PoliticsRAMAKRISHNA S.S.editor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-who-changed-the-scene-in-the-climax-in-pithapuram-this-is-a-big-blow-to-pawan106a9611-6e2b-40bc-b6e9-724998a82eb8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-who-changed-the-scene-in-the-climax-in-pithapuram-this-is-a-big-blow-to-pawan106a9611-6e2b-40bc-b6e9-724998a82eb8-415x250-IndiaHerald.jpgఏపీలో అంద‌రి క‌ళ్లూ.. పిఠాపురంపైనే ఉన్నాయి. ఇక్క‌డ నుంచి పోటీ చే స్తున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ గెలుస్తారా? లేదా? అనేది ఒక భాగం. అంతేకాదు.. ప‌వ‌న్‌ను గెలిపించేందుకు ఎక్క‌డెక్క‌డ నుంచో పెద్ద ఎత్తున కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, ఆర్టిస్టులు, ఇత‌ర ప్ర‌జ‌లు కూడా వ‌చ్చారు. దీంతో ఇక్క‌డ ప‌వ‌న్ గెలుస్తారా? లేదా? అనేది ఒక అంశం. అయితే.. ఇప్పుడు దీనికి మించిన హైఓల్టేజ్ ఇక్క‌డ క‌నిపిస్తోంది. దీనికి కార‌ణం.. వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ త‌న చిట్ట చివ‌రి ప్ర‌చారం పిఠాపురంలో చేయ‌డ‌మే. మేమంతా సిద్ధం పేరుAP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; pawan kalyan; jenasena; ycp; jagan{#}geetha;East;YCP;CMపిఠాపురంలో క్లైమాక్స్‌లో సీన్ మార్చేసిన జ‌గ‌న్‌... ప‌వ‌న్‌కు పెద్ద దెబ్బే ఇది..!పిఠాపురంలో క్లైమాక్స్‌లో సీన్ మార్చేసిన జ‌గ‌న్‌... ప‌వ‌న్‌కు పెద్ద దెబ్బే ఇది..!AP-Assembly-Elections; AP-Elections-Survey Telangana-parliament-elections Andhrapradesh-Assembly-Elections Assembly-Elections-2024; pawan kalyan; jenasena; ycp; jagan{#}geetha;East;YCP;CMSun, 12 May 2024 10:22:30 GMTఏపీలో అంద‌రి క‌ళ్లూ.. పిఠాపురంపైనే ఉన్నాయి. ఇక్క‌డ నుంచి పోటీ చే స్తున్న జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ గెలుస్తారా?  లేదా? అనేది ఒక భాగం. అంతేకాదు.. ప‌వ‌న్‌ను గెలిపించేందుకు ఎక్క‌డెక్క‌డ నుంచో పెద్ద ఎత్తున కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు, ఆర్టిస్టులు, ఇత‌ర ప్ర‌జ‌లు కూడా వ‌చ్చారు. దీంతో ఇక్క‌డ ప‌వ‌న్ గెలుస్తారా?  లేదా? అనేది ఒక అంశం. అయితే.. ఇప్పుడు దీనికి మించిన హైఓల్టేజ్ ఇక్క‌డ క‌నిపిస్తోంది. దీనికి కార‌ణం.. వైసీపీ అధినేత, సీఎం జ‌గ‌న్ త‌న చిట్ట చివ‌రి ప్ర‌చారం పిఠాపురంలో చేయ‌డ‌మే.


మేమంతా సిద్ధం పేరుతో  సీఎం జ‌గ‌న్ ప్ర‌చారం చేస్తున్న విష‌యం తెలిసిందే. రోజుకు మూడు నియోజ‌క వ‌ర్గాల నుంచి నాలుగుకు పెంచారు. సుడిగాలి ప‌ర్య‌ట‌న‌లు చేస్తున్నారు. వైసీపీని గెలిపించాల‌ని కోరుతు న్నారు. ఉద‌యం నుంచి రాత్రివ‌ర‌కు చాలానే శ్ర‌మిస్తున్నారు. ఈ క్ర‌మంలో పోలింగ్ ప్ర‌చారానికి చివ‌రి రోజైన శ‌నివారం.. సీఎం జ‌గ‌న్ నాలుగు జిల్లాల్లో ఐదు స‌భ‌ల్లో పాల్గొన్నారు. దీనిలో ఒక‌టి ఉమ్మ‌డి తూర్పు గోదావరి జిల్లా. ఇక్క‌డి పిఠాపురంలో ఆయ‌న చిట్ట‌చివ‌రి స‌భ నిర్వ‌హించారు.


దీంతో జ‌గ‌న్ ఏం చెబుతారు?  ఏం పిలుపు ఇస్తారు? అనేది స‌ర్వ‌త్రా ఆస‌క్తిగా మారింది. నిజానికి ఇప్ప‌టికి రెండు సార్లు సీఎం జ‌గ‌న్ పిఠాపురంలో ప‌ర్య‌టించి.. ప్ర‌సంగించారు. ఈ సంద‌ర్భంగా ప‌వ‌న్‌ను తీవ్ర‌స్తాయి లో ఎండ‌గ‌ట్టారు. కుటుంబం, భార్య‌లు అంటూ.. ఎద్దేవా చేశారు. అంతేకాదు..త‌ను ఎప్పుడూ.. చెప్పే ద‌త్త‌పుత్రుడు అనే మాట‌ను కూడా ప‌దే ప‌దే చెప్పారు. సో.. పిఠాపురంలో మ‌హిళా ఓటు బ్యాంకును ప్ర‌భావితం చేసేలా జ‌గ‌న్ వ్య‌వ‌హ‌రించారు. ఇక‌, ఇప్పుడు చివ‌రి రోజు కూడా ప‌వ‌న్‌ను టార్గెట్ చేసుకుని జ‌గ‌న్ వేసిన పంచ్ లు అదిరిపోయాయి.


జ‌గ‌న్‌ చివ‌రి నిముషంలో మాట్లాడిన‌ మాట‌లు ప‌వ‌న్‌ను డ్యామేజీ చేశాయ‌నే అంటున్నారు. పైగా వంగా గీత బాగా ఎమోష‌న‌ల్ అవ్వ‌డం.. జ‌గ‌న్ స‌ముదాయించ‌డం ఇవ‌న్నీ మ‌హిళ‌ల్లో బాగా వైసీపీ, గీత ప‌ట్ల సానుభూతి క‌లిగేలా చేశాయి. అలాగే ఇటు ప‌వ‌న్‌ను టార్గెట్ చేస్తూ ఆయ‌న‌కు మ‌హిళ‌లు అంటే గౌర‌వం లేదంటూ జ‌గ‌న్ చేసిన కామెంట్లు.. అక్క‌డ‌కు వ‌చ్చిన జ‌నాలు ఇవ‌న్నీ చూస్తే పిఠాపురంలో ప‌వ‌న్‌కు అంత ఈజీ కాద‌నే అంటున్నాయి రాజ‌కీయ వ‌ర్గాలు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - RAMAKRISHNA S.S.]]>