PoliticsFARMANULLA SHAIKeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/asembly-electionseb539c8f-3c46-4428-838c-3d935c6906dc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/asembly-electionseb539c8f-3c46-4428-838c-3d935c6906dc-415x250-IndiaHerald.jpgరాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సంఘం నేడు పోలింగ్కు సర్వం సిద్ధం చేసింది. ప్రతి ఒక్కరు తమ ఓటు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రజలను కోరింది.ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న ముస్లిం మైనారిటీలకు సంబంధించి ఒక క్లియర్ విజన్ తో ఉన్నారు. అలాంటి విజన్ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి లేకపోయింది.ఇటీవల ముస్లిం రిజర్వేషన్ అంశంపై సజ్జల రామకృష్ణారెడ్డితో జేఏసీ నేతలు చర్చించారు.ముస్లిం రిజర్వేషన్లపై వైసీపి వైఖరిని వారు మెచ్చుకున్నారని ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. వైఎస్సార్ ఆశయాలకasembly elections{#}JAC;Oosaravelli;Sajjala Ramakrishna Reddy;Thief;Donga;central government;Y. S. Rajasekhara Reddy;Bharatiya Janata Party;Reddy;Jagan;CBN;Andhra Pradesh;YCP;TDP;CMఏపీ : గంపగుత్తగా సైకిల్ గాలి తీయబోతున్న మైనారిటీలు.!!ఏపీ : గంపగుత్తగా సైకిల్ గాలి తీయబోతున్న మైనారిటీలు.!!asembly elections{#}JAC;Oosaravelli;Sajjala Ramakrishna Reddy;Thief;Donga;central government;Y. S. Rajasekhara Reddy;Bharatiya Janata Party;Reddy;Jagan;CBN;Andhra Pradesh;YCP;TDP;CMMon, 13 May 2024 07:32:39 GMTరాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల సంఘం నేడు పోలింగ్కు సర్వం సిద్ధం చేసింది. ప్రతి ఒక్కరు తమ ఓటు వినియోగించుకోవాలని ఎన్నికల సంఘం రాష్ట్ర ప్రజలను కోరింది.ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో ఉన్న ముస్లిం మైనారిటీలకు సంబంధించి ఒక క్లియర్ విజన్ తో ఉన్నారు. అలాంటి విజన్ టిడిపి అధినేత చంద్రబాబు నాయుడుకి లేకపోయింది.ఇటీవల ముస్లిం రిజర్వేషన్ అంశంపై సజ్జల రామకృష్ణారెడ్డితో జేఏసీ నేతలు చర్చించారు.ముస్లిం రిజర్వేషన్లపై వైసీపి వైఖరిని వారు మెచ్చుకున్నారని ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణా రెడ్డి తెలిపారు. వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా జగన్ వ్యవహరిస్తున్నారన్నారు. వైసీపీ డీఎన్ఏలోనే మైనారిటీలు ఉన్నారన్నారు.దేశంలో ముస్లింలు గణనీయమైన సంఖ్యలో ఉన్నారని.. ఏడు సీట్లను జగన్ ముస్లింలకు ఇచ్చామన్నారు. రాజ్యసభలో కూడా ముస్లింలకు సీటు కల్పిస్తామన్నారు. ముస్లిం రిజర్వేషన్లు తొలగిస్తామని బీజేపీ స్పష్టంగా చెప్పిందని.. చంద్రబాబు, పురంధేశ్వరి, పవన్ దీనిపై ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఈ విషయంలో కూటమి నేతలు స్పష్టత ఇవ్వాలన్నారు. దీనిపై ముస్లింలు కూడా కూటమిని గట్టిగా నిలదీయాలన్నారు. వైఎస్సార్ హయాంలో వచ్చిన రిజర్వేషన్లను తొలగించటానికి వీల్లేదన్నదే మా డిమాండ్ అని సజ్జల రామకృష్ణా రెడ్డి పేర్కొన్నారు.

బీజేపీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముస్లిం మైనారిటీల విషయంలో తీసుకున్న నిర్ణయాలకు తాను వ్యతిరేకమని, మిగతా విధానాలపై తాను సానుకూలంగానే ఉన్నానని జగన్ చెప్పారు. నాలుగు శాతం ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెబుతున్న బీజేపీతో టీడీపీ అధినేత చంద్రబాబు జతకట్టారని ఏపీ సీఎం వైఎస్‌ జగన్ అన్నారు.మైనార్టీల ఓట్ల కోసం దొంగ ప్రేమ నటిస్తూ డ్రామాలు మొదలుపెట్టారని విమర్శించారు. ఇంతకంటే ఊసరవెల్లి రాజకీయాలు ఎక్కడైనా ఉంటాయా? అని మండిపడ్డారు.వెనుకబాటుకు గురైన వారి రిజర్వేషన్లు తొలగించడం కరెక్టేనా అని ప్రశ్నించారు.తాము ముస్లిం రిజర్వేషన్లను కొనసాగిస్తామని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ తెలిపారు. ఆరు నూరైనా.. నూరు ఆరైనా మైనార్టీలకు 4 శాతం రిజర్వేషన్లు ఉండాల్సిందేనని జగన్‌ స్పష్టం చేశారు. దీనికోసం ఎంతవరకైనా పోరాడతానని చెప్పారు.నిన్న మొన్నటిదాకా ముస్లిం ప్రజలు ఎంతోకంత టీడీపీ కి అనుకూలంగా ఉన్నారు. కానీ టీడీపీ బీజేపీకి పొత్తుగా మారిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం ప్రజల్లో మార్పు అనేది కనబడుతుంది. దాంతో గంపగుత్తగా ముస్లిం ఓట్లు వైసీపీకి పడే అవకాశాలు చాలా ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - FARMANULLA SHAIK]]>