందిన డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ లలో నాని మూవీ ఒకటి. ఈ సినిమాకు ఎస్ జె సూర్య దర్శకత్వం వహించగా ... ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించాడు. అమీషా పటేల్మూవీ లో మహేష్ కు జోడి గా నటించింది. సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ మూవీ లో హీరో గా నటించడం , ఖుషి లాంటి బ్లాక్ బాస్టర్ తర్వాత ఎస్ జె సూర్య దర్శకత్వం వహించిన మూవీ కావడం , రెహమాన్ ఈ సినిమాకు సంగీతం అందించడంతో ఈ మూవీ పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

అలా భారీ అంచనాల నడుమ ఈ సినిమా 2004 వ సంవత్సరం మే 14 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ సినిమా డిఫరెంట్ గానే ఉన్నప్పటికీ ఆ సమయంలో జనాలకు పెద్దగా నచ్చలేదు. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లను వసూలు చేయడంలో ఫెయిల్ అయింది. చివరిగా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర నిర్మాతలకు నష్టాలనే మిగిల్చింది. అయినప్పటికీ మహేష్ కెరియర్ లో ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో రూపొందిన సినిమాగా నాని మూవీ నిలిచిపోయింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో 20 సంవత్సరాలు పూర్తి అయ్యింది. ఈ సినిమా టీవీలో ప్రసారం అయినప్పుడు మాత్రం మంచి ప్రేక్షకాదరణ పొందుతుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>