PoliticsReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/cbn-gives-warning-to-vamsie824a3f3-fad7-4c03-af16-b31559a6c02f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/cbn-gives-warning-to-vamsie824a3f3-fad7-4c03-af16-b31559a6c02f-415x250-IndiaHerald.jpg2019 ఎన్నికల సమయంలో షర్మిల చెప్పిన బైబై బాబు స్లోగన్ బాగా పని చేసింది. మెజారిటీ ఓటర్లు చంద్రబాబు నాయుడుకు షాకివ్వడం జరిగింది. ఈ ఎన్నికల్లో మాత్రం కూటమి ఓటమి పాలైతే గుడ్ బై బాబు అని చెప్పడం గ్యారంటీ అని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చంద్రబాబు గతంలో ప్రకటించిన నేపథ్యంలో ఈ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. chandrababu naidu{#}sanyasam;Nara Lokesh;Yevaru;June;Sharmila;media;News;CBN;Hanu Raghavapudi;TDPఅప్పుడు బైబై బాబు.. ఇప్పుడు గుడ్ బై బాబు.. టీడీపీ ఓడితే బాబుకు రాజకీయ సన్యాసమే?అప్పుడు బైబై బాబు.. ఇప్పుడు గుడ్ బై బాబు.. టీడీపీ ఓడితే బాబుకు రాజకీయ సన్యాసమే?chandrababu naidu{#}sanyasam;Nara Lokesh;Yevaru;June;Sharmila;media;News;CBN;Hanu Raghavapudi;TDPSun, 12 May 2024 21:30:00 GMT2019 ఎన్నికల సమయంలో షర్మిల చెప్పిన బైబై బాబు స్లోగన్ బాగా పని చేసింది. మెజారిటీ ఓటర్లు చంద్రబాబు నాయుడుకు షాకివ్వడం జరిగింది. ఈ ఎన్నికల్లో మాత్రం కూటమి ఓటమి పాలైతే గుడ్ బై బాబు అని చెప్పడం గ్యారంటీ అని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఈ ఎన్నికల్లో ఓడిపోతే రాజకీయ సన్యాసం తీసుకుంటానని చంద్రబాబు గతంలో ప్రకటించిన నేపథ్యంలో ఈ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
చంద్రబాబు నాయుడుకు ఈ ఎన్నికల్లో విజయం దక్కకపోతే 2029 ఎన్నికల సమయానికి ఆయన గెలవాలన్నా వయస్సు సహకరించదు. టీడీపీలో చంద్రబాబు నాయుడు తర్వాత ఆ స్థాయి వ్యక్తి ఎవరు అనే ప్రశ్నకు సైతం సరైన సమాధానం ఎవరి దగ్గర లేదు. లోకేశ్, పవన్ ఎంత కష్టపడినా వాళ్లు టీడీపీ జనసేనలకు మైనస్ అవుతారే తప్ప ప్లస్ కాలేరు. రాజకీయ అనుభవం లేకపోవడం కూడా వాళ్లకు ఒకింత మైనస్ కానుంది.
 
చంద్రబాబు నాయుడు 2014 నుంచి 2019 వరకు ప్రజలకు అద్భుతమైన పాలనను అందించి ఉంటే బాబుకు ప్రస్తుతం ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. చంద్రబాబు చేతులారా ఈ పరిస్థితిని కొని తెచ్చుకున్నారని ఆయన ఓడిపోయినా ఓటమికి చంద్రబాబే ప్రత్యక్షంగా, పరోక్షంగా కారణమని కామెంట్లు వినిపిస్తున్నాయి.
 
లోకేశ్ మంగళగిరిలో గెలుస్తాడని కుప్పంలో చంద్రబాబు ఓడిపోతాడని సర్వేలు చెబుతుండగా ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఓటు కీలకం కాగా ఏ అభ్యర్థి విజేతగా నిలుస్తాడో చూడాల్సి ఉంది. ఎన్నికల ఫలితాల లెక్కలు తెలియాలంటే జూన్ 4వ తేదీ వరకు ఆగాల్సి ఉండగా అప్పటివరకు అభ్యర్థులు పడే టెన్షన్ మాత్రం మామూలుగా ఉండదు. ఏపీలో ఒక్కో నియోజకవర్గంలో అభ్యర్థి 30 కోట్ల రూపాయల చొప్పున ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుతోంది. కొన్ని నియోజకవర్గాల్లో ఖర్చు 100 కోట్లు దాటిందని తెలుస్తోంది.
 





మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>