PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/when-was-the-vote-born-in-the-country-how-did-it-become-a-right98839fb0-c747-4865-83fa-cf8e81e81a3c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/when-was-the-vote-born-in-the-country-how-did-it-become-a-right98839fb0-c747-4865-83fa-cf8e81e81a3c-415x250-IndiaHerald.jpgఅతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశంగా ఉన్న భార‌త్‌లో ప్ర‌తి ఐదేళ్ల‌కు.. ఒక‌సారి సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగుతోంది. దీనిని ఇటీవల కాలంలో ప్ర‌జాస్వామ్య పండుగ అంటూ.. పెద్ద ఎత్తున చైత‌న్య ప‌రిచారు. ఎక్కువ మంది ఓటుహ‌క్కు వినియోగించుకునేలా చూస్తున్నారు. అయినప్ప‌టికీ.. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 70 శాతానికి మించి పోలింగ్ ఎప్పుడూ న‌మోదు కాలేదు. దీనికి కార‌ణం.. ఓటు హ‌క్కు.. నిర్బంధం కాక‌పోవ డం. అంటే.. ఉదాహ‌ర‌ణకు జాతీయ జెండాను అవ‌మానించ‌కూడదు. అనేది అంద‌రికీ తెలిసిందే. అలా చేస్తే ఏం జ‌రుగుతుందో కూడా అంద‌రికీ AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; country ; vote; vote born; india fist vote; voters{#}vidya;Lockdown;Chitram;January;central government;Cinema;festivalదేశంలో ఓటు.. ఎప్పుడు పుట్టింది..? ఎలా హ‌క్కుగా మారింది..?దేశంలో ఓటు.. ఎప్పుడు పుట్టింది..? ఎలా హ‌క్కుగా మారింది..?AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; country ; vote; vote born; india fist vote; voters{#}vidya;Lockdown;Chitram;January;central government;Cinema;festivalMon, 13 May 2024 06:59:35 GMTఅతి పెద్ద ప్ర‌జాస్వామ్య దేశంగా ఉన్న భార‌త్‌లో ప్ర‌తి ఐదేళ్ల‌కు.. ఒక‌సారి సార్వ‌త్రిక ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగుతోంది. దీనిని ఇటీవల కాలంలో ప్ర‌జాస్వామ్య పండుగ అంటూ.. పెద్ద ఎత్తున చైత‌న్య ప‌రిచారు. ఎక్కువ మంది ఓటుహ‌క్కు వినియోగించుకునేలా చూస్తున్నారు. అయినప్ప‌టికీ.. ఇప్ప‌టి వ‌ర‌కు దేశంలో 70 శాతానికి మించి పోలింగ్ ఎప్పుడూ న‌మోదు కాలేదు. దీనికి కార‌ణం.. ఓటు హ‌క్కు.. నిర్బంధం కాక‌పోవ డం. అంటే.. ఉదాహ‌ర‌ణకు జాతీయ జెండాను అవ‌మానించ‌కూడదు. అనేది అంద‌రికీ తెలిసిందే.


అలా చేస్తే ఏం జ‌రుగుతుందో కూడా అంద‌రికీ తెలుసు. అలానే రాష్ట్ర‌ప‌తిని, గ‌వ‌ర్న‌ర్‌ను, సుప్రీంకోర్టు, హైకోర్టుల‌ను విమ‌ర్శించ‌కూడదు. వ్య‌తిరేక వ్యాఖ్య‌లు చేయ‌కూడ‌దు. ఇలా చేస్తే.. ఏం జ‌రుగుతుందో అంద‌రికీ తెలిసిందే. అయితే.. ఓటు వేయ‌క‌పోతే.. ఏం జ‌రుగుతుంది? అంటే.. ఏమీ జ‌ర‌గ‌దు. ఎవ‌రూ వ‌చ్చి అడ‌గ‌ను కూడా అడ‌గ‌రు. ఈ నెల‌లోనే జ‌రిగిన ఎన్నిక‌ల్లో అస్సాంలో ఓ నియోజ‌క‌వ‌ర్గంలోని నాలుగు గ్రామాల ప్ర‌జ‌లు సుమారు ల‌క్ష మంది ఓటు హ‌క్కు వినియోగించుకోలేదు.


అయినా.. ఏమీ చేయ‌లేని ప‌రిస్తితి. దీనికి కార‌ణం.. ఓటు ప్రాథ‌మిక హ‌క్కు. దీనిని వినియోగించుకుంటే ఓకే లేక‌పోయినా.. ఎవ‌రూ ఏమీ చేయ‌రు. మ‌న‌కు ఉన్న ప్రాథ‌మిక హ‌క్కుల్లో విద్య కూడా ఉంది. ఇదీ కూడా అంతేక‌దా. చ‌దివేవారు చ‌దువుతారు లేక‌పోతేలేదు. ఇలాంటి ఓటు హ‌క్కు కూడా.. మ‌న కు ఊరికేనే ల‌భించలేదు. 1951కి ముందు.. అనేక ఉద్య‌మాలు జ‌రిగాయి అలా చెప్పాలంటే. ఒక‌ప్పుడు బ్రిటీష్ హ‌యాలో ఓటు హ‌క్కును జ‌మీందార్ల‌కు మాత్ర‌మే క‌ల్పించారు.


