PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp62dc984b-30fb-49ee-b88e-902a468d45ef-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp62dc984b-30fb-49ee-b88e-902a468d45ef-415x250-IndiaHerald.jpgచాలా సంవత్సరాల క్రితం విశాఖపట్టణం ఏరియా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. టీడీపీ పార్టీకి ఈ ప్రాంతం నుండి భారీ మొత్తంలో సీట్లు వచ్చేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ సీన్ పూర్తిగా మారింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో 2014 వ సంవత్సరం మొదటి సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ పార్టీకి ఈ ప్రాంత ప్రజల నుండి మంచి ఆదరణ దక్కింది. ఇక ఆ ఎలక్షన్ లలో తెలుగుదేశం పార్టీ కి భారీ మెజారిటీ రావడంతో ఈ పార్టీ చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నెలYcp{#}Capital;krishna;Amaravati;Guntur;Vishakapatnam;Telugu Desam Party;Hanu Raghavapudi;CBN;TDP;Andhra Pradesh;YCP;Elections;Assembly;Partyవిశాఖ‌లో ఈ సారి సీన్ రివ‌ర్స్‌... ఫ్యాన్ ప్ర‌భంజ‌నం ముందు సై ' కిల్ ' అయ్యిందిగా..?విశాఖ‌లో ఈ సారి సీన్ రివ‌ర్స్‌... ఫ్యాన్ ప్ర‌భంజ‌నం ముందు సై ' కిల్ ' అయ్యిందిగా..?Ycp{#}Capital;krishna;Amaravati;Guntur;Vishakapatnam;Telugu Desam Party;Hanu Raghavapudi;CBN;TDP;Andhra Pradesh;YCP;Elections;Assembly;PartyMon, 13 May 2024 12:06:03 GMTచాలా సంవత్సరాల క్రితం విశాఖపట్టణం ఏరియా తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉండేది. టీడీపీ పార్టీకి ఈ ప్రాంతం నుండి భారీ మొత్తంలో సీట్లు వచ్చేవి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ సీన్ పూర్తిగా మారింది. రాష్ట్రం విడిపోయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో 2014 వ సంవత్సరం మొదటి సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీడీపీ పార్టీకి ఈ ప్రాంత ప్రజల నుండి మంచి ఆదరణ దక్కింది. ఇక ఆ ఎలక్షన్ లలో తెలుగుదేశం పార్టీ కి భారీ మెజారిటీ రావడంతో ఈ పార్టీ చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నెలకొల్పింది.

ఇకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఈ రాష్ట్రానికి రాజధాని లేకపోవడంతో ఏపీలో విశాఖపట్నం పెద్ద పట్టణం కావడంతో దీనినే రాజధాని చేస్తారు అని అంతా భావించారు. కానీ అనూహ్యంగా కృష్ణ , గుంటూరు మధ్య రాజధాని ఉంటే బాగుంటుంది అని ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు ఆ టైమ్ లో అమరావతిని రాజధానిగా ఎంపిక చేసుకున్నాడు. అలాగే అక్కడ ఎన్నో భవనాలను నిర్మించే దానిని ఆధునికరించాడు. ఇక ఈ విషయంతోనే విశాఖ ప్రజలు చంద్రబాబు నాయుడు పై ఫైర్ అయ్యారు.

ఇక ఆ తర్వాత 2019 వ సంవత్సరం ఎన్నికలు రానే వచ్చాయి. ఇక అందులో మాత్రం విశాఖ ప్రజలు తమ ప్రతాపాన్ని చూపించారు. తెలుగు దేశం పార్టీ కి విశాఖ నుండి ఎక్కువ సీట్లు రాలేదు. ఎక్కువ వైసీపీ పార్టీకి ఈ ప్రాంతం నుండి భారీ మొత్తంలో సీట్లు వచ్చాయి. వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చాక కూడా అమరావతి మాత్రమే రాజధాని కాకుండా మూడు రాజధానుల ప్రస్తావనను తెరపైకి తెచ్చారు. దానితో విశాఖ ప్రజలు ఆనందపడ్డారు. ఇకపోతే మొదటి నుండి కూడా ఈ ప్రాంతంలో కూటమి ఎక్కువ సీట్లు వస్తుంది అని ఆశించలేదు.

అందుకు తగినట్టుగానే జరుగుతున్నట్లు తెలుస్తుంది. ఈ రోజు ఉదయం నుండే పోలింగ్ స్టార్ట్ అయింది. విశాఖలో భారీగానే పోలింగ్ జరుగుతుంది. కాకపోతే ఇప్పటివరకు పడిన ఓట్లలో ఎక్కువ శాతం వైసీపీ పార్టీకే పడినట్లు కూటమి సైడు చాలా తక్కువ ఓట్లు పడినట్లు అవుతున్నట్లు తెలుస్తుంది. ఇలానే జరిగితే దాదాపుగా ఈ ప్రాంతంలో భారీ సీట్లను వైసీపీ కైవసం చేసుకునే విశాఖలో మరోసారి జోరు చూపించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>