PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politics-voting3edda7c7-740a-461f-9d15-5221c06102fb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-politics-voting3edda7c7-740a-461f-9d15-5221c06102fb-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. అయితే ఈసారి ఓట్ల సునామీ క్రియేట్ అయింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాజాగా ఎన్నికల సంఘం చెప్పిన ప్రకారం ఏపీలో 78.36% పోలింగ్ నమోదయింది. బాపట్ల, చిత్తూరు, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం, సత్య సాయి, పశ్చిమగోదావరి, నంద్యాల జిల్లాల్లో 82 శాతానికి పైగా ఓటింగ్ నమోదు కావడం విశేషం. మిగతా జిల్లాల్లో 65 నుంచి 81 లోపు ఓటింగ్ శాతం నమోదు అయింది. 2014లో 74 శాతం ఓట్లు పడ్డాయి కానీ ఈసారి ఆరు శాతానికి పైగా ఎక్కువ ఓట్లు నమోదు అయ్యాయి. ఓటింగ్ శాతం ఎAP POLITICS;VOTING{#}CBN;satya;Jagan;Andhra Pradesh;london;CM;CBI;Assembly;Tsunami;TDP;YCP;Nandyalaఏపీ: ఆంధ్రాలో ఓటు సునామీ.. ఎవరిని ముంచేస్తుందో..?ఏపీ: ఆంధ్రాలో ఓటు సునామీ.. ఎవరిని ముంచేస్తుందో..?AP POLITICS;VOTING{#}CBN;satya;Jagan;Andhra Pradesh;london;CM;CBI;Assembly;Tsunami;TDP;YCP;NandyalaTue, 14 May 2024 20:10:15 GMT ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తాజాగా అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. అయితే ఈసారి ఓట్ల సునామీ క్రియేట్ అయింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే తాజాగా ఎన్నికల సంఘం చెప్పిన ప్రకారం ఏపీలో 78.36% పోలింగ్ నమోదయింది. బాపట్ల, చిత్తూరు, కోనసీమ, ఏలూరు, పశ్చిమగోదావరి, ప్రకాశం, సత్య సాయి, పశ్చిమగోదావరి, నంద్యాల జిల్లాల్లో 82 శాతానికి పైగా ఓటింగ్ నమోదు కావడం విశేషం. మిగతా జిల్లాల్లో 65 నుంచి 81 లోపు ఓటింగ్ శాతం నమోదు అయింది. 2014లో 74 శాతం ఓట్లు పడ్డాయి కానీ ఈసారి ఆరు శాతానికి పైగా ఎక్కువ ఓట్లు నమోదు అయ్యాయి. ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదైతే ఎవరికో ఒకరికి థంపింగ్ మెజారిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదంటే నెక్ టు నెక్ పోటీ ఉండవచ్చు.

 పోయినసారి నమోదైన ఓటింగ్ శాతాన్నే ఒక ఓట్ల సునామీగా అభివర్ణించవచ్చు. ఇక ఇప్పుడు అంతకు మించిన సునామీ అని చెప్పవచ్చు. అయితే ఈ ఓటు సునామీ కారణంగా అన్ని పార్టీలలో భయం నెలకొన్నది. పైకి మాత్రం జగన్ పాలనపై తీవ్ర వ్యతిరేకతతో ప్రజలు కసితో తమకే ఓట్లు వేశారని టీడీపీ చెబుతోంది. పోయినసారి తమ పాలనపై ఎలా అసంతృప్తి వ్యక్తం చేసి జగన్ కి భారీ ఎత్తున ఓట్లు వేశారో ఇప్పుడు తమకు అలా ఓట్లు చేశారని వారు చెప్పుకుంటున్నారు. అయితే వైసీపీ వాళ్లు ఈ సునామీ కారణంగా తాము గెలిచే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇందులో ఎవరి అంచనా కరెక్ట్ అనేది జులై 4వ తేదీన తేలుతుంది.

ఇకపోతే సీఎం జగన్ తాజాగా సీబీఐ కోర్టు అనుమతి పొంది విదేశాలకు వెళ్లిపోవడానికి రెడీ అయ్యారు ఆయన కుమార్తెలు ఇటీవల పులివెందులకు వచ్చే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వారిద్దరితో కలిసి జగన్ సతీ సమేతంగా లండన్ వెళ్ళనున్నారు అక్కడ హాయిగా గడిపి మళ్లీ తిరిగి ఏపీకి రానున్నారు. ఈసారి చంద్రబాబు నాయుడు ఓడిపోతే టీడీపీ పార్టీ పని ఖతం అవుతుందని చాలామంది అంటున్నారు. మరి రిజల్ట్స్ ఎవరికి అనుకూలంగా వస్తుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>