PoliticsPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-chandrababu-cheating-with-manifestoc01aba8c-f5f8-4920-8829-436ea413b2c6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-chandrababu-cheating-with-manifestoc01aba8c-f5f8-4920-8829-436ea413b2c6-415x250-IndiaHerald.jpgఉచితాలు ఎప్పుడు ప్రమాదకరమే. కాకపోతే కొన్ని పరిస్థితులలో కొన్ని రాష్ట్రాలలో కొన్ని ఉచితాలు ఇవ్వవలసి ఉంటుంది. వాటి ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది అన్న సమయంలో ఉచితలను ఇవ్వడంలో పెద్దగా తప్పు ఉండదు. కానీ వీటిలో కొన్ని సముచిత ఉచితాలు, కొన్ని అనుచిత ఉచితాలు ఉంటాయి. దేశ ప్రగతికి, రాష్ట్ర ప్రగతికి, ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే ఉచితాలు ఎప్పుడు మంచివే. కానీ ప్రజల అవసరాలకు మించి అనవసరంగా ఇచ్చే ఉచితాలు ఎప్పుడు ప్రమాదకరమే. వాటి ద్వారా దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చాలా క్షీణిస్తాయి. ఇకపోతే కొన్ని సందర్భాjagan{#}Hanu Raghavapudi;CBN;YCP;Andhra Pradesh;Jaganఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బలంగా ఉండాలంటే జగన్ పాలన అవసరమే... ఎందుకో తెలుసా..?ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగా బలంగా ఉండాలంటే జగన్ పాలన అవసరమే... ఎందుకో తెలుసా..?jagan{#}Hanu Raghavapudi;CBN;YCP;Andhra Pradesh;JaganSun, 12 May 2024 20:13:00 GMTఉచితాలు ఎప్పుడు ప్రమాదకరమే. కాకపోతే కొన్ని పరిస్థితులలో కొన్ని రాష్ట్రాలలో కొన్ని ఉచితాలు ఇవ్వవలసి ఉంటుంది. వాటి ద్వారా ప్రజలకు ఎంతో మేలు జరుగుతుంది అన్న సమయంలో ఉచితలను ఇవ్వడంలో పెద్దగా తప్పు ఉండదు. కానీ వీటిలో కొన్ని సముచిత ఉచితాలు, కొన్ని అనుచిత ఉచితాలు ఉంటాయి. దేశ ప్రగతికి, రాష్ట్ర ప్రగతికి, ప్రజల అభివృద్ధికి ఉపయోగపడే ఉచితాలు ఎప్పుడు మంచివే. కానీ ప్రజల అవసరాలకు మించి అనవసరంగా ఇచ్చే ఉచితాలు ఎప్పుడు ప్రమాదకరమే.

వాటి ద్వారా దేశ, రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు చాలా క్షీణిస్తాయి. ఇకపోతే కొన్ని సందర్భాలలో కొన్ని రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడం కోసం అనేక రకాలైన హామీలను ఇస్తూ ఉంటారు. మేము అధికారంలోకి వస్తే అవి ఫ్రీ గా ఇస్తాము, ఇవి ఫ్రీగా ఇస్తాము అని ఎన్నో హామీలను ఇస్తారు. కానీ అవి అమలుపరచడం వీలు అవుతుందా..? కాదా అనేది కూడా వారు ఆలోచించరు. అధికారంలోకి వచ్చాక చూసుకుందాం అని అనుకుంటారు.

ఇక చంద్రబాబు నాయుడు విడుదల చేసిన మేనిఫెస్టో కూడా అదే విధంగా ఉంది. 2019 వ సంవత్సరంలో అధికారంలోకి వచ్చిన వైసీపీ పార్టీ కొన్ని సముచిత ఉచితాలను ప్రజల ముందుకు తీసుకువచ్చింది. ఎంతో సముచిత ప్రజలకు ఇస్తున్న వాటి ద్వారానే సంవత్సరానికి 80 వేల కోట్ల బడ్జెట్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇక చంద్రబాబు నాయుడు కొన్ని రోజుల క్రితమే ఎన్నికల మేనిఫెస్టో ను విడుదల చేశాడు. ఆ మేనిఫెస్టో ప్రకారం చెప్పినవన్నీ చేసినట్లు అయితే జగన్ ప్రస్తుతం ఖర్చు పెడుతున్న దానికి మించి మరో 70 వేల కోట్లు ఖర్చు కాబోతున్నట్లు అంచనా వేస్తున్నారు.

దీని ద్వారా రాష్ట్ర ఖజానాపై సుమారు లక్ష యాభై వేల కోట్ల భారం పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇలా భారం పడినట్లు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా చాలా క్షీణించే అవకాశాలు ఉన్నాయి అని , జగన్ చెప్పిన హామీల ద్వారా రాష్ట్ర ఆర్థికంగా పెద్దగా ఇబ్బంది పడదు అని అనేక మంది అభిప్రాయ పడుతున్నారు. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్థికంగా బలంగా ఉండాలి అంటే జగన్ పరిపాలనే బెటర్ అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>