SportsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipla24e0776-90ab-411b-8f23-5e55396db048-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/ipla24e0776-90ab-411b-8f23-5e55396db048-415x250-IndiaHerald.jpg(ఐ పీ ఎల్ 2024) లో భాగంగా ఈ రోజు రాత్రి 7 గంటల 30 నిమిషాలకి ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఈ రెండు జట్లకు కూడా ఎంతో కీలకంగా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇప్పటి వరకు 13 మ్యాచ్ లను ఆడగా అందులో ఆరు మ్యాచులలో గెలుపొంది , ఏడు మ్యాచ్ లలో ఓడిపోయి 12 పాయింట్ లతో పాయింట్ల పట్టికలో 6 వ స్థానంలో ఉండగా , లక్నో జట్టు ఇప్పటి వరకు 12 మ్యాచ్ లను ఆడగా అందులో ఆరు మ్యాచ్ లలో గెలుపొంది ఆరింట్లో ఓడిపోయి 12 పాయింట్ లతో పాయింట్ల పట్టికలో 7 వ స్థానంలో ఉంది. ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టIpl{#}Yevaru;Lucknow;Delhiఈరోజు ఐపీఎల్ లో ఉత్కంఠ పోరు... గెలిస్తే ప్లే ఆప్స్... ఓడితే ఇక అంతే..!ఈరోజు ఐపీఎల్ లో ఉత్కంఠ పోరు... గెలిస్తే ప్లే ఆప్స్... ఓడితే ఇక అంతే..!Ipl{#}Yevaru;Lucknow;DelhiTue, 14 May 2024 14:30:00 GMT(ఐ పీ ఎల్ 2024) లో భాగంగా ఈ రోజు రాత్రి 7 గంటల 30 నిమిషాలకి ఢిల్లీ క్యాపిటల్స్ మరియు లక్నో మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ ఈ రెండు జట్లకు కూడా ఎంతో కీలకంగా మారింది. ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇప్పటి వరకు 13 మ్యాచ్ లను ఆడగా అందులో ఆరు మ్యాచులలో గెలుపొంది , ఏడు మ్యాచ్ లలో ఓడిపోయి 12 పాయింట్ లతో పాయింట్ల పట్టికలో 6 వ స్థానంలో ఉండగా , లక్నో జట్టు ఇప్పటి వరకు 12 మ్యాచ్ లను ఆడగా అందులో ఆరు మ్యాచ్ లలో గెలుపొంది ఆరింట్లో ఓడిపోయి 12 పాయింట్ లతో పాయింట్ల పట్టికలో 7 వ స్థానంలో ఉంది.

ఇక ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుకు ఈ రోజు లక్నో తో ఆడబోయే మ్యాచ్ చుట్ట చివరి మ్యాచ్ , ఇక లక్నో కు ఈ రోజు ఆడబోయే మ్యాచ్ తో పాటు మరో మ్యాచ్ కూడా మిగిలి ఉంది. ఢిల్లీ జట్టు ఈ రోజు కనక గెలిచినట్లు అయితే ఈ జట్టు ప్లే ఆఫ్ ఆశలు సజీవంగా ఉంటాయి. ఒక వేళ ఓడినట్లు అయితే ఢిల్లీ ఈ సీజన్ నుండి బయటకు వెళ్లి పోవాల్సి ఉంటుంది. ఇక లక్నో జట్టు ఈ రోజు మ్యాచ్ లో గెలిచినట్లు అయితే చాలా ఈజీగా ప్లే ఆప్స్ కి వెళుతుంది. ఒక వేళ ఓడినట్లు అయితే ఈ జట్టు ప్లే ఆఫ్ ఆశలు మొత్తం గల్లంతు కాకపోయినా తర్వాతి మ్యాచ్ లో కచ్చితంగా ఈ జట్టు గెలవవలసి ఉంటుంది. దానితో ఈ రోజు జరగబోయే మ్యాచ్ ఈ రెండు జట్లకు కూడా ఎంతో కీలకంగా మారింది.

ఇది ఇలా ఉంటే ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఈ సీజన్ ప్రారంభంలో అద్భుతమైన ఆట తీరును కనబరిచి చాలా కాలం పాయింట్ల పట్టికలో మెరుగైన స్థానంలో ఉంది. కానీ ఈ మధ్య కాలంలోనే ఈ టీం వరస అపజాయలను ఎదుర్కొంటూ పాయింట్ల పట్టికలో కింది స్థాయికి పడిపోయింది. ఇక లక్నో జట్టు కూడా గెలుపు , ఓటములు ఇలా రెండిటిని అందుకుంటూ ప్రస్తుతం ఏడవ స్థానంలో కొనసాగుతుంది. మరి ఈ రోజు జరగబోయే ఉత్కంఠ పోరులో ఎవరు గెలుస్తారా అనేది తెలియాలి అంటే మరికొన్ని గంటలు వేచి చూడాల్సిందే.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>