PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu1e07b25d-47f8-469f-a1aa-6e339f1b76b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/chandrababu1e07b25d-47f8-469f-a1aa-6e339f1b76b8-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలైంది. ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 11 శాతం పోలింగ్ జరిగినట్టు సమాచారం అందుతోంది. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు. chandrababu{#}Undavalli;Nara Lokesh;kalyan;School;CBN;Varsham;Jagan;Telugu;Evening;kadapa;TDP;YCP;CM;Wife;Andhra Pradesh;media;Newsఓటు హక్కును వినియోగించుకున్న బాబు, జగన్.. బాబుకు కూడా అదే కష్టమొచ్చిందా!ఓటు హక్కును వినియోగించుకున్న బాబు, జగన్.. బాబుకు కూడా అదే కష్టమొచ్చిందా!chandrababu{#}Undavalli;Nara Lokesh;kalyan;School;CBN;Varsham;Jagan;Telugu;Evening;kadapa;TDP;YCP;CM;Wife;Andhra Pradesh;media;NewsMon, 13 May 2024 10:05:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉదయం 7 గంటలకే పోలింగ్ మొదలైంది. ఉదయం 9 గంటల వరకు రాష్ట్రంలో 11 శాతం పోలింగ్ జరిగినట్టు సమాచారం అందుతోంది. మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈ ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉండవల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాల పోలింగ్ కేంద్రంలో చంద్రబాబు తన సతీమణి భువనేశ్వరితో కలిసి ఓటు హక్కును వినియోగించుకున్నారు.
 
చంద్రబాబు కుప్పం నుంచి పోటీ చేస్తున్నా ఆయన ఓటు హక్కు మాత్రం ఉండవల్లిలో ఉండటం హాట్ టాపిక్ అవుతోంది. పవన్ కళ్యాణ్ లా చంద్రబాబు కూడా తన ఓటును తాను వినియోగించుకోలేని పరిస్థితి నెలకొందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. మరోవైపు వైఎస్ జగన్ తన భార్య భారతితో కలిసి కడప జిల్లా పులివెందులలోని భాకరాపురంలో తన ఓటు హక్కును వినియోగించుకుని వార్తల్లో నిలిచారు.
 
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సైతం తన ఓటు హక్కును వినియోగించుకున్నారని సమాచారం అందుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుండగా పోలింగ్ కేంద్రాల దగ్గర భారీ బందోబస్త్ ను ఏర్పాటు చేశారు. పలు పోలింగ్ కేంద్రాల దగ్గర 144 సెక్షన్ అమలులో ఉండటం గమనార్హం. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయిస్తుండగా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది.
 
తెలుగు రాష్ట్రాలలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఓటర్లు క్యూ లైన్లలో బారులు తీరారు. చెదురుముదురు ఘటనలు మినహా రాష్ట్రంలో పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతుండటం గమనార్హం. కొన్ని ప్రాంతాలలో మాత్రం టీడీపీ, వైసీపీ నేతల మధ్య ఘర్షణలు చోటు చేసుకుంటూ ఉండటం గమనార్హం. కొన్ని గ్రామాలలో పోలింగ్ అనుకున్న సమయానికి మొదలుకాకపోవడం ఓటర్లకు చిరాకు తెప్పిస్తోంది. భారీ వర్షం వల్ల కూడా కొన్ని ప్రాంతాలలో పోలింగ్ కు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కొన్ని ప్రాంతాలలో పోలింగ్ 2 గంటలు ఆలస్యంగా మొదలైంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>