PoliticsPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-elections-jagan-ysr-raithu-bharosa-chandrababu-ycp-tdp539e8be0-7819-464a-9e29-118512a51068-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/ap-elections-jagan-ysr-raithu-bharosa-chandrababu-ycp-tdp539e8be0-7819-464a-9e29-118512a51068-415x250-IndiaHerald.jpgఏపీలో ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే పోలింగ్ మొదలై హడావిడి జరుగుతోంది. అలాంటి ఈ తరుణంలో ప్రతి ఒక్క నేతలో గుబులు మొదలైంది. అసలు ఓటు ఏ పార్టీ వైపు పడుతుందో చెప్పడం కూడా కష్టంగా మారింది. రాత్రంతా మద్యం,డబ్బులు పంచే పనిలో పడ్డారు నేతలు. ప్రస్తుతం ఓటర్ అన్నలు వారి మనసులో ఎవరున్నారు.. ఏ వైపు ఓటు వేస్తున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. అలాంటి ఈ తరుణంలో ఏపీ రైతుల ఓట్లు చాలా కీలకం కానున్నాయి. ఇప్పటికే చాలామంది రైతులు స్వచ్ఛందంగా జగనన్నకే ఓటేస్తామని చెబుతున్నారు. రైతుల కోసం జగన్ ఎంతో చేశAP;ELECTIONS;JAGAN;YSR RAITHU BHAROSA;CHANDRABABU;YCP;TDP{#}king;Jagan;CBN;Party;Andhra Pradeshఏపీ: రైతాంగం ఎవరి పక్షం.?ఏపీ: రైతాంగం ఎవరి పక్షం.?AP;ELECTIONS;JAGAN;YSR RAITHU BHAROSA;CHANDRABABU;YCP;TDP{#}king;Jagan;CBN;Party;Andhra PradeshMon, 13 May 2024 07:29:23 GMTఏపీలో ఎన్నికల పోరు చివరి దశకు చేరుకుంది. ఇప్పటికే పోలింగ్ మొదలై హడావిడి జరుగుతోంది.  అలాంటి ఈ తరుణంలో ప్రతి ఒక్క నేతలో గుబులు మొదలైంది. అసలు ఓటు ఏ పార్టీ వైపు పడుతుందో చెప్పడం కూడా కష్టంగా మారింది.  రాత్రంతా మద్యం,డబ్బులు  పంచే పనిలో పడ్డారు నేతలు. ప్రస్తుతం ఓటర్ అన్నలు వారి మనసులో ఎవరున్నారు.. ఏ వైపు ఓటు వేస్తున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. అలాంటి ఈ తరుణంలో ఏపీ రైతుల ఓట్లు చాలా కీలకం కానున్నాయి. ఇప్పటికే చాలామంది రైతులు స్వచ్ఛందంగా   జగనన్నకే ఓటేస్తామని చెబుతున్నారు. రైతుల కోసం జగన్ ఎంతో చేశారు. 

ముఖ్యంగా ఎక్కడ పంట నష్టం జరిగినా కానీ వారికి తొందరగా పరిహారం అందిస్తూ రైతులను ఆదుకుంటూ వచ్చారు. దీని ద్వారా లక్షలాది మంది రైతులు లబ్ధి పొందారు. 2023 డిసెంబర్లో పంట నష్టపోయిన 11 లక్షల మంది రైతులకు ఇన్పుట్ సబ్సిడీలను అందజేశారు. అంతేకాకుండా రైతులకు పంటలకు ఇన్సూరెన్స్ కార్యక్రమాలు కూడా జగన్ అందించారు. అలాగే సబ్సిడీపై పంట విత్తనాలు అందించారు.. ఇక రైతులకు అన్ని సేవలు అందుబాటులో ఉండాలని రైతు భరోసా కేంద్రాలను కూడా ప్రవేశపెట్టారు. ఈ భరోసా కేంద్రాల ద్వారా విత్తనాల నుంచి విక్రయం వరకు ప్రతి ఒక్క సేవలు అందుబాటులోకి వచ్చాయి. ముఖ్యంగా ప్రైవేట్ వ్యాపారులు, డీలర్ల ఆగడాలకు స్వస్తి పలికేలా రైతు భరోసా కేంద్రాలు పనిచేస్తున్నాయి.

 సున్నా వడ్డీ పథకం వంటివి రైతుల కోసం తీసుకువచ్చి వారికి అండగా నిలిచారు జగన్. ఈ విధంగా ఏపీలో రైతే రాజు లక్ష్యంగా జగన్ తన పాలన అందించాడని చెప్పవచ్చు. ఇలా ఏపీలో లక్షలాది మంది రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎన్నో సేవలు అందాయి. అలాంటి సేవలు మళ్లీ అందాలంటే జగన్ ప్రభుత్వమే మళ్ళీ రావాలని, చాలామంది రైతులు కోరుకుంటున్నారట. చంద్రబాబు పాలనలో రైతులు నష్టపోతారని, ఆయన పాలనలో వర్షాలు కూడా పడవని, పంటలు కూడా కరెక్ట్ గా పడవనే అపోహ ఒకటి ప్రజల్లో ఉంది. కాబట్టి ఈసారి రైతులంతా జగనన్న వైపే ఉన్నారని, ఓట్లన్నీ ఆయనకు వన్ సైడ్ గా పడతాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>