PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/which-party-will-win-in-uttharandhradaf1c9d6-b4a3-4efa-bbe4-8858675b2d68-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_analysis/which-party-will-win-in-uttharandhradaf1c9d6-b4a3-4efa-bbe4-8858675b2d68-415x250-IndiaHerald.jpg•ఉత్తరాంధ్రలో ఆసక్తికర పోటీ •నోట్ల పంపిణీలో పోటీ పడిన ప్రధాన పార్టీలు •ఆధిక్యంలో దూసుకుపోయిన టీడీపీ ఉత్తరాంధ్ర - ఇండియా హెరాల్డ్: ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర అనేది కీలకమైన ఏరియా. ఇక్కడ శ్రీకాకుళంలో 10, విజయనగరం 9, విశాఖలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అరకు వంటి 5 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ పార్టీ అయిన ఉత్తరాంధ్రలో గెలిస్తే 50 శాతం అధికారంలోకి వచ్చేసినట్టే. అందుకే ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలు ఇక్కడ గెలుపు కోసం ఆరాAP Elections 2024{#}Anakapalle;Vijayanagaram;Uttarandhra;Vizianagaram;Araku Valley;Parliment;TDP;Andhra Pradesh;Survey;Assembly;Congress;Party;Bharatiya Janata Party;YCP;Indiaఏపీ: ఉత్తరాంధ్రలో గెలుపు ఏ పార్టీదంటే?ఏపీ: ఉత్తరాంధ్రలో గెలుపు ఏ పార్టీదంటే?AP Elections 2024{#}Anakapalle;Vijayanagaram;Uttarandhra;Vizianagaram;Araku Valley;Parliment;TDP;Andhra Pradesh;Survey;Assembly;Congress;Party;Bharatiya Janata Party;YCP;IndiaSun, 12 May 2024 03:30:00 GMT•నోట్ల పంపిణీలో పోటీ పడిన ప్రధాన పార్టీలు
•ఆధిక్యంలో దూసుకుపోయిన టీడీపీ


ఉత్తరాంధ్ర - ఇండియా హెరాల్డ్: ఆంధ్రప్రదేశ్లో ఉత్తరాంధ్ర అనేది కీలకమైన ఏరియా. ఇక్కడ  శ్రీకాకుళంలో 10, విజయనగరం 9, విశాఖలో 15 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. అలాగే శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అనకాపల్లి, అరకు వంటి 5 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. ఏ పార్టీ అయిన ఉత్తరాంధ్రలో గెలిస్తే 50 శాతం అధికారంలోకి వచ్చేసినట్టే. అందుకే ఆంధ్రప్రదేశ్ లో పోటీ చేస్తున్న ప్రధాన పార్టీలు ఇక్కడ గెలుపు కోసం ఆరాటంగా ఉన్నాయి. ముఖ్యంగా ఓటుకి నోటు విషయంలో మాత్రం తగ్గేదేలే అన్నట్లు ఉన్నాయి. ఉత్తరాంధ్రలో చాలా ఏరియాల్లో  అధికార వైసీపీ గెలుపు కోసం బాగానే నోట్లు ఇచ్చినట్టు ఇండియా హెరాల్డ్ సర్వే ద్వారా తేలింది. దీంతో రెండోసారి అధికారం ఖాయమంటున్న వైసీపీలో నమ్మకం పోయిందా అనే అనుమానాలు ఎక్కువగా వస్తున్నాయి. ఇంత వరకు పార్టీ అధినేతలు, కొందరు కీలక మంత్రులు పోటీ చేస్తున్న స్థానాల్లో వారికి తిరుగుండదు అనే ప్రచారం కూడా ఉండేది.కానీ ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా స్ట్రాంగ్ గా ఉండటంతో నోట్ల పంపకాలు పెంచే పనిపై కూడా ఆధారపడ్డారు.ఇక నోట్ల పంపిణీ విషయంలో ప్రతిపక్ష టీడీపీ,జనసేన,బీజేపీ కూటమి కూడా అధికార వైసీపీ కంటే తక్కువేమి తినలేదు. భవిష్యత్తుకు గ్యారంటీ, సూపర్‌సిక్స్‌ వంటి హామీలతో ఊదరగొడుతున్నా కానీ కేవలం వాటితోనే గెలుస్తామనే నమ్మకం వారికి లేనట్టుంది. వైసీపీతో పోటీ పడి మరీ నోట్లు పంపిణీ చేశారు కూటమి నేతలు.


అయితే సహజంగా అధికారంలో ఉన్న వారు ఎక్కువగా నోట్లు ఇచ్చే అవకాశాలుంటాయి. అందుకే కూటమి వైసీపీ నేతలు ఎంత పంపిణీ చేశారో తెలుసుకొని అందుకు తగ్గట్టు వారు కూడా తక్కువేం కాదన్నట్టు నోట్లు ఇచ్చారు. అవినీతిలో కూరుకుపోయిన జగన్‌ పార్టీ ఓడిపోవడం ఖాయమని, అధికారంలోకి వచ్చేది తామే అని చెప్పుకుంటున్న కూటమి నేతలు కూడా నోట్లు బాగానే ఇచ్చారు. ముఖ్యంగా విశాఖని గెలవడానికి ఏకంగా 4 వేల నుంచి 10 వేల రూపాయల దాకా ఇచ్చారు. వైసీపీ వాళ్లు కేవలం 3 వేల నుంచి 5 వేలు మాత్రమే ఇస్తే టీడీపీ వాళ్ళు మాత్రం అత్యధికంగా ఓటుకి 10 వేలు కూడా ఇచ్చినట్లు ఇండియా హెరాల్డ్ సర్వేలో తేలింది. ఇది కేవలం విశాఖలోనే కాదు ఉత్తరాంధ్రలోనే హైయెస్ట్. ఇక కాంగ్రెస్ కూడా మరీ వైసీపీ, కూటమి అంత కాకపోయినా బాగానే నోట్లు ఇచ్చింది. కానీ ఏ లాభం లేదు.


ఇక ఉత్తరాంధ్రాలోని అరకు, విజయనగరం పార్లమెంట్ నియోజకవర్గాల్లో వైసీపీ గెలిచే ఛాన్స్ ఉండగా శ్రీకాకుళం, విశాఖపట్నం, అనకాపల్లి  పార్లమెంట్ నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి గెలిచే ఛాన్స్ ఉన్నట్లు ఇండియా హెరాల్డ్ సర్వేలో తేలింది. మొత్తంగా ఉత్తరాంధ్రలో టీడీపీ కూటమి వైసీపీ కంటే ముందు ఉంది. చూడాలి మరి ఎన్నికల తరువాత ఫలితాలు ఎలా ఉంటాయనేది!


మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>