EditorialChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababuf7fb5cc8-c452-41f7-8d66-fadedc17707e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/editorial/77/chandrababuf7fb5cc8-c452-41f7-8d66-fadedc17707e-415x250-IndiaHerald.jpgఈ సారి ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. ఢీ అంటే ఢీ అనే స్థాయిలో ప్రచార పర్వం సాగింది. విమర్శలు, ప్రతి విమర్శలతో నెలన్నర రోజులుగా ఎండలకు మించి ఏపీ పాలిటిక్స్ హీటెక్కాయి. ఒక్క అవకాశం పేరుతో అధికారం చేజిక్కించుకున్న జగన్ ను మరోసారి ఆదరిస్తారా లేక.. మార్పు కోరుతూ చంద్రబాబుకి జై కొడతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. గత ఎన్నికల్లో వైసీపీని అందలం ఎక్కించిన ఏపీ ఓటర్లు ఇప్పుడు ఎలాంటి తీర్పు ఇస్తారో అని ఉత్కంఠ నెలకొందchandrababu{#}Elections;CBN;Jagan;Andhra Pradesh;YCP;CMచంద్రబాబును ఓడిస్తున్న ఐదు కారణాలు ఇవే?చంద్రబాబును ఓడిస్తున్న ఐదు కారణాలు ఇవే?chandrababu{#}Elections;CBN;Jagan;Andhra Pradesh;YCP;CMMon, 13 May 2024 05:32:09 GMTఈ సారి ఏపీలో ఎన్నికలు హోరాహోరీగా సాగుతున్నాయి. వైసీపీ వర్సెస్ కూటమి పార్టీల మధ్య పోటీ నువ్వా నేనా అన్నట్లు సాగుతోంది. ఢీ అంటే ఢీ అనే స్థాయిలో ప్రచార పర్వం సాగింది. విమర్శలు, ప్రతి విమర్శలతో నెలన్నర రోజులుగా ఎండలకు మించి ఏపీ పాలిటిక్స్ హీటెక్కాయి.  ఒక్క అవకాశం పేరుతో అధికారం చేజిక్కించుకున్న జగన్ ను మరోసారి ఆదరిస్తారా లేక..  మార్పు కోరుతూ చంద్రబాబుకి  జై కొడతారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.


గత ఎన్నికల్లో వైసీపీని అందలం ఎక్కించిన ఏపీ ఓటర్లు ఇప్పుడు ఎలాంటి తీర్పు ఇస్తారో అని ఉత్కంఠ నెలకొంది. అయితే  ఈ ఎన్నికలు గతానికి భిన్నంగా జరుగుతాయి అని చెప్పడంలో సందేహం లేదు. గత ఎన్నికల మాదిరి ఏకపక్ష తీర్పు ఇవ్వకపోయినా వైసీపీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నట్లు పలు సర్వేలు స్పష్టం చేస్తున్నాయి.


ఎందుకంటే ఎన్నికల ముందు ఇచ్చిన మ్యానిఫెస్టోలో 99 శాతం హామీలను అమలు చేసిన సీఎం జగన్.. అదే అంశాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఇక చంద్రబాబు విషయానికొస్తే గత ఎన్నికల సమయంలో ఇచ్చిన మ్యానిఫెస్టోలో కీలక హామీలనే విస్మరించారు. ఇది ఆ కూటమికి మైనస్ గా మారింది. జగన్ అంటే విశ్వసనీయతకు మారు పేరు అనే నమ్మకం జనాల్లో కలిగింది.


మరోవైపు 2024 ఎన్నికల మ్యానిఫెస్టోను నవరత్నాల 2.0 ఓ విడుదల చేసిన జగన్ చాలా సింపుల్ గా తీర్చిదిద్దారు. కానీ చంద్రబాబు ఆకాశమే హద్దుగా సంక్షేమ పథకాలను ప్రకటించారు. వాస్తవానికి ఏపీ పరిస్థితి బాగాలేదు అని ఆ రాష్ట్ర ప్రజలకు కూడా తెలుసు. కానీ జగన్ మాట ఇచ్చారంటే దానిని తప్పరని.. చంద్రబాబు ఇచ్చిన హామీలు ఆచరణ సాధ్యం కాదు అని ఏపీ ఓటర్లు లెక్కలేసుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు రుణమాఫీ మాదిరి మాట తప్పుతారు అని మెజార్టీ వర్గం బలంగా నమ్ముతోంది.  చెప్పేవే చేస్తారని..  మాట ఇస్తే తప్పరు అనే భావనను ఏపీ ప్రజల్లో సీఎం జగన్ తీసుకురాగలిగారు. ఇదే ఆయన గెలుపునకు దోహదపడే అంశం అని విశ్లేషకులు అంటున్నారు.





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>