Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-1be05f81-aa3b-465f-9e1c-2d339608e1c6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/cricket-1be05f81-aa3b-465f-9e1c-2d339608e1c6-415x250-IndiaHerald.jpgఏప్రిల్ 30వ తేదీన t20 వరల్డ్ కప్ ఆడబోయే జట్టు వివరాలను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది అన్న విషయం తెలిసిందే 15 మంది సభ్యుల వివరాలను సోషల్ మీడియాలో విడుదల చేసింది జట్టు యాజమాన్యం. అయితే ఇలా వరల్డ్ కప్ కు సంబంధించిన జట్టు ప్రకటన జరిగిన నాటి నుంచి కూడా ఒకే విషయం గురించి తెగ చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈసారి వరల్డ్ కప్ లో తప్పకుండా చోటు దక్కించుకుంటారు అనుకున్న కొంతమంది ఆటగాళ్లకు సెలక్టర్ ల నుంచి మొండి చేయి ఎదురయింది. అలాంటి ఆటగాళ్లలో యువ ఓపెనర్ గిల్ కూడా ఒకరు అని చెప్పాలి. మొన్నటి వరకు గిల్ టీమిCricket {#}ICC T20;ravi shastri;Shikhar Dhawan;Yashasvi Jaiswal;BCCI;World Cup;Yuva;ravi anchorఅలా జరిగినందుకు.. గిల్ బాధపడే ఉంటాడు : రవి శాస్త్రిఅలా జరిగినందుకు.. గిల్ బాధపడే ఉంటాడు : రవి శాస్త్రిCricket {#}ICC T20;ravi shastri;Shikhar Dhawan;Yashasvi Jaiswal;BCCI;World Cup;Yuva;ravi anchorMon, 13 May 2024 14:30:00 GMTఏప్రిల్ 30వ తేదీన t20 వరల్డ్ కప్ ఆడబోయే జట్టు వివరాలను బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది అన్న విషయం తెలిసిందే  15 మంది సభ్యుల వివరాలను సోషల్ మీడియాలో విడుదల చేసింది జట్టు యాజమాన్యం. అయితే ఇలా వరల్డ్ కప్ కు సంబంధించిన జట్టు ప్రకటన జరిగిన నాటి నుంచి కూడా ఒకే విషయం గురించి తెగ చర్చ జరుగుతుంది. ఎందుకంటే ఈసారి వరల్డ్ కప్ లో తప్పకుండా చోటు దక్కించుకుంటారు అనుకున్న కొంతమంది ఆటగాళ్లకు సెలక్టర్ ల నుంచి మొండి చేయి ఎదురయింది. అలాంటి ఆటగాళ్లలో యువ ఓపెనర్ గిల్ కూడా ఒకరు అని చెప్పాలి.


 మొన్నటి వరకు గిల్ టీమిండియా కు రెగ్యులర్ ఓపనర్ గా ఉండేవాడు. రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్ చేసేవాడు. అయితే గిల్ వచ్చినప్పుడు ఎలా అయితే అటు అంతకు ముందు ఓపెనర్ గా ఉన్న శిఖర్ ధావన్ కెరియర్ ప్రమాదంలో పడిపోయిందో.. ఇక ఇప్పుడు కొత్తగా జట్టులోకి వచ్చిన యశస్వి జైష్వాల్  ఓపెనర్ గా  బ్యాటింగ్ విధ్వంసం సృష్టిస్తుండడంతో.. గిల్ కు ఇక ఓపెనింగ్ స్థానంపై తీవ్రమైన పోటీ నెలకొంది  ఈ క్రమంలోనే గత కొంతకాలం నుంచి గిల్ పేలవమైన పామ్ తో ఇబ్బంది పడుతూ ఉండడం మరోవైపు యశస్వి జైస్వాల్ అదరగొడుతూ ఉండడంతో ఇక గిల్ కి బదులు యశస్వి జైష్వాళ్ ను వరల్డ్ కప్ జట్టులోకి ఎంపిక చేశారు సెలెక్టర్లు.


 అయితే వరల్డ్ కప్ లో చోటు దక్కకపోతే తాను ఫీల్ అవుతాను అంటూ అంతకుముందే గిల్ వ్యాఖ్యానించడం గమనార్హం. ఇక ఇదే విషయం గురించి టీమిండియా మాజీ కోచ్ రవి శాస్త్రి నిరాశ వ్యక్తం చేశాడు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆడగలిగే సామర్థ్యం ఉన్న ప్లేయర్ గిల్. కానీ ఆ టాలెంటెడ్ క్రికెటర్ కు జట్టులో చోటు దక్కలేదు. ఈ ఎదురుదెబ్బను జీర్ణించుకోవడం అతనికి కష్టంగా ఉంటుంది. తప్పకుండా బాధపడుతూ ఉంటాడు అంటూ రవి శాస్త్రి చెప్పుకొచ్చాడు. దీనిని పాజిటివ్గా తీసుకొని మరింత ముందుకు వెళ్లేందుకు గిల్ ప్రయత్నించాలి అంటూ సూచించాడు రవి శాస్త్రి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>