HealthPurushottham Vinayeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tipsd94289ce-737c-4732-93d3-994b3bc17099-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/health/movies_news/health-tipsd94289ce-737c-4732-93d3-994b3bc17099-415x250-IndiaHerald.jpgరోజులో కనీసం ఒకటి లేదా రెండు కొబ్బరి బొండాలను అయినా ఖచ్చితంగా తాగాలి. ఎందుకంటే ఇవి శరీరాన్ని ఖచ్చితంగా చల్లగా ఉంచుతాయి. అలాగే ఈ సీజన్‌లో కారం, మసాలాలు, ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు, నూనె పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. ఇవి వేడి చేసే స్వభావం కలవి. కనుక వీటిని పూర్తిగా మానేస్తేనే బెటర్‌. ఇక వారంలో కనీసం 2 నుంచి 3 సార్లు ఆయిల్ మసాజ్ చేసుకుని స్నానం చేస్తే మంచిది. ఇది పురాతన ఆయుర్వేద పద్ధతి. దీంతో శరీరం చల్లగా మారుతుంది. బ్రహ్మి, శతావరి, గుడూచి వంటి ఆయుర్వేద మూలికలు చల్లని స్వభావాన్ని పెంచుతాయి. వీటినHealth Tips{#}oil;Aqua;salt;Ayurveda;Coriander.;Doctor;Manamవేసవిలో న్యాచురల్ గా మీ శరీరం చల్లబడే టిప్స్?వేసవిలో న్యాచురల్ గా మీ శరీరం చల్లబడే టిప్స్?Health Tips{#}oil;Aqua;salt;Ayurveda;Coriander.;Doctor;ManamSun, 12 May 2024 22:15:00 GMTరోజులో కనీసం ఒకటి లేదా రెండు కొబ్బరి బొండాలను అయినా ఖచ్చితంగా తాగాలి. ఎందుకంటే ఇవి శరీరాన్ని ఖచ్చితంగా చల్లగా ఉంచుతాయి. అలాగే ఈ సీజన్‌లో కారం, మసాలాలు, ఉప్పు అధికంగా ఉండే ఆహారాలు, నూనె పదార్థాలను తక్కువగా తీసుకోవాలి. ఇవి వేడి చేసే స్వభావం కలవి. కనుక వీటిని పూర్తిగా మానేస్తేనే బెటర్‌. ఇక వారంలో కనీసం 2 నుంచి 3 సార్లు ఆయిల్ మసాజ్ చేసుకుని స్నానం చేస్తే మంచిది. ఇది పురాతన ఆయుర్వేద పద్ధతి. దీంతో శరీరం చల్లగా మారుతుంది. బ్రహ్మి, శతావరి, గుడూచి వంటి ఆయుర్వేద మూలికలు చల్లని స్వభావాన్ని పెంచుతాయి. వీటిని డాక్టర్ సూచన మేరకు వాడుకుంటే శరీరం చల్లగా ఉంటుంది.ముఖ్యంగా ఈ ఎండా కాలంలో మనం భోజనం చేసిన తరువాత చల్లని మజ్జిగను ఖచ్చితంగా తాగాలి. అందులో పుదీనా ఆకులను కలిపి తాగితే ఆరోగ్యానికి ఇంకా చాలా రకాలుగా మేలు కలుగుతుంది. దీంతో మన శరీరంలో వేడి ఉత్పత్తి అవకుండా ఉంటుంది. ఫలితంగా శరీరం చల్లగా ఉంటుంది. ఎండ దెబ్బ నుంచి సురక్షితంగా ఉండవచ్చు.


కొత్తిమీర ఆకులు, సోంపు గింజలు, గులాబీ పువ్వుల రెక్కలతో తయారు చేసిన హెర్బల్ టీలను తాగాలి. ఇవి కూడా వేసవి తాపాన్ని తగ్గిస్తాయి. శరీరాన్ని చల్లగా ఉంచుతాయి. అలాగే బయటకు వెళ్లినప్పుడు చర్మం ఎండ బారిన పడకుండా ఉండేందుకు గాను అలోవెరా లేదా శాండల్‌వుడ్ పేస్ట్‌ను చర్మానికి రాయాలి. వదులుగా ఉండే దుస్తులను ధరించాలి, కళ్లకు రక్షణగా చలువ కళ్లద్దాలను ధరించాలి. తలపై టోపీ ఉండాలి. దీంతో శరీరం వేడికి గురి కాకుండా ఉంటుంది.వేసవి కాలంలో శరీరం నుంచి నీరు ఖచ్చితంగా త్వరగా బయటకు పోతుంది. కాబట్టి బయటకు పోయే నీటి శాతాన్ని త్వరగా భర్తీ చేయాలి. అందుకు గాను నీళ్లను ఎక్కువగా తాగాలి. అలాగే పుచ్చకాయ, తర్బూజా, కీరదోసలను ఎక్కువగా తినాలి. ఇవి ఎండ వేడి నుంచి మనల్ని కాపాడుతాయి. శరీరంలో నీటి శాతం తగ్గకుండా చూస్తాయి. దీంతో బయట ఎంత ఎండ ఉన్నా సరే మన శరీరం నుంచి నీరు అధికంగా బయటకు పోకుండా ఉంటుంది. దీని వల్ల శరీరం ఎల్లప్పుడూ చల్లగా ఉంటుంది. ఎండదెబ్బ బారిన పడకుండా ఉంటారు. ఇక వాటితో జ్యూస్ అయినా చేసుకుని తాగవచ్చు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>