MoviesAnilkumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6f089ac7-cc37-4dbb-9ac3-eade779e6b43-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood6f089ac7-cc37-4dbb-9ac3-eade779e6b43-415x250-IndiaHerald.jpgత్రిబుల్ ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ స్థాయి ఇప్పుడు ప్రపంచ స్థాయికి చేరింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో నే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వినబడుతోంది. ఈ ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో క్రేజీ సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. దీంతో ప్రస్తుతం ఆయన చేస్తున్న తదుపరి సినిమాలపై ఆసక్తి నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న తదుపరి సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఈ క్రమంలోని జూనియర్ tollywood{#}NTR;Jr NTR;koratala siva;roshan;bollywood;Blockbuster hit;Thriller;Hero;Telugu;raj;war;India;Cinema;Tollywoodబాలీవుడ్ లో హవా కొనసాగించడానికి సిద్ధంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్..!?బాలీవుడ్ లో హవా కొనసాగించడానికి సిద్ధంగా ఉన్న జూనియర్ ఎన్టీఆర్..!?tollywood{#}NTR;Jr NTR;koratala siva;roshan;bollywood;Blockbuster hit;Thriller;Hero;Telugu;raj;war;India;Cinema;TollywoodMon, 13 May 2024 16:31:03 GMTత్రిబుల్ ఆర్ సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ స్థాయి ఇప్పుడు ప్రపంచ స్థాయికి చేరింది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ పేరు రెండు తెలుగు రాష్ట్రాల్లో నే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వినబడుతోంది. ఈ ఒక్క సినిమాతోనే పాన్ ఇండియా స్థాయిలో క్రేజీ సంపాదించుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. దీంతో ప్రస్తుతం ఆయన చేస్తున్న తదుపరి సినిమాలపై ఆసక్తి నెక్స్ట్ లెవెల్ లో ఉంది. ప్రస్తుతం ఆయన చేస్తున్న తదుపరి సినిమాల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు. ఈ క్రమంలోని జూనియర్ ఎన్టీఆర్ సైతం తన నెక్స్ట్

 సినిమాలను ఆచితూచి చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆయన కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. దాదాపుగా 300 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కిస్తున్నారు. ఇక ఈ సినిమాతో మరొక బ్లాక్ బస్టర్ విజయాన్ని జూనియర్ ఎన్టీఆర్ తన ఖాతాలో వేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు అని ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఆశిస్తున్నారు. ఇక ఈ సినిమాని పక్కన పెడితే జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు బాలీవుడ్ కి కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ హీరోగా నటిస్తున్న  వార్ 2 సినిమా తో జూనియర్

 ఎన్టీఆర్ బాలీవుడ్ కి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమా తర్వాత ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మరొక భారీ బడ్జెట్ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.  అంతేకాకుండా ఎన్టీఆర్ సోలో హీరోగా ఎస్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ లోనే ఒక స్పై థ్రిల్లర్ సినిమా కూడా లైన్లో పెట్టినట్లు టాక్ వినిపిస్తోంది. సినిమాలతో పాటు తన ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ బాలీవుడ్ లో ఒక ప్రత్యేకమైన ఏజెన్సీని నియమించుకున్నారట.  ఎన్టీఆర్ కి సంబంధించిన కమర్షియల్ యాడ్స్, బాలీవుడ్ సినిమా ఆఫర్లు అన్నీ ఆ ఏజెన్సీ వారు చూసుకుంటున్నారట. బాలీవుడ్ లో కూడా మంచి పట్టు సాధించడానికి ఎన్టీఆర్ అక్కడ కూడా ప్లాన్ ప్రకారం ఏజెన్సీని నియమించుకున్నారని, త్వరలో ఎన్టీఆర్ బాలీవుడ్ లో కూడా స్టార్ హీరోగా అవ్వాలని అనుకుంటున్నారని తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Anilkumar]]>