PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-tirupati-arani-srinivasulu-abinay-reddy-ycp-tdp-kutami1e7a7558-e8c0-4d02-a302-abcc397e8f8a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-tirupati-arani-srinivasulu-abinay-reddy-ycp-tdp-kutami1e7a7558-e8c0-4d02-a302-abcc397e8f8a-415x250-IndiaHerald.jpgఏపీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలు ఒక లెక్కైతే తిరుపతి నియోజకవర్గంలో మరో లెక్క ఉంటుంది. దేశంలోని అత్యంత పేరుగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ నియోజకవర్గంపై ప్రతి ఒక్కరి దృష్టి ఉంటుంది. అలాంటి తిరుపతి వెంకటేశ్వరుడి ఆశీస్సులు ఈసారి ఎవరికీ దక్కనున్నాయి. లోకల్,నాన్ లోకల్ మధ్య జరుగుతున్న ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం. తిరుపతిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి అభినయ్ రెడ్డిని బరిలోకి దింపింది. ఈయన రెండుసార్లు టీటీడీ చైర్మన్ గా చేసినటువంటి, AP;TIRUPATI;ARANI SRINIVASULU;ABINAY REDDY;YCP;TDP KUTAMI{#}abhinay;Tirumala Tirupathi Devasthanam;Tirupati;Father;Chittoor;Backward Classes;Congress;Reddy;Hanu Raghavapudi;local language;MLA;YCP;Janasena;Yevaruతిరుప‌తి: వేంక‌టేశ్వ‌రుడి ఆశీస్సులు ఆ పార్టీకేనా...నాన్ లోక‌ల్ వ‌ద్దే వ‌ద్దోయ్‌..?తిరుప‌తి: వేంక‌టేశ్వ‌రుడి ఆశీస్సులు ఆ పార్టీకేనా...నాన్ లోక‌ల్ వ‌ద్దే వ‌ద్దోయ్‌..?AP;TIRUPATI;ARANI SRINIVASULU;ABINAY REDDY;YCP;TDP KUTAMI{#}abhinay;Tirumala Tirupathi Devasthanam;Tirupati;Father;Chittoor;Backward Classes;Congress;Reddy;Hanu Raghavapudi;local language;MLA;YCP;Janasena;YevaruMon, 13 May 2024 12:32:33 GMTఏపీ ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాలు ఒక లెక్కైతే  తిరుపతి నియోజకవర్గంలో మరో లెక్క ఉంటుంది. దేశంలోని అత్యంత పేరుగాంచిన తిరుమల తిరుపతి దేవస్థానం ఇక్కడ ఉంటుంది కాబట్టి ఈ నియోజకవర్గంపై ప్రతి ఒక్కరి దృష్టి ఉంటుంది. అలాంటి తిరుపతి  వెంకటేశ్వరుడి ఆశీస్సులు  ఈసారి ఎవరికీ దక్కనున్నాయి. లోకల్,నాన్ లోకల్ మధ్య జరుగుతున్న ఈ పోరులో ఎవరు విజయం సాధిస్తారు అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.  తిరుపతిలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి  అభినయ్ రెడ్డిని బరిలోకి దింపింది. ఈయన రెండుసార్లు టీటీడీ చైర్మన్ గా చేసినటువంటి, ఎమ్మెల్యే భూమాన కరుణాకర్ రెడ్డి  కొడుకు. అభినయ్ రెడ్డి మొదటిసారి ఎన్నికల బరిలో నిలుస్తున్నారు. ఇక ఈయనకు ప్రత్యర్థిగా  జనసేన అభ్యర్థి చిత్తూరు నుండి వచ్చిన వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులతో పోటీ ఏర్పడింది. 

ఈ క్రమంలో లోకల్, నాన్ లోకల్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నారు. 2019 ఎన్నికల్లో  తండ్రి విజయం కోసం కీలకంగా పని చేసినటువంటి అభినయ్ రెడ్డి  2021లో తిరుపతి పౌరసరపరాల శాఖ డిప్యూటీ మేయర్ గా ఎన్నిక కాబడ్డారు. ఆయన అప్పటి నుంచి తిరుపతిలోనే ఉంటూ అంతర్గత రోడ్లు, అభివృద్ధి పనులపై దృష్టి పెట్టి ప్రజలకు చాలా దగ్గరయ్యాడు. ఇదే తరుణంలో వైసీపీ కూడా ఆలోచన చేసి  అభినయ్ రెడ్డికే సీటు ప్రకటించింది. అంతేకాకుండా  కూటమి నుంచి  ఆరని శ్రీనివాసులు పోటీ చేయడం ఆయన నాన్ లోకల్ కావడం ఇక్కడి ప్రజలకు అంతగా తెలియకపోవడం మైనస్ గా చెప్పవచ్చు. సామాజిక వర్గాల పరంగా చూస్తే  బలిజ, బీసీ వర్గాల ఓట్లను ఆయన కూడగట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అది కూడా ఫలించే అవకాశం కనిపించడం లేదు.

 ఈ క్రమంలోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆరని శ్రీనివాసులు నాన్ లోకల్ అనే ప్రచారాన్ని విపరీతంగా పెంచేసింది.  అలాగే టిడిపి, జనసేన, బిజెపిలో కూడా ఆయనకు వ్యతిరేకంగా కొంతమంది పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఇన్ని మైనస్ ల మధ్య  శ్రీనివాసులు విజయం సాధించడం కష్టమే అని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇక అభినయ్ రెడ్డి మాత్రం  తిరుపతిలో సూపరిచిత వ్యక్తి. ఎన్నో అభివృద్ధి పనులు చేయించడంలో కీలక పాత్ర పోషించారు. తండ్రితో కలిసి అన్ని వర్గాలతో పరిచయం పెంచుకున్నాడు. కాబట్టి ఈసారి  తిరుపతిలో తప్పకుండా అభినయ్ రెడ్డి  విజయం సాధిస్తారని, తిరుపతి వెంకన్న ఆశీస్సులు ఆయన పైనే ఉంటాయని కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>