MoviesPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/thamanna--raashi-khannaf30b37fc-4b72-4cd9-b1d9-2829383bdef1-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/thamanna--raashi-khannaf30b37fc-4b72-4cd9-b1d9-2829383bdef1-415x250-IndiaHerald.jpgప్రముఖ తమిళ డైరెక్టర్ కమ్ హీరో సుందర్ సి దర్శకత్వంలో వచ్చిన హర్రర్ జోనర్ సిరీస్ అరణ్మనై. ఇందులో నాలుగో మూవీ 10 రోజుల క్రితం రిలీజ్ అయ్యింది. తమిళంలో అరణ్మనై 4గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాగా తెలుగులో బాక్ అనే టైటిల్ తో విడుదల చేశారు.ఈ అరణ్మనై సిరీస్ లో వచ్చిన గత మూడు సినిమాలలో రెండు కూడా మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. కానీ మూడో సినిమా మాత్రం జస్ట్ యావరేజ్ గా నిలిచింది.అయినా కానీ కొత్త కథలని నమ్ముకొని రిస్క్ చేయకుండా అదే కథని సుందర్ సి అరణ్మనై 4లో కూడా కొనసాగించారు. ఈ సిరీస్ కి ఉన్న ఆదరణ నThamanna - Raashi Khanna{#}sundar c;tamannaah bhatia;Rashi Khanna;Horror;Hero;Telugu;Kollywood;Tamil;Cinemaఅరణ్మనై 4: 2024 కోలీవుడ్ ఫస్ట్ హిట్.. ఊపేస్తోందిగా?అరణ్మనై 4: 2024 కోలీవుడ్ ఫస్ట్ హిట్.. ఊపేస్తోందిగా?Thamanna - Raashi Khanna{#}sundar c;tamannaah bhatia;Rashi Khanna;Horror;Hero;Telugu;Kollywood;Tamil;CinemaWed, 15 May 2024 12:19:31 GMTప్రముఖ తమిళ డైరెక్టర్ కమ్ హీరో సుందర్ సి దర్శకత్వంలో వచ్చిన హర్రర్ జోనర్ సిరీస్ అరణ్మనై. ఇందులో నాలుగో మూవీ 10 రోజుల క్రితం రిలీజ్ అయ్యింది. తమిళంలో అరణ్మనై 4గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రాగా తెలుగులో బాక్ అనే టైటిల్ తో విడుదల చేశారు.ఈ అరణ్మనై సిరీస్ లో వచ్చిన గత మూడు సినిమాలలో రెండు కూడా మంచి హిట్ టాక్ సొంతం చేసుకున్నాయి. కానీ మూడో సినిమా మాత్రం జస్ట్ యావరేజ్ గా నిలిచింది.అయినా కానీ కొత్త కథలని నమ్ముకొని రిస్క్ చేయకుండా అదే కథని సుందర్ సి అరణ్మనై 4లో కూడా కొనసాగించారు. ఈ సిరీస్ కి ఉన్న ఆదరణ నేపథ్యంలో కోలీవుడ్ లో ఈ సినిమా మంచి ఓపెనింగ్స్ ని సొంతం చేసుకోవడమే కాదు కోలీవుడ్ లో 2024 లో ఫస్ట్ హిట్ అయిన సినిమాగా నిలిచింది. ఇక తెలుగులో కూడా వీకెండ్ మూడు రోజులు మంచి వసూళ్ళే వచ్చాయి. అయితే తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమా పెద్దగా కనెక్ట్ కాలేదు. కానీ తమిళంలో మాత్రం టాక్ తో సంబంధం లేకుండా పెర్ఫార్మన్స్ లో గ్రోత్ చూపిస్తూ మంచి వసూళ్లను రాబడుతుంది.


తమన్నా, రాశిఖన్నా ఈ మూవీలో లీడ్ రోల్స్ లో నటించారు. తమన్నా ఘోస్ట్ గా ఈ సినిమాలో చేయడం విశేషం. అలాగే ఈ ఇద్దరు హాట్ బ్యూటీల గ్లామర్ షో కూడా సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. దీంతో తమిళ్ ఆడియన్స్ సినిమా చూడటానికి థియేటర్స్ కి వెళ్ళారు. పైగా ఈ సినిమాకి పోటీగా పెద్దగా ఏ సినిమాలు లేకపోవడం బాగా కలిసి వచ్చింది. ఈ మూవీ పది రోజుల్లో వరల్డ్ వైడ్ గా ఏకంగా 50 కోట్ల గ్రాస్ ని దాటేసింది. తెలుగులో అయితే మొదటి వారంలో 2.8 కోట్ల గ్రాస్ ను బాక్ మూవీ కలెక్ట్ చేసింది. మిగిలిన మూడు రోజుల్లో మాత్రం కేవలం 75 లక్షల గ్రాస్ వసూళ్లు అందుకుంది. దీంతో ఇప్పటి దాకా 3.55 కోట్ల గ్రాస్ బాక్ సినిమా సాధించింది. అందులో షేర్ వచ్చేసి 1.8 కోట్ల దాకా ఉంది. అయితే 2.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ లెక్కన ఈ సినిమా ఇంకా 70 లక్షల షేర్ రాబట్టాల్సి ఉంది.వరల్డ్ వైడ్ గా 17 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో రిలీజ్ అయిన మూవీ 10 రోజుల్లోనే 26.25 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. అంటే 9.25 కోట్ల ప్రాఫిట్ అరణ్మనై సినిమా రాబట్టి 2024 కోలీవుడ్ ఫస్ట్ క్లీన్ హిట్టుగా నిలిచింది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>