PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-chandrababu-naidu-peddireddy895f1116-c95d-4ee0-8981-c75547f5908b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/-chandrababu-naidu-peddireddy895f1116-c95d-4ee0-8981-c75547f5908b-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. కొన్ని గొడవల మధ్య ఈ ఎన్నికలు ముగిసాయి. అయితే కీలకమైన నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనేది తెలుసుకోవడానికి విశ్లేషకులు ఓటింగ్ సరళిని దగ్గరగా పరిశీలించారు. వారి ప్రకారం ఈసారి కొన్ని స్థానాలలో వైసీపీ కచ్చితంగా గెలుస్తుంది. వాటిలో ఒకటి పుంగనూరు. ఈ నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఈసారి కూడా ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. Chandrababu Naidu Peddireddy{#}Traffic police;Chaitanya;MLA;Assembly;Yevaru;CBN;TDP;Party;YCP;Electionsవిక్టరీ: చంద్రబాబు పప్పులు ఉడకలే.. పెద్దిరెడ్డి దెబ్బకు నాయుడు అబ్బ?విక్టరీ: చంద్రబాబు పప్పులు ఉడకలే.. పెద్దిరెడ్డి దెబ్బకు నాయుడు అబ్బ?Chandrababu Naidu Peddireddy{#}Traffic police;Chaitanya;MLA;Assembly;Yevaru;CBN;TDP;Party;YCP;ElectionsWed, 15 May 2024 09:40:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మే 13న అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. కొన్ని గొడవల మధ్య ఈ ఎన్నికలు ముగిసాయి. అయితే కీలకమైన నియోజకవర్గాల్లో ఎవరు గెలుస్తారనేది తెలుసుకోవడానికి విశ్లేషకులు ఓటింగ్ సరళిని దగ్గరగా పరిశీలించారు. వారి ప్రకారం ఈసారి కొన్ని స్థానాలలో వైసీపీ కచ్చితంగా గెలుస్తుంది. వాటిలో ఒకటి పుంగనూరు. ఈ నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వైసీపీ నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఈసారి కూడా ఆయన గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఈసారి పుంగనూరులో టీడీపీ నుంచి చల్లా రామచంద్రారెడ్డి, భారత చైతన్య యోజన పార్టీ నుంచి బోడె రామచంద్ర యాదవ్, వైసీపీ నుంచి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పోటీ చేశారు. అందరి పేర్లలో కామన్ గా రామచంద్ర రావడం విశేషం. అయితే చంద్రబాబు ఈ నియోజకవర్గంలో బోడె రామచంద్ర యాదవ్ ను దింపి పెద్దిరెడ్డికి బాగా ఇబ్బంది కలిగించారు. రామచంద్ర యాదవ్ నియోజకవర్గం అంతా తిరుగుతూ ప్రజలను తన వైపు ఆకర్షించుకోవడానికి చాలానే డబ్బులను వేచించారు. పెద్దిరెడ్డి ఒక రౌడీ, ఆయన అరాచకాల నుంచి విముక్తి కలగాలంటే తనకు ఓటు వేయాలంటూ కోరారు.

 పుంగనూరును బాగా అభివృద్ధి చేస్తానని, పెద్దిరెడ్డి లాగా దోచుకునే నైజాం తనది కాదంటూ చెప్పుకొచ్చారు. ఆ నియోజకవర్గ ప్రజలకు డబ్బులు ఇస్తూ మనసున్న నాయకుడిగా పేరు తెచ్చుకునేందుకు యత్నించారు. ప్రతి రైతుకు ఒక పాడి ఆవును కూడా ఇస్తానని బంపర్ ఆఫర్ ప్రకటించారు. అలానే అక్కడ పెద్దిరెడ్డికి అనుకూలంగా పనిచేసే పోలీస్ అధికారులను బదిలీ చేయించారు. అనేక గొడవలు చేయించి పుంగనూరును ఒక సమస్యాత్మక ప్రాంతంగా మార్చారు. చంద్రబాబు డైరెక్షన్‌లో బోడె రామచంద్ర యాదవ్ చేసిన ప్రయత్నాలు అన్నీ ఇన్నీ కావు.

అయితే చంద్రబాబు ఎన్ని చేసినా ఆయన పప్పులు ఉడకలేదని తెలుస్తోంది. ఓటింగ్ సరళి ప్రకారం చాలా ఓట్లు పెద్దిరెడ్డికే పడినట్లు సమాచారం. ఓట్ల డబ్బులు పంపిణీ విషయంలో పెద్దిరెడ్డి ముందు రామచంద్ర యాదవ్ తేలిపోయారని ప్రచారం జరిగింది ఇక్కడే అతన్ని బాగా దెబ్బతీసే పెద్దిరెడ్డి ప్రజలను తన వైపు తిప్పుకోగలిగారని టాక్‌ నడిచింది. దాన్ని బట్టి పెద్దిరెడ్డి దెబ్బకు నాయుడు అబ్బ అన్నట్లే జరిగింది. ఈసారి ఈ కీలక నియోజకవర్గం నుంచి ఆయనే గెలుస్తారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>