Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle107d4673-4420-48d0-889e-62aad75e6725-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle107d4673-4420-48d0-889e-62aad75e6725-415x250-IndiaHerald.jpgసినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటి. త్రినయని సీరియల్ ఫేం పవిత్ర జయరాం దుర్మరణం చెందారు.కెమెరా ముందు ముఖానికి రంగేసుకుని అందంగా కనిపించే తారలు.. ఒక్కసారి ఆ మేకప్ తీసేస్తే, ఆ మోహంలో ఎన్నో విషాద ఛాయలు ఉంటాయి. సినిమా, సీరియల్ నటులు జీవితాలు కూడా పూల పాన్పులు కావు.కొందరి జీవితాలు ముళ్ల కంచెలు కూడా. అలాంటి జీవితాన్ని అనుభవించింది పవిత్ర జయరామ్. ఇలా పేరు చెబితే టక్కున గుర్తురాదు కానీ.. త్రినయని తిలోత్తమ అంటే బుల్లితెర ప్రేక్షకులు ఇట్టే గుర్తుపడుతుంటారు. జీలో టెలికాస్ట్ అవుతున్నsocialstars lifestyle{#}jayaram;RTC;sunday;village;Kannada;Car;Audience;Accident;Makeup;Mahbubnagar;Wanaparthy;Telugu;Hyderabadరోడ్డు ప్రమాదంలో సీరియల్ నటి కన్నుమూత..విషాదం లో తెలుగు పరిశ్రమ..!!రోడ్డు ప్రమాదంలో సీరియల్ నటి కన్నుమూత..విషాదం లో తెలుగు పరిశ్రమ..!!socialstars lifestyle{#}jayaram;RTC;sunday;village;Kannada;Car;Audience;Accident;Makeup;Mahbubnagar;Wanaparthy;Telugu;HyderabadMon, 13 May 2024 17:00:00 GMTసినీ ఇండస్ట్రీలో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ బుల్లితెర నటి. త్రినయని సీరియల్ ఫేం పవిత్ర జయరాం దుర్మరణం చెందారు.కెమెరా ముందు ముఖానికి రంగేసుకుని అందంగా కనిపించే తారలు.. ఒక్కసారి ఆ మేకప్ తీసేస్తే, ఆ మోహంలో ఎన్నో విషాద ఛాయలు ఉంటాయి. సినిమా, సీరియల్ నటులు జీవితాలు కూడా పూల పాన్పులు కావు.కొందరి జీవితాలు ముళ్ల కంచెలు కూడా. అలాంటి జీవితాన్ని అనుభవించింది పవిత్ర జయరామ్. ఇలా పేరు చెబితే టక్కున గుర్తురాదు కానీ.. త్రినయని తిలోత్తమ అంటే బుల్లితెర ప్రేక్షకులు ఇట్టే గుర్తుపడుతుంటారు. జీలో టెలికాస్ట్ అవుతున్న త్రినయని సీరియల్ లో తిలోత్తమ గా విలన్ పాత్రలో పవిత్ర మంచి పేరు తెచ్చుకుంది. కాగా పవిత్ర జయరామ్ ఆదివారం తెల్లవారుజామున రోడ్డు యాక్సిడెంట్ లో మృతిచెందింది. మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి గ్రామం దగ్గర ఉన్న జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్న పవిత్ర కారు డివైడర్‏ను ఢీ కొట్టి అటు కుడి వైపున హైదరాబాద్ నుంచి వనపర్తి వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొట్టింది. ఈ ఘటనలో పవిత్ర జయరామ్ అక్కడిక్కడే ప్రాణాలు కోల్పోయారు. తనతో పాటు కారులో ప్రయాణిస్తున్న మరో ముగ్గురు గాయాలతో బయటపడ్డారు.

ఆమె మరణంతో బుల్లితెర పై విషాద ఛాయలు నెలకొన్నాయి. కర్ణాటక లోని మాండ్య కు చెందిన పవిత్ర జయరామ్.. పెద్దగా చదువుకోలేదు. అయితే తనకుంటూ సొంత గుర్తింపు ఉండాలని తపన తనలో ఎప్పుడూ ఉండేదట. అలా మాండ్య నుంచి బెంగళూరు కు వచ్చి సొంతంగా ఎదగాలని చాలా ఉద్యోగాలు చేసిందట. అదే టైమ్ లో తన ఫ్రెండ్ సలహా మేరకు డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ లో చేరింది. ఆ తర్వాత సీరియల్స్ లో నటించాలని కోరికతో పలు ఆడిషన్స్ కు వెళ్లేదట. అలా జోకాలి అనే కన్నడ సీరియల్ లో హీరోకి చెల్లిలి పాత్ర చేసే చాన్స్ వచ్చిందట. ఆ తర్వాత కన్నడలో పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అటు తర్వాత తెలుగులో నిన్నే పెళ్లాడతా సీరియల్ లో తొలి అవకాశం వచ్చిందట. అయితే అప్పుడు తెలుగు తనకు అస్సలు అర్థం కాలేదట. దాంతొ ఒక టైమ్ లో సీరియల్ మానేసి కన్నడ సీరియల్స్ లోకి వెళ్లిపోవాలనుకుందట. కానీ తనతో అప్పడు పనిచేసిన తోటీ నటీనటులు నచ్చ జెప్పి తెలుగు నేర్పించారట. అలా ఇప్పుడు తెలుగులో మంచిగా మాట్లాడుతున్నట్లు ఆ మధ్య జరిగిన ఓ ఇంటర్వూలో తెలిపింది. ఇక తన పర్సనల్ లైఫ్ విషయానికొస్తే.. పవిత్ర జయరామ్ కు అతి చిన్న వయసులోనే పెళ్లయింది. ఆమెకు పెళ్లయ్యే టైమ్ కు తనకు కేవలం 16 ఏళ్లేనట. ఆ తర్వాత కట్టుకున్న భర్తతో విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని ఒంటిరిగా జీవిస్తుంది. ప్రస్తుతం పవిత్ర జయరామ్ కు 22ఏళ్ల కొడుకు, 19 ఏళ్ల కూతురు ఉంది. వీరిద్దరి కష్టపడి సొంతగా పెంచింది. ఇలాంటి టైమ్ లో పవిత్ర జయరామ్ మరణించడం నిజంగా బుల్లితెరపై తీరని లోటు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>