PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawanf56c0296-07db-4d60-9533-86751582d7c5-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/pawanf56c0296-07db-4d60-9533-86751582d7c5-415x250-IndiaHerald.jpgజనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ 2024వ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. పవన్ పోటీ కంటే ముందు పిఠాపురం గురించి పెద్దగా ఆంధ్రప్రదేశ్ వాసులు పట్టించుకున్నది లేదు. కానీ ఎప్పుడైతే పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నాడు అని వార్తలు బయటకు వచ్చాయో అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అందరి దృష్టి ఈ నియోజకవర్గంపై పడింది. ఇక పవన్ కళ్యాణ్ కూడా పోయిన సారి అసెంబ్లీ ఎన్నికలలో రెండు స్థానాల నుండి పోటీ చేసి రెండింటిలో కూడా ఓడPawan{#}Deputy Chief Minister;Ram Charan Teja;Jabardasth;kalyan;pithapuram;Assembly;Jagan;News;Party;Andhra Pradesh;YCP;Electionsపిఠాపురం : బారుల తీరిన ప‌ల్లె జ‌నాలు.. ప‌వ‌న్‌కు విజ‌య‌మా.. ప‌రాజ‌య‌మా ?పిఠాపురం : బారుల తీరిన ప‌ల్లె జ‌నాలు.. ప‌వ‌న్‌కు విజ‌య‌మా.. ప‌రాజ‌య‌మా ?Pawan{#}Deputy Chief Minister;Ram Charan Teja;Jabardasth;kalyan;pithapuram;Assembly;Jagan;News;Party;Andhra Pradesh;YCP;ElectionsMon, 13 May 2024 11:33:05 GMTజనసేన పార్టీ అధినేత అయినటువంటి పవన్ కళ్యాణ్ 2024వ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలలో పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే. పవన్ పోటీ కంటే ముందు పిఠాపురం గురించి పెద్దగా ఆంధ్రప్రదేశ్ వాసులు పట్టించుకున్నది లేదు. కానీ ఎప్పుడైతే పిఠాపురం నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేయబోతున్నాడు అని వార్తలు బయటకు వచ్చాయో అప్పటి నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల అందరి దృష్టి ఈ నియోజకవర్గంపై పడింది.

ఇక పవన్ కళ్యాణ్ కూడా పోయిన సారి అసెంబ్లీ ఎన్నికలలో రెండు స్థానాల నుండి పోటీ చేసి రెండింటిలో కూడా ఓడిపోవడంతో ఈ సారి ఎలాగైనా గెలిచి తన ఉనికిని, తన పార్టీ ఉనికిని విస్తృతంగా చాటాలి అని పవన్ భావించాడు. దానితో చాలా రోజుల నుండి ఇక్కడ జబర్దస్త్ నటులు ఎంతో మంది పవన్ కి సపోర్ట్ గా ప్రచారం చేశారు. అలాగే ఎంతోమంది మెగా హీరోలు కూడా పవన్ కు సపోర్టుగా ప్రచారం చేశారు.

ఇక లాస్ట్ ప్రచారం రోజు అనగా రామ్ చరణ్ తో పవన్ ఫైనల్ టచ్ ఇప్పించాడు. దీనితో పవన్ మైలేజ్ మరింత పెరిగింది. ఇకపోతే పవన్ కి పోటీగా వైసీపీ పార్టీ నుండి వంగ గీతా పోటీలోకి దిగింది. ఈమెకు జగన్ ఫుల్ సపోర్ట్ ఇస్తూ పవన్ పై ఈమెను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేస్తాను అని ప్రకటించాడు. దానితో ఈమె క్రేజ్ కూడా పిఠాపురంలో భారీగా పెరిగింది. ఇక ఈ రోజు ఎన్నికలు జరుగుతున్నాయి. పిఠాపురం వాసులు భారీగా ఓట్లు వేయడానికి బూత్ వద్దకు తరలివస్తున్నారు.

ఉదయం 6 నుండి ఇప్పటివరకు భారీ మొత్తంలో పోలింగ్ జరిగింది. ఇక ఇప్పటివరకు జరిగిన పోలింగ్ లో ఎక్కువ శాతం మహిళలు మరియు అందులో మరి ముఖ్యంగా ఎక్కువ వయసు ఉన్నవారు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఓటు బ్యాంకు అంతా కూడా ఎక్కువ శాతం అధికార పార్టీ అయినటువంటి వైసీపీ కి పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపై పడే ఓట్ల శాతాన్ని బట్టి పవన్ గెలుపు అవకాశాలు ఉంటాయి అని తెలుస్తుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>