PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp7449b068-40c2-43d6-8534-8a98c0f04fe9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ycp7449b068-40c2-43d6-8534-8a98c0f04fe9-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలో ఏపీ ప్రజలు ఇవాళ నిర్ణయించనున్నారు. అయితే ఈ పాటికే ఓటర్లంతా తమ భవిష్యత్తు నాయకుడు ఎవరు అనేది ఓ నిర్ణయానికి వచ్చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు. ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి. అధికారంలోకి వచ్చేది ఎవరు లాంటి ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ బాబులు పెట్టుబడి పెడుతున్నారు. అయితే ఇందులో అధిక శాతం మంది వైసీపీకే అనుకూలంగా పందేలు కాస్తుండటం విశేషం. నెల క్రితం వైసీపీకి 130 స్థానాలు వస్తాయని అంచనా వేసినా.. అనూహ్యంగా కycp{#}Godavari River;Mangalagiri;Nara Lokesh;TDP;Yevaru;YCP;CM;Andhra Pradeshబెట్టింగ్‌ అంతా వైసీపీ గెలుపుపైనే.. కూటమి గోవిందా?బెట్టింగ్‌ అంతా వైసీపీ గెలుపుపైనే.. కూటమి గోవిందా?ycp{#}Godavari River;Mangalagiri;Nara Lokesh;TDP;Yevaru;YCP;CM;Andhra PradeshMon, 13 May 2024 05:26:00 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలో ఏపీ ప్రజలు ఇవాళ  నిర్ణయించనున్నారు. అయితే ఈ పాటికే ఓటర్లంతా తమ భవిష్యత్తు నాయకుడు ఎవరు అనేది ఓ నిర్ణయానికి వచ్చేశారు. అయితే ఈ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు.  ఏ పార్టీకి ఎక్కువ సీట్లు వస్తాయి. అధికారంలోకి వచ్చేది ఎవరు లాంటి ఉత్కంఠ రేకెత్తిస్తున్న ఎన్నికల ఫలితాలపై బెట్టింగ్ బాబులు పెట్టుబడి పెడుతున్నారు.


అయితే ఇందులో అధిక శాతం మంది వైసీపీకే అనుకూలంగా పందేలు కాస్తుండటం విశేషం.  నెల క్రితం వైసీపీకి 130 స్థానాలు వస్తాయని అంచనా వేసినా.. అనూహ్యంగా కూటమి పుంజుకుందని టాక్ నడుస్తోంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరిట అధికార పార్టీని టీడీపీ ఇబ్బంది పెట్టినా.. అది పెద్దగా ఓట్లు రాల్చదని పలువురు అంచనా వేస్తున్నారు. మొత్తంగా ఎంత తగ్గినా వైసీపీకి 100 కి పైగా స్థానాలు వస్తాయని లెక్కలు కడుతున్నారు.


ఆ మేర పందేలు కాయడం ప్రారంభించారు. ఏది ఏమైనా వైసీపీకి ఏపీలో వేవ్ ఉందని.. సీఎం జగన్ సంక్షేమ పథకాలే మళ్లీ గెలిపిస్తాయనే ధీమాలో బెట్టింగ్ రాయుళ్లు ఉన్నారంట. వైసీపీ దూకుడును బట్టి 1:2 చొప్పున పందేలు కట్టడం ప్రారంభించారు.  ఒక్కో చోట వైసీపీ నే మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని రూ.లక్షకు రూ. ఐదు లక్షలు ఇస్తామని గోదావరి జిల్లాల్లో బెట్టింగ్ నడుస్తుందని విశ్వసనీయ సమాచారం.


కోడిపందేలా వాసికెక్కిన ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో అన్ని చోట్ల వైసీపీ గెలుస్తుందని బెట్టింగ్ కాస్తున్నారు.  సీఎం జగన్ నినాదమిచ్చినట్లు వై నాట్ 175 కాకపోయినా.. కనీసం అధికారం మాత్రం పక్కా అని చెబుతున్నారు. ఇంకా కుప్పంలో చంద్రబాబు, హిందూపురంలో బాలయ్య, మంగళగిరి లో లోకేశ్ కూడా ఓడిపోతారని బెట్టింగ్ నడుస్తుందని చెబుతున్నారు. మొత్తం మీద బెట్టింగ్ రాయుళ్ల జోరు చూసి కూటమి నేతలు, మద్దతు దారులు వెనక్కి తగ్గుతున్నారనే గుసగుసలు ఏపీలో గట్టిగా వినిపిస్తున్నాయి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>