Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/electionf2efbcda-fc4b-4b58-bc06-b66ac84b47db-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/electionf2efbcda-fc4b-4b58-bc06-b66ac84b47db-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హడావిడి నెలకొంది. మొన్నటి వరకు అన్ని పార్టీల అభ్యర్థులు కూడా ప్రచార రంగంలో దూసుకుపోయారు. తమను గెలిపిస్తే ఏం చేస్తాము అనే విషయంపై స్పష్టమైన హామీలను ఇచ్చారు. తాము ప్రజల మనుషులమే అని చెబుతూ ఎప్పుడు జనాల్లోనే తిరిగారు.వాడ వాడ తిరుగుతూ ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ప్రచార గడువు ముగియడంతో అంతా సైలెంట్ అయిపోయింది. అయితే మొన్నటి వరకు ప్రచారంతో దూసుకుపోయిన అభ్యర్థుల భవితవ్యం ఏంటి అన్నది తేల్చడానికి నేడు ఓటర్లు సిద్ధమయ్యారు. తెలుగు రాష్ట్రాలలో నేడు ఉదయం నుంచి పోలింగ్ ప్Election{#}Telugu;Electionsఈ నిజం తెలుసా.. సిరా చుక్క తయారయ్యేది మన హైదరాబాద్ లోనే?ఈ నిజం తెలుసా.. సిరా చుక్క తయారయ్యేది మన హైదరాబాద్ లోనే?Election{#}Telugu;ElectionsMon, 13 May 2024 13:30:00 GMTప్రస్తుతం తెలుగు రాష్ట్రాలలో ఎన్నికల హడావిడి నెలకొంది. మొన్నటి వరకు అన్ని పార్టీల అభ్యర్థులు కూడా ప్రచార రంగంలో దూసుకుపోయారు. తమను గెలిపిస్తే ఏం చేస్తాము అనే విషయంపై స్పష్టమైన హామీలను ఇచ్చారు. తాము ప్రజల మనుషులమే అని చెబుతూ ఎప్పుడు జనాల్లోనే తిరిగారు.వాడ వాడ తిరుగుతూ ప్రచారం చేశారు. కానీ ఇప్పుడు ప్రచార గడువు ముగియడంతో అంతా సైలెంట్ అయిపోయింది. అయితే మొన్నటి వరకు ప్రచారంతో దూసుకుపోయిన అభ్యర్థుల భవితవ్యం ఏంటి అన్నది తేల్చడానికి నేడు ఓటర్లు సిద్ధమయ్యారు. తెలుగు రాష్ట్రాలలో నేడు ఉదయం నుంచి పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది అన్న విషయం తెలిసిందే.


 ఈ క్రమంలోనే ఓటర్లందరూ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకుని సరైన అభ్యర్థిని ఎన్నుకునేందుకు రెడీ అయిపోయారు  పోలింగ్ కేంద్రాలకు బారులు తీరుతున్నారు అని చెప్పాలి. ఇదిలా ఉంటే ఎన్నికలు వచ్చిన ప్రతిసారి కూడా ఒక విషయంపై ప్రతి ఒక్కరు చర్చించుకుంటూ ఉంటారు.  అదే ఓటు వేసే సమయంలో ఎన్నికల అధికారులు ఓటర్ ఎడమచేతి చూపుడువేలు పై వేసే సిరా చుక్క గురించి. చూడటానికి మామూలు సిరా లాగానే ఉండే ఈ ఇంక్ ఒక్కసారి వేలి మీద వేసిన తర్వాత ఎంత తుడుచుకున్న పోదు.


 సబ్బుతో కడిగినా కూడా చెరిగిపోకుండా అలాగే ఉంటుంది. ఈ క్రమంలోనే ఇలా సిరా చుక్క అలాగే ఉండిపోవడానికి అసలు కారణం ఏంటి అన్నది ఎవరికీ తెలియదు. అసలు ఈ సిరా చుక్క ఎక్కడ తయారవుతుంది అన్న విషయం కూడా చాలామందికి తెలియదు. అయితే ఈ సిరా చుక్క ఎక్కడో కాదు హైదరాబాద్లోనే తయారు అవుతుంది. 1990 నుంచి హైదరాబాద్లో కూడా ఈ సిరాను తయారు చేయడం ప్రారంభించారట  ఉప్పల్లోని రాయుడు లాబరేటరీస్ అనే సంస్థ ఎన్నికల్లో ఓటర్ల వేలిపై వేసే సిరని తయారుచేస్తుంది సుమారు 100 దేశాలకు ఈ సిరాని ఎగుమతి చేస్తున్నట్టు కంపెనీ ఈ విషయాన్ని ఇటీవలే అఫీషియల్ గా తెలుస్తుంది అయితే ఈ సిరా తయారీకి ఏం వాడతారు అన్న విషయం మాత్రం ఎంతో సీక్రెట్ గా ఉంచుతారట కేవలం ఒకే ఒక వ్యక్తికి మాత్రమే ఇందుకు సంబంధించిన సీక్రెట్స్ తెలుస్తాయి అంట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>