PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan11722063-d876-4b40-8f0f-c4e7abc0ec31-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan11722063-d876-4b40-8f0f-c4e7abc0ec31-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవడానికి చాలానే ప్రయత్నాలను చేశారు. సంక్షేమ పథకాలు అందించి, అవి అందించినట్లు, తాను తప్ప ఇన్ని సంక్షేమ పథకాలు ఎవరూ అందించలేరని ప్రజలు అర్థం చేసుకునేలా ఎన్నికల ప్రచారాలు నిర్వహించారు. నిజానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) నాయకత్వం వహించింది. jagan{#}raj;Indian;sunday;Loksabha;Leader;Lokesh;Lokesh Kanagaraj;Y. S. Rajasekhara Reddy;CM;kalyan;TDP;Party;Andhra Pradesh;Jagan;Reddyజగన్ గెలవడం తథ్యం.. సంచలనం సృష్టిస్తున్న ఐప్యాక్‌ ఫౌండర్ కామెంట్స్?జగన్ గెలవడం తథ్యం.. సంచలనం సృష్టిస్తున్న ఐప్యాక్‌ ఫౌండర్ కామెంట్స్?jagan{#}raj;Indian;sunday;Loksabha;Leader;Lokesh;Lokesh Kanagaraj;Y. S. Rajasekhara Reddy;CM;kalyan;TDP;Party;Andhra Pradesh;Jagan;ReddyMon, 13 May 2024 13:53:11 GMTఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు పోలింగ్ కొనసాగుతోంది. ఈ ఎన్నికల్లో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కలవడానికి చాలానే ప్రయత్నాలను చేశారు. సంక్షేమ పథకాలు అందించి, అవి అందించినట్లు, తాను తప్ప ఇన్ని సంక్షేమ పథకాలు ఎవరూ అందించలేరని ప్రజలు అర్థం చేసుకునేలా ఎన్నికల ప్రచారాలు నిర్వహించారు. నిజానికి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి ఇండియన్ పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) నాయకత్వం వహించింది.

అయితే తాజాగా ఐ-ప్యాక్ డైరెక్టర్, సహ వ్యవస్థాపకుడు రిషి రాజ్ సింగ్ తాజాగా మాట్లాడుతూ జగన్ మళ్లీ అధికారంలోకి వస్తారనే బలమైన నమ్మకాన్ని వ్యక్తం చేశారు. ఆదివారం లోకల్ ఇంగ్లీష్ న్యూస్ పేపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ 34 ఏళ్ల ఐఐటీయన్, జగన్ గెలుపు ఫార్ములా చాలా సింపుల్, అది ఏంటంటే ప్రజల నమ్మకాన్ని గెలుచుకోవడమే అని పేర్కొన్నారు. ఏపీ ప్రజలు విశ్వసనీయతను నమ్మి సరైన నిర్ణయాన్ని ఓటు ద్వారా తెలియజేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

భూ హక్కు చట్టంపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న దుష్ప్రచారాలను వైఎస్సార్‌సీపీ పట్టించుకోవడంలేదని స్పష్టం చేశారు. "నిజం పక్కింటికి తెలిసేలోపు అబద్ధం అనేది ఊరంతా తిరిగేసి వస్తుందనే సామెత ప్రకారం భూ హక్కు చట్టంపై అబద్ధం అనేది రాష్ట్రం అంతటా వ్యాప్తి చెందిందని అన్నారు. ప్రజలు ఏది నిజమో ఏది అబద్దమో గుర్తించాలని కోరారు. టీడీపీ ఈ ఎన్నికల తర్వాత ఏమవుతుందో కూడా ఊహించడం కష్టమని ఆయన వ్యాఖ్యానించారు. లోకేష్ సమర్థ నాయకుడు కాదని, పవన్ కళ్యాణ్ పరిస్థితి కూడా సేమ్ అలానే ఉంటుందని, అందువల్ల వారికి ఇదే లాస్ట్ ఎన్నిక కావచ్చు అని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనను తాను కమ్యూనిటీ లీడర్గా అభివర్ణించుకుంటూ ప్రజలకు దూరం అవుతున్నారని చెప్పారు. ఒక కమ్యూనిటీ లీడర్ ఇప్పుడు ఎమ్మెల్యేగా గెలవడం కష్టమని తన అభిప్రాయం వ్యక్తపరిచారు. ఇకపోతే ఈసారి జగన్ ఒంటరిగా, ఎవరి తోడు లేకుండా సింగల్ గా పోటీ చేస్తున్నారని, అది ఒక తెలివైన నిర్ణయం అని పేర్కొన్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>