PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/if-jagan-doesn-come-again-will-there-be-such-a-big-loss-for-the-poor8eeb32d9-01c2-4cc4-870a-556310bdc1bb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/if-jagan-doesn-come-again-will-there-be-such-a-big-loss-for-the-poor8eeb32d9-01c2-4cc4-870a-556310bdc1bb-415x250-IndiaHerald.jpgఅవును! జ‌గ‌న్ మ‌రోసారి అధికారంలోకి రాక‌పోతే.. ఏమౌవుతుంది? ఆయ‌న తిరిగి ప‌గ్గాలు చేప‌ట్ట‌క‌పోతే ఏమ‌వుతుంది? ఇదీ.. ఇప్పుడు హ‌ల్చ‌ల్ చేస్తున్న ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఐదేళ్లు జ‌గ‌న్ను చూశారు. ఆయ‌న పాల‌నను కూడా చూశారు. అయితే.. ఇప్పుడు కూట‌మిగా వ‌స్తున్న చంద్ర‌బాబు.. జ‌గ‌న్ పాల‌న‌కంటే ఎక్కువ‌గానే నిధులు ఇస్తామ‌ని.. సంక్షేమాన్ని అమ‌లు చేస్తామ‌ని చెబుతున్నారు. అంతేకాదు.. మెగా డీఎస్సీ కూడా ఇస్తామ‌ని చెబుతున్నారు. తొలి సంత‌కం కూడా.. ఆయ‌న దీనిపైనే చేస్తామ‌ని చెబుతున్నారు. వెర‌సి మొత్తంగా జ‌గ‌న్ ఇస్తున్న‌AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; jagan; ys jagan; ycp;poor people {#}YCPజ‌గ‌న్ మ‌ళ్లీ రాక‌పోతే పేదోళ్ల‌కు ఇంత పెద్ద న‌ష్టం జ‌రుగుతుందా..?జ‌గ‌న్ మ‌ళ్లీ రాక‌పోతే పేదోళ్ల‌కు ఇంత పెద్ద న‌ష్టం జ‌రుగుతుందా..?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; jagan; ys jagan; ycp;poor people {#}YCPMon, 13 May 2024 07:09:03 GMTఅవును!  జ‌గ‌న్ మ‌రోసారి అధికారంలోకి రాక‌పోతే.. ఏమౌవుతుంది?  ఆయ‌న తిరిగి ప‌గ్గాలు చేప‌ట్ట‌క‌పోతే ఏమ‌వుతుంది?  ఇదీ.. ఇప్పుడు హ‌ల్చ‌ల్ చేస్తున్న ప్ర‌శ్న‌. ఎందుకంటే.. ఐదేళ్లు జ‌గ‌న్ను చూశారు. ఆయ‌న పాల‌నను కూడా చూశారు. అయితే.. ఇప్పుడు కూట‌మిగా వ‌స్తున్న చంద్ర‌బాబు.. జ‌గ‌న్ పాల‌న‌కంటే ఎక్కువ‌గానే నిధులు ఇస్తామ‌ని.. సంక్షేమాన్ని అమ‌లు చేస్తామ‌ని చెబుతున్నారు. అంతేకాదు.. మెగా డీఎస్సీ కూడా ఇస్తామ‌ని చెబుతున్నారు.


తొలి సంత‌కం కూడా.. ఆయ‌న దీనిపైనే చేస్తామ‌ని చెబుతున్నారు. వెర‌సి మొత్తంగా జ‌గ‌న్ ఇస్తున్న‌ సంక్షేమం  క‌న్నా కూడా.. ఎక్కువే చేస్తామ‌నిచంద్ర‌బాబు, కూట‌మి పార్టీలు కూడా చెబుతున్నాయి. మ‌రి అలాంట‌ప్పుడు జ‌గ‌న్ ఇప్పుడు రాక‌పోతే ఏమౌవుతుంది?  అనేది ప్ర‌శ్న‌. దీనిపై రెండు ర‌కాల వాద‌నలు వినిపిస్తున్నాయి. ఒక‌టి.. జ‌గ‌న్ మ‌రోసారి రాక‌పోతే.. ఆయ‌న‌కే మంచిద‌నే వాద‌న వినిపిస్తోంది. ప్ర‌జ‌ల‌కు జ‌గ‌న్ అంటే ఏంటో తెలుస్తుంద‌ని చెబుతున్నారు. అంతేకాదు.. చంద్ర‌బాబు పాల‌న‌పై ఆయ‌న స‌మీక్ష చేసే అవ‌కాశంతోపాటు.. తాను ఇస్తున్న విధంగా ప‌థ‌కాల‌ను అమ‌లుచేయ‌క‌పోతే.. నిల‌దీసే అవ కాశం ల‌భిస్తుంద‌ని కూడా అంటున్నారు.


ఇవ‌న్నీ ఇలా ఉంటే.. తాను చేసిన అప్పుల‌కు కూడా బాధ్య‌త చంద్ర‌బాబుదే అవుతుంది.. ఆయ‌న చెల్లించాల్సి ఉంటుంది. కాబ‌ట్టి.. త‌న బాధ్య‌త త‌ప్పుతుంది కాబ‌ట్టి జ‌గ‌న్ ప్ర‌శాంతంగా ఉండొచ్చు అని కొంద‌రు అంటున్నారు. కానీ జ‌గ‌న్ రాక‌పోతే చాలా వ‌ర‌కు తాము న‌ష్ట పోతాం అన్న భావ‌న ఏపీలో పేద‌, దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి వ‌ర్గాల్లో ఉంటోంది.


మ‌రోవాద‌న ఏంటంటే.. జ‌గ‌న్ రాక‌పోతే.. ఇప్పుడు సంక్షేమ ప‌థ‌కాలు అందుతున్న వారిలో స‌గం మందిని లేపేస్తార‌ని.. వీరిలో ఎక్కువ మందికి త‌గ్గించే అవ‌కాశం ఉంద‌ని ఒక లెక్క ప్ర‌చారం జ‌రుగుతోంది. ఇక‌, వైసీపీ నాయ‌కుల‌పై కేసుల‌పై కేసులు పెట్టి.. వేధించే  అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. రెడ్‌బుక్‌లో పేరున్న అధికారుల‌కు కూడా ఇబ్బందులు త‌ప్ప‌వ‌ని మ‌రో వ‌ర్గం చెబుతోంది. మొత్తంగా ఎన్నిక‌ల‌కు ముందు.. ఈ ఆస‌క్తిక‌ర చ‌ర్చ రాజ‌కీయంగా ప్రాధాన్యం సంత‌రించుకుంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>