PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/betting-stones-who-got-excited-during-polling-in-ap-ycp-fans-are-excited-news2288f03f-ea0c-41ae-b6b2-d0d2f1e0ae51-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/betting-stones-who-got-excited-during-polling-in-ap-ycp-fans-are-excited-news2288f03f-ea0c-41ae-b6b2-d0d2f1e0ae51-415x250-IndiaHerald.jpgఏపీలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 పార్లమెంటు స్థానాలకు ఉదయం 7 గంట‌ల‌ నుంచి పోలింగ్ ప్రారంభమైంది . రాయలసీమలోని కొన్ని జిల్లాలతో పాటు పల్నాడు జిల్లాలోని నాలుగైదు నియోజకవర్గాల లోని పలు గ్రామాలలో మాత్రం ఘర్షణ లు నడుస్తున్నాయి. మిగిలిన చోట్ల పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతుంది. అంచనాలకు మించి ఇప్పటికే చాలాచోట్ల 20 శాతాని కి పైగా పోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఒటర్లు మాత్రం చాలా కసితో పోలింగ్ స్టేషన్లకు వచ్చి ఓట్లు వేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది . అయితే ఈ ఓటు ప్రభుత్వ వ్AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; jagan; ycp; tdp; chandrababu; Betting {#}Gharshana;Parliament;Assembly;Party;Andhra Pradesh;TDP;YCPఏపీలో పోలింగ్ వేళ రెచ్చిపోయిన బెట్టింగ్ రాయుళ్లు... వైసీపీ ఫ్యాన్స్ కాల‌రెగ‌రేసుకునే న్యూస్‌..!ఏపీలో పోలింగ్ వేళ రెచ్చిపోయిన బెట్టింగ్ రాయుళ్లు... వైసీపీ ఫ్యాన్స్ కాల‌రెగ‌రేసుకునే న్యూస్‌..!AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; jagan; ycp; tdp; chandrababu; Betting {#}Gharshana;Parliament;Assembly;Party;Andhra Pradesh;TDP;YCPMon, 13 May 2024 11:48:59 GMTఏపీలో ఉన్న 175 అసెంబ్లీ నియోజకవర్గాలతో పాటు 25 పార్లమెంటు స్థానాలకు ఉదయం 7 గంట‌ల‌ నుంచి పోలింగ్ ప్రారంభమైంది . రాయలసీమలోని కొన్ని జిల్లాలతో పాటు పల్నాడు జిల్లాలోని నాలుగైదు నియోజకవర్గాల లోని పలు గ్రామాలలో మాత్రం ఘర్షణ లు నడుస్తున్నాయి. మిగిలిన చోట్ల పోలింగ్ అయితే ప్రశాంతంగా జరుగుతుంది. అంచనాలకు మించి ఇప్పటికే చాలాచోట్ల 20 శాతాని కి పైగా పోలింగ్ జరిగింది. ఆంధ్రప్రదేశ్ ఒటర్లు మాత్రం చాలా కసితో పోలింగ్ స్టేషన్లకు వచ్చి ఓట్లు వేస్తున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది . అయితే ఈ ఓటు ప్రభుత్వ వ్యతిరేకతను సూచిస్తుందా..? లేదా ప్రభుత్వ అనుకూలతను సూచిస్తుందా..? అన్నది మాత్రం ఎవరికీ అంతుపట్ట‌డం లేదు.


ఇదిలా ఉంటే ఓవైపు పోలింగ్ జరుగుతుండగానే మరోవైపు బెట్టింగ్ రాయుళ్ళు రెచ్చిపోతున్నారు. ఎవరికి వారు తమ పార్టీ అధికారంలోకి వస్తుందని పందాలు కొడుతున్నారు. వైసీపీ కంచుకోట ఆయన రాయలసీమలో వైసీపీ బెట్టింగ్ రాయుళ్ల పందాలకు ప్ర‌త్య‌ర్ధులు హ‌డలెత్తిపోతున్నారు. రాయలసీమలో మొత్తం నాలుగు జిల్లాలలో కలిపి 52 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. గత ఎన్నికలలో వైసీపీ ఏకంగా 49 సీట్లు గెలుచుకుని అప్రతిహత విజయం సాధించింది.


అయితే ఈసారి వైసీపీకి కొన్ని సీట్లు తగ్గుతున్నాయి అన్న ప్రచారం జరుగుతుంది. టీడీపీకి 15 నుంచి 20 సీట్లు వస్తాయని.. ముందుగా ఆ పార్టీ వాళ్ళు లెక్కలు వేసుకున్నారు. అయితే ఇప్పుడు పోలింగ్ జరుగుతున్న తీరును బట్టి చూస్తే టీడీపీకి అంత సీన్ లేదన్న ప్రచారం జరుగుతుంది. వైసీపీ వాళ్లు అయితే తమ పార్టీకి 40 కి పైగా సీట్లు వస్తాయని పందాలు క‌డుతుంటే.. టీడీపీ వాళ్ళు ముందుకు రావడం లేదు. టీడీపీకి పది సీట్లు వస్తేనే గొప్ప అని పలు విశ్లేషణలు వ్యక్తం అవుతున్నాయి. ఏది ఏమైనా ఐదేళ్లు అధికారంలో ఉండి కూడా రాయలసీమలో వైసీపీ 40 సీట్లు గెలుచుకోవడం అంటే వైసీపీ ఫ్యాన్స్ కచ్చితంగా కాలర్ ఎగరేసుకునే న్యూస్ అని చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>