Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle264dd8e2-aa10-43f2-a748-e1aa599284bc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/socialstars-lifestyle264dd8e2-aa10-43f2-a748-e1aa599284bc-415x250-IndiaHerald.jpg'గోల్డెన్‌ లేడీ ఆఫ్‌ టెలివిజన్‌’గా పేరున్న ఆమె ఆట, మాట, పాటలంటే అందరికీ మక్కువ. అందుకే ఆమెను పేరుతో కంటే అక్క, చెల్లి.. అని పిలిచే ఆప్తబంధువులే ఎక్కువ.ఔను.. యాంకర్‌గా, యాక్టర్‌గా, డ్యాన్సర్‌గా, సింగర్‌గా, రైటర్‌గా, ప్రొడ్యూసర్‌గా, బిజినెస్‌ వుమెన్‌గా.. అభిమాన బంధుగణాన్ని సంపాదించుకున్న మల్టీ టాలెంటెడ్‌ లేడీ ఉదయభాను. ఒక తల్లిగా తను ఆస్వాదిస్తున్న అనుభవాలను మాతృ దినోత్సవం సందర్భంగా 'జిందగీ'తో పంచుకుందీ జన హృదయభాను..మాది కరీంనగర్‌ జిల్లా కొహెడ. సుల్తానాబాద్‌లో ఉండేవాళ్లం. నాన్న ఆయుర్వేదిక్‌ డాక్టర్socialstars lifestyle{#}Husband;vegetable market;Kuchipudi;Maha;Girl;Balakrishna;Telangana;District;Telugu;Fatherఅమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న మల్టీ టాలెంటెడ్‌ స్టార్ లేడీ ఉదయభాను..!!అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్న మల్టీ టాలెంటెడ్‌ స్టార్ లేడీ ఉదయభాను..!!socialstars lifestyle{#}Husband;vegetable market;Kuchipudi;Maha;Girl;Balakrishna;Telangana;District;Telugu;FatherSun, 12 May 2024 17:30:00 GMT'గోల్డెన్‌ లేడీ ఆఫ్‌ టెలివిజన్‌’గా పేరున్న ఆమె ఆట, మాట, పాటలంటే అందరికీ మక్కువ. అందుకే ఆమెను పేరుతో కంటే అక్క, చెల్లి.. అని పిలిచే ఆప్తబంధువులే ఎక్కువ.ఔను.. యాంకర్‌గా, యాక్టర్‌గా, డ్యాన్సర్‌గా, సింగర్‌గా, రైటర్‌గా, ప్రొడ్యూసర్‌గా, బిజినెస్‌ వుమెన్‌గా.. అభిమాన బంధుగణాన్ని సంపాదించుకున్న మల్టీ టాలెంటెడ్‌ లేడీ ఉదయభాను. ఒక తల్లిగా తను ఆస్వాదిస్తున్న అనుభవాలను మాతృ దినోత్సవం సందర్భంగా 'జిందగీ'తో పంచుకుందీ జన హృదయభాను..మాది కరీంనగర్‌ జిల్లా కొహెడ. సుల్తానాబాద్‌లో ఉండేవాళ్లం. నాన్న ఆయుర్వేదిక్‌ డాక్టర్‌. సర్పంచ్‌గా కూడా పనిచేశారు. అమ్మానాన్నలిద్దరూ రచయితలే. నాన్న కలం పేరునే నాకు పెట్టారు. చిన్నప్పటి నుంచీ ఆటపాటల్లో చురుగ్గా ఉండేదాన్ని. ఐదేండ్ల వయసు నుంచే కూచిపూడి నృత్య ప్రదర్శనలు ఇచ్చేదాన్ని. చైల్డ్‌ ఆర్టిస్ట్‌గా రెండు సినిమాల్లో నటించాను కానీ అవి రిలీజ్‌ కాలేదు. తర్వాత ఆర్‌.నారాయణమూర్తి గారు అవకాశం ఇచ్చారు.అప్పుడు నేను తొమ్మిదో తరగతి. అన్ని చానెళ్లలో రకరకాల పాత్రల్లో కనిపించాను. వన్స్‌మోర్‌, సాహసం చేయరా డింభకా, పిల్లలు-పిడుగులు, ఢీ, రేలా రే రేలా తదితర కార్యక్రమాలు నా కెరీర్‌లో మైలురాళ్లు. పిల్లలు పుట్టిన తర్వాత మూడేండ్లు బ్రేక్‌ తీసుకున్నా. జీ తెలుగు 'సూపర్‌ జోడీ' ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు రావడం ఆనందంగా ఉంది. మళ్లీ బుల్లితెర హోస్ట్‌గా పేరు తెచ్చుకుంటా. ప్రాధాన్యమున్న పాత్ర అయితే సినిమాల్లోనూ చేస్తా.ప్రేక్షకులకు వినోదం పంచేందుకు ఒక హోస్ట్‌గా ఆడటం, పాడటం, నవ్వించటం చేసేదాన్ని. స్టంట్స్‌ చేయడానికీ వెనుకాడలేదు. వరుస షోలతో బిజీగా ఉన్న సమయంలో నామీద పుకార్లు పుట్టించారు. సినీపరిశ్రమలో తెలుగు అమ్మాయిలకు ఆదరణ తక్కువ. అందులోనూ తెలంగాణ అంటే చిన్నచూపు.

