PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/is-tdp-losing-the-seat-won-by-32-thousand-in-2019-drowned-with-over-confidence5f0274ce-3a59-4be2-a1ac-95092686ae00-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/is-tdp-losing-the-seat-won-by-32-thousand-in-2019-drowned-with-over-confidence5f0274ce-3a59-4be2-a1ac-95092686ae00-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్‌లో 2019 సాధారణ ఎన్నికలలో అప్పటి అధికార తెలుగుదేశం పార్టీని వైసీపీ చిత్తుచిత్తుగా ఓడించి విజయం సాధించింది. వైసీపీ ఏకంగా 151 అసెంబ్లీ సీట్లతో పాటు 22 ఎంపీ సీట్లలో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. ఆ ఎన్నికలలో ప్రతిపక్ష టీడీపీకి కేవలం 23 ఎమ్మెల్యే సీట్లు.. మూడు పార్లమెంటు సీట్లు మాత్రమే వచ్చాయి. టీడీపీ గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో.. నలుగురు ఎప్పుడో పార్టీకి దూరమయ్యారు. ఇక పార్టీకి గెలిచిన ముగ్గురు ఎంపీలలో విజయవాడ ఎంపీ కేశినేని నాని సైతం పార్టీ మారిAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; MLA adi Reddy Bhavani; adi Reddy Vasu; MP magani Bharat rao; Godavari politics; Rajahmundry City; ysrcp{#}Kesineni Nani;Rajahmundry;bharath;Sri Bharath;Telugu Desam Party;Husband;Parliament;Vijayawada;Hanu Raghavapudi;Party;MP;MLA;TDP;Jagan;YCP;Assembly2019లో 32 వేల‌తో టీడీపీ గెలిచిన సీట్లో ఓడిపోతోందా... ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో మునిగిపోయిందిగా...!2019లో 32 వేల‌తో టీడీపీ గెలిచిన సీట్లో ఓడిపోతోందా... ఓవ‌ర్ కాన్ఫిడెన్స్‌తో మునిగిపోయిందిగా...!AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; MLA adi Reddy Bhavani; adi Reddy Vasu; MP magani Bharat rao; Godavari politics; Rajahmundry City; ysrcp{#}Kesineni Nani;Rajahmundry;bharath;Sri Bharath;Telugu Desam Party;Husband;Parliament;Vijayawada;Hanu Raghavapudi;Party;MP;MLA;TDP;Jagan;YCP;AssemblyMon, 13 May 2024 10:55:13 GMTఆంధ్రప్రదేశ్‌లో 2019 సాధారణ ఎన్నికలలో అప్పటి అధికార తెలుగుదేశం పార్టీని వైసీపీ చిత్తుచిత్తుగా ఓడించి విజయం సాధించింది. వైసీపీ ఏకంగా 151 అసెంబ్లీ సీట్లతో పాటు 22 ఎంపీ సీట్లలో విజయం సాధించి అధికారంలోకి వచ్చింది. జగన్ ముఖ్యమంత్రి పీఠం అధిరోహించారు. ఆ ఎన్నికలలో ప్రతిపక్ష టీడీపీకి కేవలం 23 ఎమ్మెల్యే సీట్లు.. మూడు పార్లమెంటు సీట్లు మాత్రమే వచ్చాయి. టీడీపీ గెలిచిన 23 మంది ఎమ్మెల్యేలలో.. నలుగురు ఎప్పుడో పార్టీకి దూరమయ్యారు. ఇక పార్టీకి గెలిచిన ముగ్గురు ఎంపీలలో విజయవాడ ఎంపీ కేశినేని నాని సైతం పార్టీ మారి ఎన్నికలలో వైసీపీ తరఫున విజయవాడ ఎంపీగా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.


ఇదిలా ఉంటే గత ఎన్నికలలో టీడీపీ గెలిచిన 23 ఎమ్మెల్యే స్థానాలలో రాజమండ్రి సిటీ స్థానం కూడా ఒకటి. రాజమండ్రి సిటీ తో పాటు రాజమండ్రి రూరల్ స్థానాలను టీడీపీ గెలుచుకున్న సంగతి తెలిసిందే. విచిత్రం ఏంటంటే కుప్పంలో చంద్రబాబుకు వచ్చిన మెజార్టీ కంటే.. రాజమండ్రి సిటీలో టీడీపీ నుంచి పోటీ చేసిన ఆదిరెడ్డి భవానికి ఎక్కువ మెజార్టీ వచ్చింది. ఆ ఎన్నికలలో ఆమెకు ఏకంగా 32వేల ఓట్ల భారీ మెజార్టీ వచ్చింది. అయితే ఈసారి టీడీపీ నుంచి భవాని భర్త ఆదిరెడ్డి వాసు పోటీ చేస్తున్నారు. గత ఎన్నికలలోనే 32 వేల ఓట్ల మెజార్టీతో గెలిచిన ఈ నియోజకవర్గంలో ఈసారి ఓవర్ కాన్ఫిడెన్స్ టీడీపీ కొంప ముంచేస్తుందని ప్రచారం జరుగుతోంది.


పైగా ఇక్కడ వైసీపీ నుంచి రాజమండ్రి ఎంపీగా ఉన్న మార్గాన్ని భరత్ రామ్ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలోనే భరత్‌ నుంచి ఓవైపు గట్టి పోటీ ఉంది. భరత్ ఐదేళ్లలో నియోజకవర్గాన్ని బాగా అభివృద్ధి చేశారు. ఈ టైంలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు చాలా ఓవర్ కాన్ఫిడెన్స్ కి వెళ్లి మరీ బొక్క బోర్లా పడినట్టు తెలుస్తోంది. ముందు నుంచి టీడీపీ కచ్చితంగా గెలుస్తుంది అన్న ధీమా ఉండేది. అయితే ఎన్నికలకు ముందు వచ్చేసరికి టాక్ మారినట్టు తెలుస్తోంది. మరి చివర్లో ఇక్కడ వైసీపీ మ్యాజిక్ చేసి అధికారంలోకి వస్తుందా.. మరోసారి టీడీపీ తన సిట్టింగ్ సీట్ నిలబెట్టుకుంటుందా.. అన్నది ఫలితాల రోజున తేలిపోనుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>