ఆస‌మ‌యంలోనే.. భ‌గ‌త్ సింగ్ వంటి వారు ఉద్య‌మాలు చేశారు. ఓటు హ‌క్కును అంద‌రికీ క‌ల్పించాల‌ని కోరారు. బ్రిటీష్ వారితో త‌గువు కూడా ప‌డ్డారు. ఇక‌, స్వాతంత్య్రానంత‌రం కూడా.. ఒక చిన్న క్లాజు తెర‌మీ దికి వ‌చ్చింది. దేశంలో పురుషుల‌కు మాత్ర‌మే ఓటు హ‌క్కు క‌ల్పించాలని. ఇలాంటి త‌ల‌తిక్క అంశాల‌పై.. నాటి మ‌హిళా ఉద్య‌మ‌కారులు పోరాడి.. మ‌హిళ‌ల‌కు కూడా ఓటు హ‌క్కు సంపాయించారు. తొలినాళ్ల‌లో ఓటు వేసేందుకు 21 సంవ‌త్స‌రాల‌ను ప్రాతిప‌దిక‌గా పెట్ట‌గా.. సుదీర్ఘ కాలం ఇదే జ‌రిగింది.


టీఎన్‌. శేష‌న్ హ‌యాంలో ఈ వ‌య‌సును ఏకంగా మూడేళ్లు త‌గ్గించి.. 18 చేశారు. కేంద్ర ప్రభుత్వం జనవరి 25ను జాతీయ ఓటర్ల దినోత్సవంగా ప్రకటించింది. కుల, మత, ప్రాంత, లింగ, జాతి, భాష అనే భేదం లేకుండా దేశంలో నివసించే 18 సంవత్సరాలు నిండిన పౌరులు అందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్‌ 326 ద్వారా ఓటు హక్కును కల్పిస్తున్నది. దేశ వ్యాప్తంగా అంద‌రూ ఓటు వేసేందుకు అనేక విధానాలు అందుబాటులో ఉన్నాయి.


పోస్ట‌ల్ బ్యాలెట్‌, హోం ఓటింగ్ సహా.. బూతుల్లోకి వెళ్లి వేసే ఓట్లు. మ‌రొక‌టి ప్రాక్సీ ఓటు అంటారు. దీనిని అంద‌రికీ ఇవ్వ‌రు. సైన్యం, వైమానిక ద‌ళ సిబ్బందికి ఇస్తారు. దీనిలో ప్రాక్సీ అంటే.. త‌న‌కు న‌చ్చిన వారితో త‌న అభిమ‌తం మేరకు ఓటు వేయించ‌డం. ఈ ప‌ద్ధతి ప్ర‌స్తుతం కూడా అందుబాటులో ఉంది. ఇక‌, మ‌రో కీల‌క విష‌యం ఏంటంటే.. ఓటు అనేది గోప్య‌తా హ‌క్కు!  ఈ విష‌యం చాలా మందికి తెలియ‌దు. గోప్య‌త అనేది ప్రాథ‌మిక హ‌క్కు కాదు. ఇది నిర్దిష్ట‌మైన హ‌క్కు.


ఇది న్యాయ‌స‌మీక్ష‌కు, చ‌ట్టానికి కూడా లోబ‌డి ఉంటుంది. అంటే.. ఓటును వేసిన త‌ర్వాత‌. ఎవ‌రికీ చెప్ప కూడ‌దు. పోలింగ్ కేంద్రం వ‌ద్ద‌కూడా.. ప్ర‌చారం చేయ‌కూడ‌దు. చిత్రం ఏంటంటే.. క‌న్న బిడ్డ‌కు కూడా.. ఓటు ఎవ‌రికి వేసిందీ చెప్ప‌కూడ‌దు. అడ‌గ‌కూడ‌దు. ఇక‌, భార్యా భ‌ర్త‌లు కూడా ఇంతే. ఇలా చెప్పిన‌ట్టు లేదా.. త‌న‌ను చెప్ప‌మ‌న్న‌ట్టు ఒత్తిడి తెస్తే.. దీనికి క‌ఠిన శిక్ష‌లే ఉన్నాయి. ఓటు హ‌క్కు వినియోగించుకోవ‌డం మ‌న ఇష్ట‌మే అయినా.. ఓటు వేసిన త‌ర్వాత‌.. ఎవ‌రికీ వేశామో చెప్ప‌రాద‌నేది చ‌ట్టం నిర్దేశిస్తోంది.


ఇలా.. పోలింగ్ ప్ర‌క్రియ‌, ఓటు హ‌క్కు వినియోగంలో అనేక వెసులుబాట్లు, నిబంధ‌న‌లు కూడా ఉన్నాయి. ఒక‌సారి ఓటేసిన వారు.. ఇంకు గుర్తును చెరిపేసుకుని.. మ‌రోసారి ఓటేస్తే.. వెంట‌నే అరెస్టు చేసే నిబంధ‌న‌లు దేశంలో అమ‌ల‌వుతున్నాయి. సో.. ఈ రెండు విష‌యాల్లోనూ ప్ర‌తి ఒక్క ఓట‌రూ జాగ్ర‌త్త‌గా ఉండాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>