PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/elections9d130958-b199-45fb-81b5-abe8710a7d7c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/elections9d130958-b199-45fb-81b5-abe8710a7d7c-415x250-IndiaHerald.jpgఈరోజు అంటే మే 13న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో 17 స్థానాలకు లోక్‌సభ ఎన్నికలు జరగగా.. ఏపీలో 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఆంధ్రాలో ఇదే రోజున 175 అసెంబ్లీ సీట్లకు కూడా ఎన్నికల జరిగాయి. ఈరోజు ఈ 2 స్టేట్స్ లో ఎన్నికల జాతర లేదా ఎన్నికల పండుగ వాతావరణం నెలకొన్నది. తెలంగాణ అర్బన్ పీపుల్ ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి కనపరచలేదు కానీ గ్రామస్తులు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే పల్లెటూర్లలోనే కాకుండా సిటీలో కూడా ప్రజలు ఓట్లు elections{#}festival;Jagan;Loksabha;KCR;Population;Bharatiya Janata Party;Elections;Andhra Pradesh;Congress;Telangana;Assembly;YCP;TDP;Partyఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పోలింగ్ రోజు కామన్‌గా కనిపించిందేంటో తెలుసా..?ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పోలింగ్ రోజు కామన్‌గా కనిపించిందేంటో తెలుసా..?elections{#}festival;Jagan;Loksabha;KCR;Population;Bharatiya Janata Party;Elections;Andhra Pradesh;Congress;Telangana;Assembly;YCP;TDP;PartyMon, 13 May 2024 19:40:11 GMTఈరోజు అంటే మే 13న తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. తెలంగాణలో 17 స్థానాలకు లోక్‌సభ ఎన్నికలు జరగగా.. ఏపీలో 25 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరిగింది. ఆంధ్రాలో ఇదే రోజున 175 అసెంబ్లీ సీట్లకు కూడా ఎన్నికల జరిగాయి. ఈరోజు ఈ 2 స్టేట్స్ లో ఎన్నికల జాతర లేదా ఎన్నికల పండుగ వాతావరణం నెలకొన్నది. తెలంగాణ అర్బన్ పీపుల్ ఓటు వేయడానికి పెద్దగా ఆసక్తి కనపరచలేదు కానీ గ్రామస్తులు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. ఇక ఆంధ్రప్రదేశ్ లో అయితే పల్లెటూర్లలోనే కాకుండా సిటీలో కూడా ప్రజలు ఓట్లు వేయడానికి పోటెత్తారు.

అయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఈ పోలింగ్ రోజున ఒకటి కామన్ గా కనిపించింది అదేంటంటే మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలైన ఓటింగ్ శాతం 2 రాష్ట్రాల్లోనూ దాదాపు ఓకే లాగా ఉంది. ఒకటింటి దాక పోలైన ఓటింగ్ శాతం చూసుకుంటే, తెలంగాణలో 40.26 శాతం, తెలంగాణలో 40.38% నమోదు కావడం విశేషం. అంటే ఇంచుమించు పోలింగ్ ఒకేలా జరిగింది. ఇరు రాష్ట్రాల ప్రజలు మాట్లాడుకుని ఓట్లు వేసినట్లుగా ఈ గణాంకాలు కనిపిస్తున్నాయి.

ఏపీలో టీడీపీ ప్లస్ కూటమి, వైసీపీ పార్టీల మధ్య హోరా హోరీగా పోటీ జరిగింది. వైసీపీ అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రయత్నించగా, టీడీపీ మాత్రం జగన్ గద్దెక్కించడానికి యత్నించింది. టీడీపీ ఓటింగ్ భయంతో అక్కడక్కడ గొడవలకు కూడా దిగింది. మరోవైపు తెలంగాణలో బీఆర్ఎస్ కనీసం లోక్ సభ స్థానాలైనా గెలుచుకొని కాంగ్రెస్ పార్టీపై పై చేయి సాధించాలని భావించింది. కానీ రాజకీయ విశ్లేషకుల ప్రకారం కేసీఆర్ పార్టీ పెద్దగా సీట్లను గెలవలేకపోవచ్చు. తెలంగాణలో గులాబీ పార్టీ కంటే కమలం పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందని కూడా పొలిటికల్ అనలిస్టులు చెబుతున్నారు. జగన్ ఎలాగోలా ఈసారి గట్టు ఎక్కుతారనే సూచనలే కనిపిస్తున్నాయి. కేసీఆర్‌కు మాత్రం మరోసారి చేదు ఫలితాలు పలకరించనున్నాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>