PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ktr-jagan6cab3285-4507-4847-8074-94f05e982013-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ktr-jagan6cab3285-4507-4847-8074-94f05e982013-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్ర మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ కొద్ది నిమిషాల క్రితం తన కుటుంబంతో కలిసి ఓటు వేశారు. పోలింగ్ బూత్ నుంచి బయటికి వస్తే మీడియాతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏపీ పోలింగ్ ట్రెండ్స్ గురించి చెప్పాలని మీడియా మిత్రులు ప్రశ్నించారు. ఆ ప్రశ్నపై కేటీఆర్ స్పందిస్తూ.. ‘‘జగన్ నాకు బ్రదర్ లాంటి వాడు. అతను ఈ ఎలక్షన్‌లో మంచి మెజారిటీతో గెలుస్తారని నేను ఆశిస్తున్నాను. ” అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్‌ మోహన్‌ రెడ్డితో కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ ఉన్నతాధికారులకు మంచి సంబంధాలు ఇప్పటికీ ఉన్నట్లు KTR JAGAN{#}KCR;Loksabha;KTR;Father;Congress;Hindupuram;Telangana;Andhra Pradesh;Jagan;Minister;mediaపోలింగ్ వేళ జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్..?పోలింగ్ వేళ జగన్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన కేటీఆర్..?KTR JAGAN{#}KCR;Loksabha;KTR;Father;Congress;Hindupuram;Telangana;Andhra Pradesh;Jagan;Minister;mediaMon, 13 May 2024 13:23:00 GMTతెలంగాణ రాష్ట్ర మాజీ ఐటీ మంత్రి కేటీఆర్ కొద్ది నిమిషాల క్రితం తన కుటుంబంతో కలిసి ఓటు వేశారు. పోలింగ్ బూత్ నుంచి బయటికి వస్తే మీడియాతో కొద్దిసేపు ముచ్చటించారు. ఈ సందర్భంగా ఏపీ పోలింగ్ ట్రెండ్స్ గురించి చెప్పాలని మీడియా మిత్రులు ప్రశ్నించారు. ఆ ప్రశ్నపై కేటీఆర్ స్పందిస్తూ.. ‘‘జగన్ నాకు బ్రదర్ లాంటి వాడు. అతను ఈ ఎలక్షన్‌లో మంచి మెజారిటీతో గెలుస్తారని నేను ఆశిస్తున్నాను. ” అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీలో జగన్‌ మోహన్‌ రెడ్డితో కేటీఆర్‌, బీఆర్‌ఎస్‌ ఉన్నతాధికారులకు మంచి సంబంధాలు ఇప్పటికీ ఉన్నట్లు స్పష్టమవుతోంది.

ఇంతకుముందు కేసీఆర్ టీవీ9 ఇంటర్వ్యూకి హాజరైనప్పుడు కూడా జగన్ గెలుస్తారనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. తండ్రి కొడుకు ఇద్దరు కూడా జగన్ కి బాగా సపోర్ట్ ఇస్తున్నారని దీని బట్టి అర్థమవుతుంది. ఈ సారీ జగన్ అధికారంలోకి వస్తే ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి కేసీఆర్, కేటీఆర్ అతిథులుగా కంపల్సరీగా వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ ఎక్కువ సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకో తెలియదు కానీ లోక్‌సభ ఎన్నికలవేళ నాయకులు పెద్దగా తిరగలేదు. ఎక్కడా ప్రచారాల జోరు పెద్దగా కనిపించలేదు. ఓట్లకు డబ్బులు పెద్దగా పంచిపెట్టలేదు కూడా. చాలా చోట్ల కాంగ్రెస్ డబ్బు పంచలేదని ప్రచారం సాగింది. ఒక్క బీఆర్ఎస్ మాత్రమే ఒక్కో ఓటుకి రూ.500 చొప్పున డబ్బులు ఇచ్చింది.

ఇకపోతే ఏపీ సీఎం జగన్ ఈరోజు ఉదయమే ఓటు హక్కు వినియోగించుకొని ఓటు వేయమని అందరినీ కోరారు. ఆ సమయంలో జగన్ చాలా నవ్వుతూ తనదే విజయం అని చెప్పకనే చెప్పారు. ఇకపోతే ఏపీలో అక్కడక్కడ కొన్ని ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నా మిగతా చోట అంతా ప్రశాంతంగానే పోలింగ్ కొనసాగుతోంది. కోనసీమ జిల్లా, కర్నూలు, నంద్యాల,   చిత్తూరు, తూర్పుగోదావరి, పుంగనూరు, హిందూపురం లాంటి నియోజకవర్గాలలో పోలింగ్ శరవేగంగా పూర్తవుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>