DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/kutami94ed4e35-9bf2-49c2-9416-87df76991938-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/kutami94ed4e35-9bf2-49c2-9416-87df76991938-415x250-IndiaHerald.jpgఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో మూడు పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీలు లు కూటమిగా ఏర్పడి ముందుకు వచ్చాయి. వైసీపీని ఓటమి, జగన్ ను అధికారంలో నుంచి దించేయడమే ప్రధాన ఎజెండా ఈ కూటమి ఏర్పడింది. సరే దీనికి సంబంధించి ఎవరు ఇబ్బందులు పడ్డారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేశారు. ఎవరు త్యాగాలు చేశారు అనే విషయాలను పక్కన పెడితే.. ఈ కూటమి విజయవంతం అవుతుంతా.. ఇప్పుడిదే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. ఏది అయితే అది అవుతుందని తాంబూలాలు తీసేసుకొని ఎన్నికల కదన రంగంలోకి అడుగు పెట్టిన ఈ మూడు పార్టీలకు అక్కడక్కడా kutami{#}local language;Yevaru;Jagan;News;Partyఓటు బదిలీ హుళక్కే.. భారీ ఓటమి దిశగా కూటమి?ఓటు బదిలీ హుళక్కే.. భారీ ఓటమి దిశగా కూటమి?kutami{#}local language;Yevaru;Jagan;News;PartyMon, 13 May 2024 05:19:09 GMTఏపీలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల సమరంలో మూడు పార్టీలు టీడీపీ, జనసేన, బీజేపీలు లు కూటమిగా ఏర్పడి ముందుకు వచ్చాయి. వైసీపీని ఓటమి, జగన్ ను అధికారంలో నుంచి దించేయడమే ప్రధాన ఎజెండా ఈ కూటమి ఏర్పడింది. సరే దీనికి సంబంధించి ఎవరు ఇబ్బందులు పడ్డారు. ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేశారు. ఎవరు త్యాగాలు చేశారు అనే విషయాలను పక్కన పెడితే.. ఈ కూటమి విజయవంతం అవుతుంతా..



ఇప్పుడిదే ప్రశ్న అందరిలో తలెత్తుతోంది. ఏది అయితే అది అవుతుందని తాంబూలాలు తీసేసుకొని ఎన్నికల కదన రంగంలోకి అడుగు పెట్టిన ఈ మూడు పార్టీలకు అక్కడక్కడా ఆ పార్టీ నాయకులు చుక్కలు చూపించారు. అప్పటి వరకు పార్టీని నమ్ముకొని పనిచేసిన వారికి కాకుండా బయట నుంచి వచ్చిన వారికి టికెట్ ఇవ్వడం.. స్థానిక నేతలకు సమాచారం ఇవ్వకుండా ఎన్నికల ప్రచారం చేసుకోవడం.. వంటి కారణాలతో కూటమి నేతల మధ్య ఐక్యత దెబ్బతింది.



వైసీపీ వ్యతిరేక ఓటు చీలకుండా.. చూడడమే ఇప్పుడు ముఖ్యం. ఇదే సమయంలో కూటమి పార్టీల్లో ఓట్లు బదలాయింపు కూడా జరగాలి. ఈ రెండు కీలక అంశాలే. ఇప్పుడివే కూటమికి పరీక్ష పెడుతున్నాయి. నిజంగా చెప్పాలంటే అనుకున్నంత సులభంగా క్షేత్ర స్థాయిలో పరిస్థితులు కనిపించడం లేదు. ఈ విషయం ఆయా పార్టీలకు కూడా తెలుసు. ఇప్పటకీ మూడు పార్టీల నాయకులు, కార్యకర్తలు స్థానకంగా ఎడమెహం, పెడ మోహంగానే ఉన్నారు.



దీంతో పరిస్థితి మిశ్రమంగా మారింది.
సీటు దక్కని వారు అసంతృప్తిలో ఉన్నారు. ఉదాహరణకు తీసుకుంటే తిరుపతి, నూజివీడు, పి.గన్నవరం, ఎచ్చర్ల, శ్రీకాకుళం, చీపురుపల్లి వంటి అనేక నియోజకవర్గాల్లో సుమారు 50 స్థానాల వరకు నాయకుల మధ్య కలివిడి లేదని టాక్ నడుస్తోంది. ఇది కూటమిలో ప్రధాన చర్చకు దారి తీస్తోంది. మొత్తం మీద ఏ ఉద్దేశం మీద ఈ కూటమిని ఏర్పాటు చేశారో ఆ లక్ష్యం నెరవేరాలా కనిపించడం లేదన్నది విశ్లేషకుల అభిప్రాయం. మొత్తం మీద ఈ అంశాలన్నీ వైసీపీకి అనుకూలంగా మారతాయని అంచనా వేస్తున్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>