PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/otu4d2f299d-ea40-4d65-ad9b-b47025bd5b4e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/otu4d2f299d-ea40-4d65-ad9b-b47025bd5b4e-415x250-IndiaHerald.jpgఓటర్ లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ నాయకులు ఎన్నో పనులను చేస్తూ ఉంటారు. అందులో ఓటుకు నోటు ఒకటి. తమ పార్టీకి ఓటు వేయమని చెప్పి ఆ ఓటుకు గాను ఎంతో కొంత డబ్బులు ఇవ్వడాన్ని ఓటుకు నోటు అంటారు. ఒకప్పుడు ఇది చాలా పెద్ద తప్పుగా పరిగణించేవారు. మారుతున్న కాలం కొద్ది రాజకీయ నాయకులతో పాటు ఓటర్లు కూడా మారుతున్నారు. రాజకీయ నాయకులు గెలిచిన తర్వాత ఎన్నో కోట్లు సంపాదించుకుంటారు. అలాంటప్పుడు మనం వేసే ఓటుకు డబ్బు తీసుకుంటే తప్పేమిటి అనుకునే వారు ఎంతో మంది ఉన్నారు. ఇక జనాలు కూడా అలా అనుకోవడంతో నాయకులు కూడా డబ్బులు పంOtu{#}Manam;Telangana;Election;Party;Parliment;Hyderabadపోలింగ్ కేంద్రం వద్దే అలాంటి పనులు... కెమెరాకి చిక్కిన నేతలు..!పోలింగ్ కేంద్రం వద్దే అలాంటి పనులు... కెమెరాకి చిక్కిన నేతలు..!Otu{#}Manam;Telangana;Election;Party;Parliment;HyderabadMon, 13 May 2024 12:40:04 GMTఓటర్ లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ నాయకులు ఎన్నో పనులను చేస్తూ ఉంటారు. అందులో ఓటుకు నోటు ఒకటి. తమ పార్టీకి ఓటు వేయమని చెప్పి ఆ ఓటుకు గాను ఎంతో కొంత డబ్బులు ఇవ్వడాన్ని ఓటుకు నోటు అంటారు. ఒకప్పుడు ఇది చాలా పెద్ద తప్పుగా పరిగణించేవారు. మారుతున్న కాలం కొద్ది రాజకీయ నాయకులతో పాటు ఓటర్లు కూడా మారుతున్నారు. రాజకీయ నాయకులు గెలిచిన తర్వాత ఎన్నో కోట్లు సంపాదించుకుంటారు.

అలాంటప్పుడు మనం వేసే ఓటుకు డబ్బు తీసుకుంటే తప్పేమిటి అనుకునే వారు ఎంతో మంది ఉన్నారు. ఇక జనాలు కూడా అలా అనుకోవడంతో నాయకులు కూడా డబ్బులు పంచుతున్నారు. ఇక ఒక ఏరియాలో ఒక నాయకుడు ఎంత పంచితే దాని కంటే ఎక్కువ పంచి ఓటర్ లను ఆకర్షించే నేతలు కూడా అనేక మంది ఉన్నారు. దానితో ఎలక్షన్ లు వచ్చాయి అంటే ఒక్కో నియోజకవర్గం లోనే వేల కోట్ల డబ్బులు ఖర్చు అవుతున్నట్లు తెలుస్తుంది. ఇకపోతే దాదాపు ఎలక్షన్స్ ముందు రోజు వరకు ఓటుకు నోటు ప్రక్రియ ఎక్కువగా జరుగుతూ ఉంటుంది.

ఎలక్షన్ల రోజు దాదాపుగా నేతలు , ఓటర్లు అంతా కూడా సైలెంట్ గా తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికే చూస్తూ ఉంటారు. ఇకపోతే ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ ఎన్నికల్లో భాగంగా ఓ అరుదైన సంఘటన చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాద్ పట్టణం శివారులలో ఉన్న పటాన్ చేరు నియోజకవర్గ పరిధిలో పోలింగ్ కేంద్రానికి సమీపం లో ఓటర్లకు పార్టీ నేతలు డబ్బులు పంచుతూ కెమెరాకు చిక్కారు. ఓటర్ స్లిప్ అందించే నెపంతో ఓటర్లకు డబ్బులు ఇచ్చి తమ వైపు తిప్పుకునేందుకు నేతలు ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం ఇందులు సంబంధించిన వీడియో వైరల్ గా మారింది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>