Politicspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ipla6472be2-4770-441c-96a8-2b6c2f373fca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ipla6472be2-4770-441c-96a8-2b6c2f373fca-415x250-IndiaHerald.jpgఈ ఏడాది తప్పకుండా కప్పు కొడుతుంది అనే గట్టి నమ్మకంతో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇక వరుసగా మ్యాచ్ లలో ఓడిపోతూ అభిమానులందరినీ కూడా నిరాశపరిచింది అన్న విషయం తెలిసిందే. అయితే ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నప్పటికీ ప్రత్యర్థి టీమ్స్ ఆ టీం కంటే మంచి ప్రదర్శన చేస్తుండడంతో ఆర్సిబికి ఓటమి తప్పలేదు. ఈ క్రమంలోనే ఇక వరుస ఓవటములతో పాయింట్ల పట్టికలో చివరన కొనసాగుతూ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది. ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆట తీరు చూస్తే ఈసారి ఇక టైటిల్ గెలవడం కాదు కనీసంIpl{#}Karthik;narain;Gujarat - Gandhinagarప్చ్.. దినేష్ కార్తీక్ చెత్త రికార్డు?ప్చ్.. దినేష్ కార్తీక్ చెత్త రికార్డు?Ipl{#}Karthik;narain;Gujarat - GandhinagarMon, 13 May 2024 13:00:00 GMTఈ ఏడాది తప్పకుండా కప్పు కొడుతుంది అనే గట్టి నమ్మకంతో బరిలోకి దిగిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఇక వరుసగా మ్యాచ్ లలో ఓడిపోతూ అభిమానులందరినీ కూడా నిరాశపరిచింది అన్న విషయం తెలిసిందే. అయితే ఆ జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేస్తున్నప్పటికీ ప్రత్యర్థి టీమ్స్ ఆ టీం కంటే మంచి ప్రదర్శన చేస్తుండడంతో ఆర్సిబికి ఓటమి తప్పలేదు. ఈ క్రమంలోనే ఇక వరుస ఓవటములతో పాయింట్ల పట్టికలో  చివరన కొనసాగుతూ తీవ్రస్థాయిలో విమర్శలు ఎదుర్కొంది.


 ఇక రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు ఆట తీరు చూస్తే ఈసారి ఇక టైటిల్ గెలవడం కాదు కనీసం ప్లే ఆఫ్ లో అయినా అడుగుపెడుతుందా లేదా అనే అనుమానం అందరిలో నిండిపోయింది. అయితే ఇలా మొదట్లో వరుస ఓటములతో సతమతమైనప్పటికీ ఆ తర్వాత మాత్రం అనూహ్యంగా పుంజుకుంది ఆ జట్టు. ఈ క్రమంలోనే వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో తమ స్థానాన్ని అంతకంతకు మెరుగుపరుచుకుంటుంది. ఇప్పటివరకు 13 మ్యాచ్లు ఆడిన రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు.. ఆరు విజయాలతో ప్రస్తుతం పాయింట్ల పట్టికలో ఐదో స్థానంలో కొనసాగుతూ ఉండటం గమనార్హం.


 ఇటీవల గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా తొమ్మిది వికెట్ల తేడాతో ఘనవిజయాన్ని అందుకుంది ఆర్సిబి జట్టు. దీంతో ప్లే ఆఫ్ అవకాశాలను మరింత మెరుగుపరుచుకుంది. అయితే మొదట్లో తన బ్యాటింగ్తో మెరుపులు మెరిపించిన దినేష్ కార్తీక్ మాత్రం వరుసగా విఫలమవుతూ ఉండడం గమనార్హం. ఇక ఇటీవల గుజరాత్ టైటాన్స్ తో జరిగిన మ్యాచ్లో పరుగుల ఖాతా తెరవకుండానే డక్ అవుట్ గా వెనుతిరిగాడు. దీంతో ఒక చెత్త రికార్డు అతని ఖాతాలో చేరిపోయింది  ఐపీఎల్ లో ఇక అత్యధిక సార్లు డెకౌట్ అయిన ప్లేయర్గా నిలిచాడు దినేష్ కార్తీక్. ఇప్పటివరకు 18 సార్లు ఇలా డక్ అవుట్ గా పెవిలియన్ చేరాడు అని చెప్పాలి. అతని తర్వాత రోహిత్ 17, మ్యాక్స్వెల్ 17, నరైన్ 16, చావ్లా 16 డక్ అవుట్లతో తర్వాత స్థానాలలో ఉన్నారు అని చెప్పాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>