DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/jagan42dd0012-5f83-43bc-9c97-0bcd4fb39080-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/jagan42dd0012-5f83-43bc-9c97-0bcd4fb39080-415x250-IndiaHerald.jpgపిఠాపురంలో గెలుపును వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా పవన్ ను ఓడించాలనే కృత నిశ్చయంతో ఉంది. అందుకే పిఠాపురంలో భారీ ఎత్తున డబ్బులు ఖర్చు పెడుతున్నారు అని జనసేన ఆరోపిస్తోంది. దీనిపై ముందుగానే అలెర్ట్ అయింది. అటు జనసైనికులు సైతం గట్టిగానే ప్రతిఘటిస్తుండటంతో వైసీపీ సెంటిమెంట్ అస్త్రాలను బయటకు తీస్తోంది. చివరి రోజు పిఠాపురం నియోజకవర్గాన్ని జగన్ ఎంచుకున్నారు. దాదాపు రోజంతా అక్కడే గడిపారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు సరికొత్త సంకేతాలు పంపారు. వైసీపీ అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాలతో పjagan{#}geetha;GEUM;Janasena;Deputy Chief Minister;Backward Classes;advertisement;pithapuram;bharath;Sri Bharath;Jagan;kuppam;Minister;YCP;local languageపవన్ కల్యాణ్‌ కోటను బద్దలు కొట్టిన జగన్..?పవన్ కల్యాణ్‌ కోటను బద్దలు కొట్టిన జగన్..?jagan{#}geetha;GEUM;Janasena;Deputy Chief Minister;Backward Classes;advertisement;pithapuram;bharath;Sri Bharath;Jagan;kuppam;Minister;YCP;local languageSun, 12 May 2024 11:05:00 GMTపిఠాపురంలో గెలుపును వైసీపీ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. ఎలాగైనా పవన్ ను ఓడించాలనే కృత నిశ్చయంతో ఉంది. అందుకే పిఠాపురంలో భారీ ఎత్తున డబ్బులు ఖర్చు పెడుతున్నారు అని జనసేన ఆరోపిస్తోంది. దీనిపై ముందుగానే అలెర్ట్ అయింది. అటు జనసైనికులు సైతం గట్టిగానే ప్రతిఘటిస్తుండటంతో వైసీపీ సెంటిమెంట్ అస్త్రాలను బయటకు తీస్తోంది.


చివరి రోజు పిఠాపురం నియోజకవర్గాన్ని జగన్ ఎంచుకున్నారు. దాదాపు రోజంతా అక్కడే గడిపారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు సరికొత్త సంకేతాలు పంపారు. వైసీపీ అధికారంలోకి వస్తే చేయబోయే కార్యక్రమాలతో పాటు వంగా గీతకు ఇచ్చే పదవిపై కూడా ఫుల్ క్లారిటీ ఇచ్చారు. అయితే విపక్షాలకు చెందిన కీలక నేతలు పోటీ చేస్తున్న నియోజకవర్గాల్లో జగన్ ఒకే తరహా ప్రకటనలు చేయడం విశేషం. చాలా రోజులుగా వైనాట్ కుప్పం అనే సంకేతాలను వైఎస్ జగన్ ప్రజల్లోకి పంపారు.


ఎప్పుడైతే స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీకి ఏకపక్ష విజయం లభించిందో.. నాటి నుంచి చంద్రబాబుని ఓడించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఆ బాధ్యతను సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించారు. బీసీ వర్గానికి చెందిన భరత్ కు కుప్పం ఇన్ఛార్జి పదవి ఇచ్చి ఎమ్మెల్సీని చేశారు. ఈ నియోజకవర్గానికి నిధుల వరద పారించారు. మరోవైపు భరత్ ను గెలిపిస్తే మంత్రిగా కూడా చేస్తానని హామీ ఇచ్చారు.


అయితే తాజాగా పిఠాపురంలో పర్యటించిన పవన్ ఇదే తరహా ప్రకటన చేశారు. ఇక్కడ వంగా గీతను గెలిపిస్తే  తన క్యాబినెట్లో డిప్యూటీ సీఎం ను చేస్తానని హామీ ఇచ్చారు. ఈ ప్రకటన గేమ్ ఛేంజగర్ అవుతుందని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. అయితే గత ఐదేళ్లుగా డిప్యూటీ సీఎం పదవిలో ఉన్న వారి పరిస్థితి ప్రజలకు తెలుసు. మరోవైపు కీలక నేతలపై పోటీలో ఉన్న వైసీపీ అభ్యర్థులను గెలిపించేందుకు జగన్ ఈ తరహా ఆఫర్లను ప్రకటిస్తున్నారు. అయితే పిఠాపురం విషయంలో జగన్ మాత్రం గట్టి ప్రయత్నాల్లోనే ఉన్నారు. వంగా గీత అయితే కొంగు చాచి మరీ పిఠాపురం ప్రజలను ఓటు వేయాలని కోరుతోంది. మరి ప్రజలు ఏం తీర్పు ఇస్తారో చూడాలి.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>