EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jaganc482ee17-b94c-4189-81ab-b7b25afc5401-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/jaganc482ee17-b94c-4189-81ab-b7b25afc5401-415x250-IndiaHerald.jpgఏపీలో కొద్దిసేపట్లో ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం కాబోతోంది. ఎన్నికల ప్రచారం మే 11 సాయంత్రం ఆరుగంటలతో ముగిసింది. ఇక అన్ని పార్టీల నేతల నోల్లకు, ప్రచార వాహనాలనకు తాళం పడింది. ఇక అప్పటి నుంచి అంతా డబ్బు మద్యం పంపకాలపైనే దృష్టి సారించారు. ఇక పోలింగ్ కు ఇప్పటికే చాలా మంది విదేశాలు, పక్క రాష్ట్రాల నుంచి ఏపీకి బారులు తీరారు. దీంతో రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ఆంధ్రాకు వెళ్లే ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. కాగా వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఎవరిది అనే దానిపైనే చర్చంతా నడుస్తోంది. 2019 ఎన్నికల్లోjagan{#}Evening;Tiger;dr rajasekhar;Y. S. Rajasekhara Reddy;Survey;CBN;Jagan;Yevaru;Hanu Raghavapudi;CM;News;YCP;Partyజననేత: ఆ సరికొత్త రికార్డుతో వైఎస్సార్‌ సరసన జగన్‌?జననేత: ఆ సరికొత్త రికార్డుతో వైఎస్సార్‌ సరసన జగన్‌?jagan{#}Evening;Tiger;dr rajasekhar;Y. S. Rajasekhara Reddy;Survey;CBN;Jagan;Yevaru;Hanu Raghavapudi;CM;News;YCP;PartyMon, 13 May 2024 06:00:00 GMTఏపీలో కొద్దిసేపట్లో ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం కాబోతోంది. ఎన్నికల ప్రచారం మే 11 సాయంత్రం ఆరుగంటలతో ముగిసింది. ఇక అన్ని పార్టీల నేతల నోల్లకు, ప్రచార వాహనాలనకు తాళం పడింది. ఇక అప్పటి నుంచి అంతా డబ్బు మద్యం పంపకాలపైనే దృష్టి సారించారు. ఇక పోలింగ్ కు ఇప్పటికే చాలా మంది విదేశాలు, పక్క  రాష్ట్రాల నుంచి ఏపీకి బారులు తీరారు. దీంతో రైల్వే స్టేషన్లు,  బస్టాండ్లు ఆంధ్రాకు వెళ్లే ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి.


కాగా వచ్చే ఎన్నికల్లో అత్యధిక మెజార్టీ ఎవరిది అనే దానిపైనే చర్చంతా నడుస్తోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత సీఎం జగన్ పులి వెందుల నుంచి రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ సాధించి రికార్డు సృష్టించారు. ఈ ఎన్నికల్లో జగన్ కు 90 వేల మెజార్టీ వచ్చింది. ఇదే సమయంలో 2014లోను అత్యధిక మెజార్టీ రికార్డు జగన్ దే.


ఇదిలా ఉండగా ప్రస్తుతం ఏపీలో ఎవరు గెలుస్తారు అనే అంశంపై కూడా జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఇప్పటి వరకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి మాత్రమే పూర్తి కాలం పదవిలో ఉండి రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేశారు.  2004కి ముందు వైఎస్సార్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేసి దిగ్విజయంగా అధికారంలోకి రాగలిగారు.  అప్పుడు అమలు చేసిన సంక్షేమ పథకాలే వైఎస్ ను రెండో సారి అధికారంలోకి తీసుకొచ్చాయి.


ఇప్పుడీ రికార్డును సీఎం జగన్ అందుకుంటారా అంటే అవుననే సమాధానాలే ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మాదిరే 2009లో కూడా చంద్రబాబు మహా కూటమి పెట్టి విఫలం అయ్యారు. పలు సర్వే సంస్థలు, తన అనుకూల పత్రికల ద్వారా టీడీపీనే గెలుస్తుంది అని వార్తలు రాయించారు. అయినా ప్రజలు వాటిని నమ్మలేదు. వైఎస్ అమలు చేసిన సంక్షేమం వైపు మొగ్గు చూపారు. ఇప్పుడు కూడా సీఎం జగన్ అలానే విజయం సాధిస్తారు అని వైసీపీ నాయకులు విశ్వసిస్తున్నారు. పైగా ఈ ఐదేళ్లలో అవినీతి ఆరోపణలు లేకుండా.. ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హులందరికీ అందించిన ఘనత జగన్ దే కాబట్టి విజయం తథ్యం అనే ధీమాలో ఆ పార్టీ నాయకులు ఉన్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>