PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdpdf9d3363-332b-4dc2-abd0-040ad3f8284b-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/tdpdf9d3363-332b-4dc2-abd0-040ad3f8284b-415x250-IndiaHerald.jpgఅసలు మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకు తప్ప మరెవ్వరికీ టికెట్ గ్యారంటీ లేదన్నంత స్థాయిలో, నరసాపురం ఎంపీ రఘురామక్రిష్ణ రాజు చాలా చాలా ఓవర్ ప్రవచనాలు పలికారు. మూడు పార్టీలు జట్టుకట్టడం గ్యారంటీ అంటూనే.. ఆ కూటమిలో ఏ పార్టీకి నరసాపురం సీటు దక్కినా సరే.. అక్కడినుంచి ఎంపీగా పోటీచేయబోయేది మాత్రం తానేనని ఓవర్ కాన్ఫిడెన్స్ తో విర్రవీగారు.చివరికి ఏ సీటూ దక్కకపోగా, ఆయన మేలుకునే సరికి ఇక ఇవ్వడానికి సీట్లు కూడా ఖాళీ లేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడును బతిమాలారో ప్రలోభపెట్టారో తెలియదు గానీ.. మొత్తానికి TDP{#}narasapuram;Narsapur;Telugu Desam Party;Y. S. Rajasekhara Reddy;king;News;CBN;Party;MLA;Andhra Pradeshవిర్రవీగిన రఘురామరాజుకి ఝలక్?విర్రవీగిన రఘురామరాజుకి ఝలక్?TDP{#}narasapuram;Narsapur;Telugu Desam Party;Y. S. Rajasekhara Reddy;king;News;CBN;Party;MLA;Andhra PradeshMon, 13 May 2024 10:38:00 GMTఅసలు మొత్తం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తనకు తప్ప మరెవ్వరికీ టికెట్ గ్యారంటీ లేదన్నంత స్థాయిలో, నరసాపురం ఎంపీ రఘురామక్రిష్ణ రాజు చాలా చాలా ఓవర్ ప్రవచనాలు పలికారు. మూడు పార్టీలు జట్టుకట్టడం గ్యారంటీ అంటూనే.. ఆ కూటమిలో ఏ పార్టీకి నరసాపురం సీటు దక్కినా సరే.. అక్కడినుంచి ఎంపీగా పోటీచేయబోయేది మాత్రం తానేనని ఓవర్ కాన్ఫిడెన్స్ తో విర్రవీగారు.చివరికి ఏ సీటూ దక్కకపోగా, ఆయన మేలుకునే సరికి ఇక ఇవ్వడానికి సీట్లు కూడా ఖాళీ లేని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడును బతిమాలారో ప్రలోభపెట్టారో తెలియదు గానీ.. మొత్తానికి తెలుగుదేశం పార్టీకి సిటింగ్ స్థానం అయిన ఉండిలో అక్కడి ఎమ్మెల్యేను పక్కకు తప్పించి రఘురామ బరిలోకి దిగడం జరిగింది.ఇంత పాట్లు పడి సీటు దక్కించుకుంటే.. అక్కడ ఆయనకు ఓటమి తప్పదనే పరిస్థితి ఇప్పుడు కనిపిస్తోంది. ఉండి నియోజకవర్గం నుంచి అనూహ్యంగా తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు అభ్యర్థి, మాజీ ఎమ్మెల్యే వెంకటశివరామరాజు గెలుపు సాధించే అవకాశం ఉందని అంచనాలు సాగుతున్నాయి.ఉండి ఎమ్మెల్యే సీటుకు సంబంధించి.. రఘురామ రాక మునుపే అక్కడి తెలుగుదేశంలోనే ప్రతిష్టంభన ఉంది.


సిటింగ్ ఎమ్మెల్యే రామరాజు, మాజీ ఎమ్మెల్యే వెంకటశివరామరాజు ఇద్దరూ టికెట్ కోసం ట్రై చేశారు. కానీ, సిటింగుల కోటాలో భాగంగా చంద్రబాబు నాయుడు రామరాజు పేరునే ప్రకటించారు. ఆ నిర్ణయాన్నే శివరామరాజు వ్యతిరేకించడం జరిగింది. తన దారి చూసుకోడానికి సిద్ధపడ్డారు. తీరా బాబు రకరకాల మలుపులు తిప్పి రామరాజును  తప్పించి, రఘురామక్రిష్ణ రాజుకు టికెట్ ఇచ్చారు. కానీ.. ప్రతి ఫలం దక్కేలా కనిపించడం లేదు.బాబు ఎంత బుజ్జగించినా సరే..రామరాజు అసంతృప్తి చల్లారిందా లేదా? రఘురామకు సహకరిస్తున్నారా లేదా? అనే క్లారిటీ లేదు. పైగా మాజీ ఎమ్మెల్యే ఎంతో దూకుడుగా ప్రచారంలో ఉన్నారు.ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీచేస్తున్న ఈ తెలుగుదేశం పార్టీ తిరుగుబాటు నాయకుడు వెంకటశివరామరాజు గెలిచే అవకాశం ఉన్నదని స్థానికుల నుంచి సమాచారం తెలిసింది.  తెలుగుదేశం సిటింగు స్థానంలో ఆ పార్టీ ముఠాలు కీచులాడుకుంటుండడం వలన పరిస్థితులు కలిసివస్తే వైఎస్సార్ సీపీ గెలిచే అవకాశం కూడా ఉంటుందంటున్నారు. అంతే తప్ప.. రఘురామ గెలిచే సీను ఏమాత్రం లేదని తెలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>