PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mithun-reddy-won-in-12-hours-congratulations-peddireddy-successord90828ba-09ee-4446-a4fe-a51bb9393200-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/mithun-reddy-won-in-12-hours-congratulations-peddireddy-successord90828ba-09ee-4446-a4fe-a51bb9393200-415x250-IndiaHerald.jpgఏపీలో పోలింగ్ శ‌ర‌వేగంగా జరుగుతోంది. పట్టణ ప్రాంతాల కంటే పల్లె ప్రాంతాలలో ఓటర్లు ఉదయం 6:30 గంటల నుంచి పోలింగ్ బూత్ ల‌ వద్ద బారులు తీరారు. ఇప్పటికే చాలా నియోజకవర్గాలలో 35 నుంచి 40% పోలింగ్ పూర్తవుతోంది. కొన్ని నియోజకవర్గాలలో పోలింగ్ జరుగుతున్న తీరుతో పాటు.. పోలింగ్ సర‌ళి పరిశీలిస్తే ఎవరు గెలుస్తారో చెప్పటం చాలా ఈజీ అని చెప్పాలి. మరి ముఖ్యంగా పెద్దిరెడ్డి కుటుంబం పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో వార్‌ వన్ సైడ్ అయిపోయినట్టుగా కనిపిస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి పుంగనూరు నుంచి పోటీ చేస్తAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; ycp; Mithun Reddy; Peddireddy; Congratulations {#}Rajampet;Kiran Kumar;Telangana Chief Minister;Mithoon;Punganur;Abhimanyu Mithun;Yevaru;Hanu Raghavapudi;Reddy;Telugu Desam Party;YCP;Party;Bharatiya Janata Partyమిథున్‌రెడ్డి 12 గంట‌ల‌కే విక్ట‌రీ కొట్టేశాడు... కంగ్రాట్స్ పెద్దిరెడ్డి వార‌సుడా..?మిథున్‌రెడ్డి 12 గంట‌ల‌కే విక్ట‌రీ కొట్టేశాడు... కంగ్రాట్స్ పెద్దిరెడ్డి వార‌సుడా..?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; ycp; Mithun Reddy; Peddireddy; Congratulations {#}Rajampet;Kiran Kumar;Telangana Chief Minister;Mithoon;Punganur;Abhimanyu Mithun;Yevaru;Hanu Raghavapudi;Reddy;Telugu Desam Party;YCP;Party;Bharatiya Janata PartyMon, 13 May 2024 13:03:41 GMTఏపీలో పోలింగ్ శ‌ర‌వేగంగా జరుగుతోంది. పట్టణ ప్రాంతాల కంటే పల్లె ప్రాంతాలలో ఓటర్లు ఉదయం 6:30 గంటల నుంచి పోలింగ్ బూత్ ల‌ వద్ద బారులు తీరారు. ఇప్పటికే చాలా నియోజకవర్గాలలో 35 నుంచి 40% పోలింగ్ పూర్తవుతోంది. కొన్ని నియోజకవర్గాలలో పోలింగ్ జరుగుతున్న తీరుతో పాటు.. పోలింగ్ సర‌ళి పరిశీలిస్తే ఎవరు గెలుస్తారో చెప్పటం చాలా ఈజీ అని చెప్పాలి. మరి ముఖ్యంగా పెద్దిరెడ్డి కుటుంబం పోటీ చేస్తున్న నియోజకవర్గాలలో వార్‌ వన్ సైడ్ అయిపోయినట్టుగా కనిపిస్తోంది. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మరోసారి పుంగనూరు నుంచి పోటీ చేస్తున్నారు. ఆయనపై బీవైసీ పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ తో పాటు తెలుగుదేశం అభ్యర్థి ప్రధానంగా పోటీలో ఉన్నారు. ఇక్క‌డ వైసీపీ వార్ వ‌న్ సైడే అంటున్నారు.


ఇక పెద్దిరెడ్డి తనయుడు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి రాజంపేట పార్లమెంటు నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి పోటీ చేస్తున్నారు. ఇక పెద్దిరెడ్డి సోదరుడు పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి వరుసగా రెండోసారి పోటీ చేస్తున్నారు. ఇక మిథున్ రెడ్డి విషయానికి వస్తే 2014, 2019 ఎన్నికలలో లక్ష పై చిలుకు పట్ల భారీ మెజార్టీతో ఘనవిజయాలు సాధించారు. ఈ క్రమంలోనే ఈ ఎన్నికలలో కూడా గెలిచి ఆయన వరుసగా మూడోసారి సగర్వంగా పార్లమెంటులో అడుగుపెడతానన్న ధీమాతో ఉన్నారు.


అయితే మిథున్ రెడ్డి గెలుపు పోలింగ్ రోజు మధ్యాహ్నం 12 గంటలకే ఖరారు అయిపోయినట్టుగా తెలుస్తోంది. ఆయనకు పోటీగా బీజేపీ నుంచి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నారు. రాజంపేట పార్లమెంటు పరిధిలోని ఆరు పట్టణాలలో ముస్లిం ఓటర్ల సంఖ్య విపరీతంగా ఉంది. వీరంతా బీజేపీకి వ్యతిరేకంగా వన్ సైడ్ గా ఫ్యాన్ సింబల్ పై ఓటేసినట్టు తెలుస్తోంది. ఈసారి కూడా పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి లక్ష పై చిలుకు పట్ల భారీ మెజార్టీతో గెలిచి పార్లమెంట్లో అడుగు పెట్టడం ఖాయం అన్న అంచనాలు అయితే అప్పుడే వచ్చేసాయి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>