PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan11afc36f-5b65-4da8-be24-dd0194cd4652-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan11afc36f-5b65-4da8-be24-dd0194cd4652-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముమ్మరంగా సాగుతున్నాయి. నేడు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ మొదలు కాగా నేడు సాయంత్రం వరకు ఇది కొనసాగనుంది. అయితే చాలామంది రాజకీయ సినీ ప్రముఖులు మొదటి గంటలోనే తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు. jagan{#}Pulivendula;central government;Evening;Jagan;Loksabha;YCP;Andhra Pradesh;Reddyఓటు వేసే సమయంలో జగన్‌లో ఈ తేడాను గమనించారా..?ఓటు వేసే సమయంలో జగన్‌లో ఈ తేడాను గమనించారా..?jagan{#}Pulivendula;central government;Evening;Jagan;Loksabha;YCP;Andhra Pradesh;ReddyMon, 13 May 2024 10:24:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు ముమ్మరంగా సాగుతున్నాయి. నేడు ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. ఏపీలో 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు పోలింగ్ మొదలు కాగా నేడు సాయంత్రం వరకు ఇది కొనసాగనుంది. అయితే చాలామంది రాజకీయ సినీ ప్రముఖులు మొదటి గంటలోనే తమ ఓటు హక్కును ఉపయోగించుకున్నారు.

పోలింగ్ కేంద్రాల వద్ద గొడవలు జరగకుండా పోలీసుల, కేంద్ర ఎన్నికల అధికారులు మెరుగైన భద్రతను ఏర్పాటు చేశారు. ఉద్రిక్త పరిస్థితులు తావు లేకుండా యుద్ధ ప్రాతిపదికన సెక్యూరిటీ అందిస్తున్నారు. అయితే కీలక రాజకీయ నేతలు కేంద్రానికి వచ్చే ఓటు హక్కు వినియోగించుకొని ప్రజలను కూడా ఓటు వేయమని ప్రోత్సహించారు. వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి కూడా చాలా ఉదయాన్నే ఓటు వేశారు. కడపలోని పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న భాకరాపురంలో జగన్ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జయ మహల్ ప్రాంతంలోని అంగన్వాడి పోలింగ్ బూత్ నంబర్ 138లో ఓట్ క్యాస్ట్ చేశారు.

ఆపై విలేకరులతో ముచ్చటించిన వైఎస్ జగన్ గెలుస్తాననే ధీమా వ్యక్తం చేశారు. ఆయన ముఖంలో చిరునవ్వులు చిందినట్లు స్పష్టంగా కనిపించాయి. విజయం తనదే అనే ఆ హావ భావాలు ఆయన ఫేసులో చాలా మంది గమనించారు. 5 ఏళ్ల పరిపాలనలో ప్రభుత్వ నుంచి ప్రయోజనాలు పొందిన ప్రతి ఒక్కరూ వైసీపీ పార్టీకి ఓటు వేసి తనను గెలిపిస్తారని ఆయన పేర్కొన్నారు. ఇదే మాట ఎన్నికల ప్రచారం వేళ కూడా చెబుతూ తన మంచి పరిపాలనపై నమ్మకాన్ని వ్యక్తం చేశారు.ఇకపోతే అయిదు సంవత్సరాల లోనే ఏపీని చాలా మార్చేసిన జగన్ ఇంకొక ఐదు సంవత్సరాలు అవకాశం ఇస్తే మరింత అభివృద్ధి చేయవచ్చు. ఇదే ఆలోచనలో రాష్ట్ర ప్రజలు ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం దాదాపు ఓటర్లందరూ వైసీపీకే ఓటు వేసే అవకాశం ఉంటుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>