Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp97850b02-b710-4e6b-a6d5-f93e9dbd47c2-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/bjp97850b02-b710-4e6b-a6d5-f93e9dbd47c2-415x250-IndiaHerald.jpgఇటీవల తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు గాను ఎన్నికలు జరిగాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బిజెపి బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా పోటీపడ్డాయి. ఈ క్రమంలోనే ఎవరికి వారు గెలుపే లక్ష్యంగా పావులు కలుపుతూ ప్రచార రంగంలో దూసుకుపోయారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే తమను గెలిపిస్తే ఏం చేస్తాము అనే విషయంపై హామీల వర్షం కురిపించారు. అయితే ఈసారి తెలంగాణలో ఓటింగ్ శాతం కూడా పెరగడంతో.. ఇక గెలుపు ఎవరి వైపు ఉంటుంది అనే విషయంపై మరింత ఉత్కంఠ నెలకొంది. ఇక మొన్నటి వరకు ప్రBjp{#}Mahbubnagar;Scheduled caste;Parliament;central government;Reddy;Elections;Minister;Parliment;Congress;Bharatiya Janata Party;CM;Success;Varshamతెలంగాణలో బిజెపి ఎన్ని సీట్లు గెలుస్తుందో.. ఆమె ముందే చెప్పేసిందిగా?తెలంగాణలో బిజెపి ఎన్ని సీట్లు గెలుస్తుందో.. ఆమె ముందే చెప్పేసిందిగా?Bjp{#}Mahbubnagar;Scheduled caste;Parliament;central government;Reddy;Elections;Minister;Parliment;Congress;Bharatiya Janata Party;CM;Success;VarshamTue, 14 May 2024 16:00:00 GMTఇటీవల తెలంగాణలో 17 పార్లమెంటు స్థానాలకు గాను ఎన్నికలు జరిగాయి అన్న విషయం తెలిసిందే. అయితే ఇక ఈ పార్లమెంట్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బిజెపి బిఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు తీవ్రంగా పోటీపడ్డాయి. ఈ క్రమంలోనే ఎవరికి వారు గెలుపే లక్ష్యంగా పావులు కలుపుతూ ప్రచార రంగంలో దూసుకుపోయారు అని చెప్పాలి. ఈ క్రమంలోనే తమను గెలిపిస్తే ఏం చేస్తాము అనే విషయంపై హామీల వర్షం కురిపించారు. అయితే ఈసారి తెలంగాణలో ఓటింగ్ శాతం కూడా పెరగడంతో.. ఇక గెలుపు ఎవరి వైపు ఉంటుంది అనే విషయంపై మరింత ఉత్కంఠ నెలకొంది.


 ఇక మొన్నటి వరకు ప్రచారంతో హోరెత్తించిన అభ్యర్థులు అందరిలో కూడా టెన్షన్ మొదలైంది. ప్రచారం నిర్వహించి తాము చేయాల్సినంత చేసాం. కానీ ఓటర్లు ఏం నిర్ణయించారో అనుకుంటూ తెగ ఆందోళన చెందుతున్నారు. ఇంకొంతమంది అభ్యర్థులు తమదే విజయం అంటూ ధీమాతో ఉన్నారు. ఈసారి తెలంగాణలో బిజెపి పార్టీ భారీ స్థానాలలోనే విజయం సాధించే అవకాశం ఉంది అని రాజకీయ విశ్లేషకులు కూడా అంచనా వేస్తున్నారు. అయితే ఇక పార్లమెంట్ ఎన్నికల ఫలితాలలో బిజెపి ఎన్ని సీట్లు గెలుస్తుంది అనే విషయంపై మహబూబ్ నగర్ లోక్ సభ బిజెపి అభ్యర్థి మాజీ మంత్రి డీకే అరుణ ముందే చెప్పేసారు.



 మహబూబ్నగర్లో 8 సార్లు సీఎం రేవంత్ రెడ్డి వచ్చి ప్రచారం చేసిన పలుచోట్ల కాంగ్రెస్ నేతలు యువతను భయపెట్టిన యువత మాత్రం బిజెపి వైపు నిలిచారు అంటూ డీకే అరుణ చెప్పుకొచ్చాడు. తెలంగాణలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యాం అంటూ తెలిపారు. ఎస్సీ ఎస్టీ బీసీలు అందరూ కూడా బిజెపికి అండగా ఉన్నారు అంటూ చెప్పుకోచ్చారు. మహబూబ్నగర్లో 3 లక్షల మెజారిటీతో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేశారు ఆమె. ఇక రాష్ట్రంలోమోడీ మేనియా కొనసాగిందని.. యువత మొత్తం బిజెపికే ఓటు వేశారని ధీమా వ్యక్తం చేశారు. అందుకే 12 నుంచి 14 స్థానాలలో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ లో బిజెపి గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు డీకే అరుణ.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>