ఉద్యమం తారస్థాయికి చేరినప్పుడు పరిశ్రమలోనూ తెలంగాణ, ఆంధ్ర అనే ఫీలింగ్స్‌ ఎక్కువయ్యాయి. షూటింగ్‌కు ఒక రోజు ముందూ ప్రాజెక్ట్‌లు చేజారిపోయేవి. టైమ్‌కి రానని, లేటైతే ఉండనని, నా కాళ్లు విరిగిపోయాయని ప్రచారం చేసి నా కెరీర్‌ని ప్రశ్నార్థకంగా మార్చారు. అయినా నేనెప్పుడూ జడవలేదు. నా దారులన్నీ మూసేసినా కొత్త దారులు వేసుకుంటూ సాగిపోతున్నా. ఎలాంటి సపోర్టు, బ్యాక్‌గ్రౌండూ లేకుండా పరిశ్రమకు వచ్చి నేనేంటో నిరూపించుకున్నా.ప్రత్యేక పాటల్లో చేయమని చాలా సినిమాల్లో అడిగారు. రోల్‌ ఏదైనా ప్రేక్షకులను అలరించాలి కానీ ఇబ్బంది పెట్టకూడదనేదే నా అభిమతం. అలా ఆలోచించి చేసిందే 'లీడర్‌’ సినిమాలోని 'రాజశేఖరా..' సాంగ్‌. ఆ తర్వాత కూడా అవకాశాలు వచ్చినా నేనొప్పుకోలేదు. మా కుటుంబమంతా అల్లు అర్జున్‌ అభిమానులం. అంత పెద్ద హీరోతో కలిసి ఒక్కసారైనా స్క్రీన్‌ షేర్‌ చేసుకోవాలని ఉండేది. ఆయనెంత మంచి డ్యాన్సరో అందరికీ తెలిసిందే. 'జులాయి' సినిమాలో ఆయన పక్కన స్పెషల్‌ సాంగ్‌ కోసం నన్ను తీసుకోవడం ఆనందమనిపించింది.ఊహ తెలిసినప్పటినుంచీ ఇండస్ట్రీనే నా కుటుంబం. జీవితంలోని గొప్ప క్షణాలను వాళ్లతో పంచుకోవాలనుకున్నా. నా కూతుళ్లకు ఫంక్షన్‌ చేసినప్పుడు ఎవరికి ఫోన్‌ చేసినా సరిగ్గా స్పందించలేదు. ఒక్క బాలకృష్ణగారే తిరిగి కాల్‌ చేసి అటెండ్‌ అవుతానని మాటిచ్చారు. బాలయ్య మామ వచ్చి ఆశీర్వదించాడని ఇప్పటికీ నా కూతుళ్లు సంబురపడతారు. ఆయన మా ఇంటి సభ్యుడితో సమానం.చిన్నప్పటినుంచీ ప్రశ్నించే తత్వం ఎక్కువ. పాటలంటే మక్కువ. అందుకే నేను హోస్ట్‌గా చేసిన కొన్ని షోస్‌లో పాడిన పాటల నిండా ప్రశ్నల కొడవళ్లే. అవన్నీ నేను రాసినవే. స్త్రీలపై వివక్ష, ఆడపిల్ల సమస్యలే నా పాటకు ప్రధాన వస్తువు. ఇప్పటికీ మార్కెట్లో నా ఆల్బమ్స్‌ ఉన్నాయి. యూట్యూబ్‌లోనూ నా పాటలకు మంచి ఆదరణ ఉంది. కష్టం తెలిసిన మనుషుల మధ్య పెరిగాను. రైతు కష్టం విలువ తెలుసు. నాకున్న కొంత భూమిలో వ్యవసాయం చేస్తున్నా. పంట పండించడం, నా చేత్తో వండిపెట్టడం చాలా ఇష్టం.

చిన్నపిల్లలతో ఆడుకోవడమంటే మహా సరదా. కవలలంటే మరీ ఇష్టం. జంటగా ఉండే పండ్లు, కూరగాయలు కనపడగానే తీసుకుని తినేదాన్ని. అది చూసి మా అమ్మమ్మ 'అముడాల పండ్లు తింటే అముడాలోళ్లు పుడతారు' అనేది. ఆమె చెప్పినట్టే నాకు కవలలు పుట్టారు. ఇప్పుడు వాళ్లే నా ప్రపంచం. వాళ్లతో ఆనందంగా గడుపుతూ అమ్మతనాన్ని ఆస్వాదిస్తున్నా. నా భర్త కూడా నాకు అండగా ఉంటారు. మాకు గార్మెంట్‌ ఫ్యాక్టరీ ఉంది. మా పిల్లల పేరుతో 'భుయువ్‌.కామ్‌’ అని ఒక వెబ్‌సైట్‌ స్టార్ట్‌ చేశాం. ఆన్‌లైన్‌ పోర్టల్‌ ద్వారా ఈ బ్రాండ్‌ మీద అన్నిరకాల గ్యాడ్జెట్స్‌, దుస్తులు అందిస్తున్నాం.నేరుగా చేనేత కార్మికుల నుంచి చీరలు కొనుగోలు చేసి వారికి ఉపాధి కల్పిస్తున్నాం. ఓ స్టూడియో నిర్మించి కొంతమందికైనా ఉపాధి కల్పించాలనేది నా ఆశయం. గొప్ప తలంపుతో మొదలుపెట్టిన స్టూడియో నిర్మాణం పూర్తికాకుండానే ఆధారంలేని కారణాలు చెప్పి నేలమట్టం చేశారు. స్టూడియో కూల్చగలిగారు కానీ నా ఆత్మస్థయిర్యాన్ని దెబ్బ తీయలేకపోయారు. తప్పకుండా స్టూడియో నిర్మిస్తా.. అనుకున్నది సాధిస్తా. సమాజంలో అణచివేతకు గురవుతున్న ఆడపిల్లలకు నా ప్రయాణం స్ఫూర్తిగా మారుతుందని ఆశిస్తున్నా.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>