PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/krishna3c98d217-e741-4a90-9b87-fc4b002b7c55-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/krishna3c98d217-e741-4a90-9b87-fc4b002b7c55-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు అనగా మే 13వ తేదీన సోమవారం రోజు అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయ్యి చాలా రోజులే అవుతుంది. ఈ షెడ్యూల్ విడుదల అయిన తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ హిట్ చాలా ఎక్కువగా ఉంది. మరి రెండు మూడు రోజుల క్రితం నుండి అయితే ఈ హీట్ మరి ఎక్కువగా పెరిగింది. ఇక నిన్నటితో ప్రచార కార్యక్రమాలు కూడా ముగిసిపోయాయి. ఇక ఇప్పటివరకు లీడర్లు అంతా తమ శాయశక్తులా గెలుపు కోసం ఎన్నో ప్రయత్నాలను చేశారు. అందులో భాగంగkrishna{#}JOGI RAMESH;K E Krishnamurthy;anil kumar singhal;Pamarru;Penamaluru;Avanigadda;Mandali Buddha Prasad;Pedana;Simhadri;Bode Prasad;ramu;Krishna River;Air;Nani;Kollu Ravindra;Amarnath Cave Temple;prasad;krishna;monday;raja;sree;Parliment;Janasena;CBN;Vallabhaneni Vamsi;Yarlagadda Venkatrao;gannavaram;Assembly;YCP;Party;Andhra Pradeshకృష్ణా జిల్లా టోటల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇదే.. జనాలు ఎవరి సైడు నిలవనున్నారో తెలుసా..?కృష్ణా జిల్లా టోటల్ గ్రౌండ్ రిపోర్ట్ ఇదే.. జనాలు ఎవరి సైడు నిలవనున్నారో తెలుసా..?krishna{#}JOGI RAMESH;K E Krishnamurthy;anil kumar singhal;Pamarru;Penamaluru;Avanigadda;Mandali Buddha Prasad;Pedana;Simhadri;Bode Prasad;ramu;Krishna River;Air;Nani;Kollu Ravindra;Amarnath Cave Temple;prasad;krishna;monday;raja;sree;Parliment;Janasena;CBN;Vallabhaneni Vamsi;Yarlagadda Venkatrao;gannavaram;Assembly;YCP;Party;Andhra PradeshSun, 12 May 2024 08:12:18 GMTఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు అనగా మే 13వ తేదీన సోమవారం రోజు అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ విడుదల అయ్యి చాలా రోజులే అవుతుంది. ఈ షెడ్యూల్ విడుదల అయిన తేదీ నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయ హిట్ చాలా ఎక్కువగా ఉంది. మరి రెండు మూడు రోజుల క్రితం నుండి అయితే ఈ హీట్ మరి ఎక్కువగా పెరిగింది. ఇక నిన్నటితో ప్రచార కార్యక్రమాలు కూడా ముగిసిపోయాయి. ఇక ఇప్పటివరకు లీడర్లు అంతా తమ శాయశక్తులా గెలుపు కోసం ఎన్నో ప్రయత్నాలను చేశారు. 

అందులో భాగంగా కృష్ణ జిల్లా ప్రధాన పార్టీలు అయినటువంటి వైసీపీ కూటమి అభ్యర్థుల పరిస్థితులు ఎలా ఉన్నాయి? ఎవరికి గెలుపు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనే విషయాలను తెలుసుకుందాం. కృష్ణా జిల్లాలో మొత్తం పామర్రు, గన్నవరం, గుడివాడ, అవనిగడ్డ, పెనమలూరు, పెడన, మచిలీపట్నం అని ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక పామర్రు నుండి కైలే అనిల్ కుమార్ వైసీపీ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగనుండగా ... వర్ల కుమార రాజా కూటమి అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నాడు. 

ఇక ఈసారి కూటమి గాలి కాస్త ఎక్కువగా వీచే అవకాశాలు కనిపిస్తున్న నేపథ్యంలో అనిల్ కుమార్ కంటే కూడా కుమార రాజాకు ఈ ప్రాంతంలో కాస్త ఎడ్జ్ ఉన్నట్లు కనిపిస్తోంది. గన్నవరం నుండి వైసీపీ పార్టీ అభ్యర్థిగా వల్లభనేని వంశీ మోహన్ బరిలోకి దిగగా ... కూటమి అభ్యర్థిగా యార్లగడ్డ వెంకట్రావు బరిలోకి దిగాడు. సీనియర్ కావడం , అధికార పార్టీ వ్యక్తి కావడంతో వల్లభనేని వంశీ మోహన్ సైడ్ జనాలు కాస్త ఎక్కువగా నిలిచే అవకాశాలు ఉన్నాయి. ఇక గుడివాడ నుండి కొడాలి శ్రీ వెంకటేశ్వర రావు (నాని) వైసీపీ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగుతుండగా ... కూటమి నుండి వెనిగండ్ల రాము బరిలోకి దిగుతున్నాడు. 

ఇప్పటికే నాని వరుసగా 2004 వ సంవత్సరం నుండి నాలుగు సార్లు ఇదే ప్రాంతం నుండి గెలిచాడు. దానితో ఐదవ సారి కూడా ఈ ప్రాంతం నుండి గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అవనిగడ్డ నుండి వైసీపీ అభ్యర్థిగా సింహాద్రి రమేష్ బాబు పోటీలోకి దిగగా , కూటమి అభ్యర్థిగా జనసేన పార్టీ నేత మండలి బుద్ధ ప్రసాద్ బరిలో ఉన్నాడు. ఇక ఈ ఇద్దరిలో మండలి బుద్ధ ప్రసాద్ సైడే కాస్త ఎడ్జ్ కనబడుతుంది. పెనమలూరు నుండి వైసీపీ అభ్యర్థిగా జోగి రమేష్ , కూటమి అభ్యర్థిగా బోడే ప్రసాద్ బరిలో దిగారు. వీరిలో బోడె ప్రసాద్ సైడ్ కాస్త ఎడ్జ్ కనబడుతుంది. 

పెడన నుండి వైసీపీ అభ్యర్థిగా ఉప్పుల రాము , కూటమి అభ్యర్థి గా కాగిత కృష్ణ ప్రసాద్ బరిలో ఉండగా వీరిలో కాగితా కృష్ణ ప్రసాద్ గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మచిలీపట్నం నుండి వైసీపీ పార్టీ అభ్యర్థిగా పేర్ని కృష్ణమూర్తి (కిట్టు) బరిలో ఉండగా , కూటమి నుండి కొల్లు రవీంద్ర బరిలో ఉన్నారు. వీరిలో  వైసీపీ పార్టీ అభ్యర్థి అయినటువంటి పేర్ని కృష్ణమూర్తి సైడు ఎక్కువ జనాలు ఉండే అవకాశం ఉన్నట్లు ఈయనే ఈ ప్రాంతంలో గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>