PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-elections829984a8-123f-4a41-819a-9b457a350c14-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/telangana-elections829984a8-123f-4a41-819a-9b457a350c14-415x250-IndiaHerald.jpgతెలంగాణ రాష్ట్రంలో పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఉదయం 6 గంటల నుండి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో కూడా ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉదయం 10 దాటితే ఎండలు భారీగా ఉంటున్న నేపథ్యంలో ఓటర్లు అంతా కూడా తమ ఓటు హక్కును ఉదయం 10 గంటల్లోపే వేయడానికి ప్రముఖ ప్రాధాన్యతను ఇచ్చారు. దానితో తెలంగాణ రాష్ట్రంలో ఉదయం 10 గంటలలోపే భారీ మొత్తంలో ఓTelangana elections{#}Nalgonda;December;Adilabad;nagarkurnool;kothagudem;Parliment;Telangana;Assemblyతెలంగాణలో భారీగా తగ్గిన ఓటింగ్ శాతం... కారణం అదేనా..?తెలంగాణలో భారీగా తగ్గిన ఓటింగ్ శాతం... కారణం అదేనా..?Telangana elections{#}Nalgonda;December;Adilabad;nagarkurnool;kothagudem;Parliment;Telangana;AssemblyMon, 13 May 2024 18:23:19 GMTతెలంగాణ రాష్ట్రంలో పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలోనే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఈరోజు ఉదయం 6 గంటల నుండి తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలలో కూడా ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం అయింది. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఉదయం 10 దాటితే ఎండలు భారీగా ఉంటున్న నేపథ్యంలో ఓటర్లు అంతా కూడా తమ ఓటు హక్కును ఉదయం 10 గంటల్లోపే వేయడానికి ప్రముఖ ప్రాధాన్యతను ఇచ్చారు.

దానితో తెలంగాణ రాష్ట్రంలో ఉదయం 10 గంటలలోపే భారీ మొత్తంలో ఓటింగ్ శాతం నమోదు అయ్యింది. ఆ తర్వాత కాస్త మందకోడిగా ఓటింగ్ సాగినప్పటికీ పరవాలేదు అనే స్థాయిలోనే ఓటింగ్ తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. ఇకపోతే పోయిన సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో 71.31 శాతం ఓటింగ్ జరిగింది.

ఇలా అసెంబ్లీ ఎన్నికల్లో భారీ ఓటింగ్ శాతం నమోదు కావడంతో ఆ తర్వాత చాలా దగ్గరలో వచ్చిన ఎన్నికల కావడంతో వీటికి కూడా ఇదే స్థాయిలో ఓటింగ్ శాతం నమోదు అవుతుంది అని అనేకమంది జనాలు భావించారు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో జరిగినంత స్థాయిలో పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో ఓటింగ్ శాతం నమోదు కాలేదు. ఇకపోతే 5 గంటల వరకు ఉన్న రిపోర్టు ప్రకారం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 61.16 శాతం పోలింగ్‌ నమోదు అయ్యింది.

మరి జిల్లాల వారీగా చూసినట్లయితే ఆదిలాబాద్ లో 69.81 శాతం, భువనగిరిలో  62.34 శాతం, చేవెళ్లలో53.15 శాతం, హైదరాబాద్‌లో 39.17 శాతం, కరీంనగర్లో 67.67 శాతం, ఖమ్మంలో70.76 శాతం, మహబూబాబాద్లో 68.60 శాతం,  మహబూబ్‌నగర్ లో 68.40 శాతం, మల్కాజిగిరిలో 46.27 శాతం, మెదక్లో 71.33 శాతం, నాగర్ కర్నూల్ లో 66.53 శాతం, నల్గొండ లో 70.36 శాతం, నిజామాబాద్లో 67.96 శాతం, పెద్దపల్లిలో 63.86 శాతం, సికింద్రాబాద్‌లో -42.48 శాతం, వరంగల్లో64.08 శాతం, జహీరాబాద్లో71.91 శాతం నమోదు.. సికింద్రాబాద్లో కంటోన్మెంట్ లో 47.88 శాతం పోలింగ్‌ జరిగింది.

ఇక పోలింగ్ కి ఒక గంట సమయం మిగిలి ఉన్నప్పటికీ తెలంగాణ ప్రాంతంలో నక్సల్స్ ప్రభావిత అసెంబ్లీ నియోజకవర్గాలు అయినటువంటి ఆసిఫాబాద్, సిరిపూర్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, భద్రాచలం, పీనపాక, ఇల్లందు, అశ్వరావుపేట, కొత్తగూడెం అసెంబ్లీలో నాలుగు గంటలకే ఓటింగ్ ముగిసింది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>