PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-assembly-elections-ap-elections-survey-telangana-parliament-elections-andhrapradesh-assembly-elections-assembly-elections-2024-ys-jagan-ycp-votef11a8ef9-27ed-4d5b-b5da-5e36e176ec5e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-assembly-elections-ap-elections-survey-telangana-parliament-elections-andhrapradesh-assembly-elections-assembly-elections-2024-ys-jagan-ycp-votef11a8ef9-27ed-4d5b-b5da-5e36e176ec5e-415x250-IndiaHerald.jpgమౌనం మంచిదే. మౌనంగా ఉంటే ఎలాంటి స‌మ‌స్య‌లు రావ‌ని చాలా మంది అంటారు. మౌనాన్ని పాటిస్తా రు కూడా. ఇది మంచిదే. అయితే.. అన్ని వేళ‌లా మౌనం మంచిదేనా? అంటే.. కాదు. ముఖ్యంగా రాజ‌కీ యాల్లో ఒక వివాదం వ‌చ్చిన‌ప్పుడు.. దానిపై మౌనంగా ఉంటే.. అది ఎంత వ‌ర‌కైనా తీసుకువెళ్తుంది. ఏకం గా ఓటు బ్యాంకును దూరం చేసినా చేసే అవ‌కాశం ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి స‌మ‌స్య‌ల‌నే సీఎం జ‌గ న్ కూడా ఎదుర్కొంటున్నారు. 2019లో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన మూడు మాసాల నుంచే ప్ర‌తిప‌క్షాలు ఆయ‌న‌పై దుమ్మెత్తి పోయ‌డం ప్రారంభించాయి. ప్ర‌తి విష‌యAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; ys jagan; ycp; vote{#}Sri Lanka;CMపోలింగ్‌కు ముందు వైసీపీ జ‌గ‌న్‌పై అతి పెద్ద కుట్ర‌లు... జ‌గ‌న్ మౌన‌మే కొంప ముంచేసిందా..?పోలింగ్‌కు ముందు వైసీపీ జ‌గ‌న్‌పై అతి పెద్ద కుట్ర‌లు... జ‌గ‌న్ మౌన‌మే కొంప ముంచేసిందా..?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; ys jagan; ycp; vote{#}Sri Lanka;CMMon, 13 May 2024 06:44:36 GMTమౌనం మంచిదే. మౌనంగా ఉంటే ఎలాంటి స‌మ‌స్య‌లు రావ‌ని చాలా మంది అంటారు. మౌనాన్ని పాటిస్తా రు కూడా. ఇది మంచిదే. అయితే.. అన్ని వేళ‌లా మౌనం మంచిదేనా? అంటే.. కాదు. ముఖ్యంగా రాజ‌కీ యాల్లో ఒక వివాదం వ‌చ్చిన‌ప్పుడు.. దానిపై మౌనంగా ఉంటే.. అది ఎంత వ‌ర‌కైనా తీసుకువెళ్తుంది. ఏకం గా ఓటు బ్యాంకును దూరం చేసినా చేసే అవ‌కాశం ఉంటుంది. ఇప్పుడు ఇలాంటి స‌మ‌స్య‌ల‌నే సీఎం జ‌గ న్ కూడా ఎదుర్కొంటున్నారు.


2019లో జ‌గ‌న్ అధికారంలోకి వ‌చ్చిన మూడు మాసాల నుంచే ప్ర‌తిప‌క్షాలు ఆయ‌న‌పై దుమ్మెత్తి పోయ‌డం ప్రారంభించాయి. ప్ర‌తి విష‌యాన్నీ రాజ‌కీయం చేశాయి. అమ్మ ఒడి, చేయూత‌, విద్యాదీవెన‌, ఫీజు రీయింబ‌ర్స్‌మెంటు వంటివాటినిఅమ‌లు చేస్తే.. రాష్ట్రం శ్రీలంక అయిపోతుంద‌ని చెప్పారు. ఇక‌, వ‌లంటీర్ల‌పై అయితే.. చెప్ప‌లేన‌న్ని విమ‌ర్శ‌లు చేశారు. ఇంటికి వ‌చ్చి మ‌హిళ‌ల‌ను ఏడిపిస్తున్నార‌ని.. వ‌లంటీర్లు అత్యాచారాలు చేస్తున్నార‌ని కూడా చెప్పుకొచ్చారు.


ఇక‌, ఆ త‌ర్వాత‌.. గ‌నులు త‌వ్వేస్తున్నార‌ని, ఎస్సీల‌ను వేధిస్తున్నార‌ని, భూములు క‌బ్జా చేస్తున్నార‌ని.. ప్ర‌తి ప‌క్షాలు ఆరోపించాయి. అంతేకాదు.. మ‌హిళ‌ల‌ను వేధిస్తున్నార‌ని కూడా చెప్పుకొచ్చారు. ఇక‌, అప్పులు చేస్తున్నార‌ని.. దాంతో రాష్ట్రం అప్పుల కుప్ప‌గా మారిపోతోంద‌ని కూడా చెప్పారు(వాస్త‌వానికి మోడీ హ‌యాంలో దేశంలో అప్పులు లేని రాష్ట్రంలేదు.) ఇక‌, ఎన్నిక‌ల వేళ‌.. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌పై చేసిన విష ప్ర‌చారం అంతా ఇంతా కాదు. ఇది మంచిద‌ని చెప్పిన నోళ్లే.. ఇది మంచిద‌ని.. రైతుల‌కు మేలు జ‌రుగుతుంద‌ని చెప్పిన చానెళ్లు, ప‌త్రిక‌లే ఇప్పుడు నిప్పులు పోస్తున్నాయి.


అయితే.. ఏం జ‌రిగినా.. త‌ర్వాత చూద్దాం.. ప్ర‌జ‌లే తెలుసుకుంటారు.. ఇప్పుడు మ‌నం ఎదురు దాడి చేయ‌డం ఎందుకు అనేధోర‌ణిని సీఎం జ‌గ‌న్ అవలంబించారు. నిజానికి అప్ప‌ట్లోనే మంత్రులు.. కొంద‌రు ఎదురుదాడి చేద్దామ‌ని.. నిజానిజాలు ప్ర‌జ‌ల‌కు చెబుదామ‌ని అన్నారు. అయినా.. జ‌గ‌న్ స‌సేమిరా వ‌ద్ద‌న్నారు. వాళ్లలా మ‌నం బ‌జారున ప‌డ‌డం స‌రికాద‌న్నారు. చివ‌ర‌కు ల్యాండ్‌టైటిలింగ్ యాక్ట్ వ్య‌వ‌హారం.. త‌ల‌కు మించిన భారంగా మారింది. పోలింగ్‌కు స‌మ‌యం త‌క్కువ ఉన్న స‌మ‌యంలో దీనిపై ఎదురుదాడిని నిలువ‌రించే ప్ర‌య‌త్నం చేసినా.. స‌రిపోలేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>