PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagamantha-jagane8850d41-7d09-4874-b9df-1b7118bc2721-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagamantha-jagane8850d41-7d09-4874-b9df-1b7118bc2721-415x250-IndiaHerald.jpgమే 13వ తేదీన అంటే నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ముగిశాయి. మహిళలు, వృద్ధులు, పల్లె ప్రజలు ఎక్కువగా ఓట్లు వేసారు. వారే జగన్ బలం కాబట్టి భారీ మెజారిటీతో వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ పీపుల్ మూడ్‌ను చూసి జగన్ కే ఎక్కువ ఓట్లు పడినట్లు చెబుతున్నారు. గట్టి పోటీ ఉన్నచోట్ల కూడా వైసీపీ ట్రై చెయ్ సాధించే ఛాన్స్ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. Jagamantha Jagan{#}Kotla Sujathamma;Buggana Rajendranath Reddy;Nandyala;surya sivakumar;central government;Cheque;local language;Bank;CBN;MLA;Loksabha;Minister;CM;YCP;TDP;Reddy;Andhra Pradesh;Jagan;Hanu Raghavapudi;Assemblyజగమంత జగన్: నంద్యాల జిల్లాలో అక్కడ వైసీపీకి గట్టి పోటీ.. అయినా విజయం జగన్‌దే..?జగమంత జగన్: నంద్యాల జిల్లాలో అక్కడ వైసీపీకి గట్టి పోటీ.. అయినా విజయం జగన్‌దే..?Jagamantha Jagan{#}Kotla Sujathamma;Buggana Rajendranath Reddy;Nandyala;surya sivakumar;central government;Cheque;local language;Bank;CBN;MLA;Loksabha;Minister;CM;YCP;TDP;Reddy;Andhra Pradesh;Jagan;Hanu Raghavapudi;AssemblyTue, 14 May 2024 07:49:00 GMTమే 13వ తేదీన అంటే నిన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ముగిశాయి. మహిళలు, వృద్ధులు, పల్లె ప్రజలు ఎక్కువగా ఓట్లు వేసారు. వారే జగన్ బలం కాబట్టి భారీ మెజారిటీతో వైసీపీ మళ్లీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏపీ పీపుల్ మూడ్‌ను చూసి జగన్ కే ఎక్కువ ఓట్లు పడినట్లు చెబుతున్నారు. గట్టి పోటీ ఉన్నచోట్ల కూడా వైసీపీ ట్రై చెయ్ సాధించే ఛాన్స్ ఉన్నట్లు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

చాలా పోటీ ఉన్న నియోజకవర్గాల్లో నంద్యాల జిల్లాలోని డోన్ అసెంబ్లీ ప్రాంతం ఒకటి. ఇక్కడ కేంద్ర రైల్వే శాఖ మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి, ప్రస్తుత రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పోటీ పడుతున్నారు. బుగ్గన 2014, 2019 ఎన్నికల్లో బ్యాక్ టు బ్యాక్ విన్ అయి తన సత్తా చాటారు. ఇప్పుడు కూడా గెలిచి హ్యాట్రిక్ విజయాలను సాధించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈసారి జగన్ కి అనుకూలమైన ఓటు బ్యాంక్ మొత్తం అన్నిచోట్లా పడింది. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి డోన్ నియోజకవర్గాన్ని బాగానే అభివృద్ధి చేశారు స్థానికంగా ఉన్న సమస్యలను కూడా బాగానే పరిష్కరించగలిగారు.

ఆయన ప్రత్యర్థి కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి కూడా ప్రజల్లో బాగానే ఆదరణ కలిగి ఉన్నారు. ఈ టీడీపీ నాయకుడితో పాటు ఆయన కుటుంబం అనేక ఏళ్లుగా స్థానిక రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్నారు. ఇదిలా ఉండగా వైసీపీ పాలనపై నియోజకవర్గ ప్రజలు స్పష్టంగా వ్యతిరేకత చూపించారని, డోన్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీదే గెలుపు అన్నట్లు తాజాగా మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ విశ్వాసం వ్యక్తం చేశారు. మే 13న డోన్‌ పట్టణంలోని పలు పోలింగ్‌ కేంద్రాలను చెక్ చేసిన అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ఈ వ్యాఖ్యలు చేశారు. తెదేపా అధినేత చంద్రబాబు జగన్ అరాచక పాలనపై పెద్ద పోరాటం చేశారని పేర్కొన్నారు. ఆ పోరాటానికి ప్రజలు అండగా నిలిచి ఆయనను సీఎం పీఠం ఎక్కిస్తారని ధీమా వ్యక్తం చేశారు. కానీ పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సెంటిమెంటును, వారి నాడిని తెలుసుకున్న రాజకీయ విశ్లేషకులు మాత్రం డోన్‌లో వైసీపీ విజయ బావుటా ఎగరవేయవచ్చని అంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>