DebateChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/ycp73363f56-2537-430c-9554-8740ace21eb6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/debate/138/ycp73363f56-2537-430c-9554-8740ace21eb6-415x250-IndiaHerald.jpgఏపీ లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసింది. అయిదేళ్లకోసారి జరిగే ఈ ఓట్ల పండుగలో నాయకుల కోసం.. పార్టీల కోసం పొద్దున లేస్తే ముఖం చూసుకునే వాళ్ల దగ్గర నోరు జారుతున్నారు. ఏ కష్టానికి అయినా.. ఆపద వచ్చిన మనకు సహాయపడేది ఇరుపు పొరుగు వారే అనే చిన్న విషయాన్ని మరిచిపోయి ఘర్షణలకు దిగుతున్నారు. ఎంత అభిమానం ఉన్నా.. మన నాయకులు ఏసీ గదుల్లో.. మనకు దూరంగా ఉంటారనే విషయాన్ని మరిచిపోతున్నారు. మన వర్గం కాకుండా తిరుగుతున్నారు.. మనకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఇంకా తదితర విషయాలు మనసులో పెట్టుకొని వారిని దూషycp{#}Traffic police;Party;Manamగెలిచేది వైసీపీనే.. చొక్కాలు చించుకోవద్దు?గెలిచేది వైసీపీనే.. చొక్కాలు చించుకోవద్దు?ycp{#}Traffic police;Party;ManamSun, 12 May 2024 13:00:00 GMTఏపీ లో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ముగిసింది. అయిదేళ్లకోసారి జరిగే ఈ ఓట్ల పండుగలో నాయకుల కోసం.. పార్టీల కోసం పొద్దున లేస్తే ముఖం చూసుకునే వాళ్ల దగ్గర నోరు జారుతున్నారు. ఏ కష్టానికి అయినా.. ఆపద వచ్చిన మనకు సహాయపడేది ఇరుపు పొరుగు వారే అనే చిన్న విషయాన్ని మరిచిపోయి ఘర్షణలకు దిగుతున్నారు. ఎంత అభిమానం ఉన్నా.. మన నాయకులు ఏసీ గదుల్లో.. మనకు దూరంగా ఉంటారనే విషయాన్ని మరిచిపోతున్నారు.


మన వర్గం కాకుండా తిరుగుతున్నారు.. మనకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఇంకా తదితర విషయాలు మనసులో పెట్టుకొని వారిని దూషిస్తూ..  వారిపై దాడులకు తెగ పడుతున్నారు. వాస్తవానికి నాయకులు ఎప్పుడూ బాగానే ఉంటారు. కానీ కార్యకర్తలే లేనిపోని గొడవలకు దిగుతారు. అప్పటి వరకు బాబాయ్, పిన్ని, మామ అంటూ ఆప్యాయంగా వరసలు పిలుచుకునే కార్యకర్తలు ఒక్కసారిగా ఆగ్రహావేశానికి లోనై ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలపై కయ్యానికి కాలు దువ్వుతున్నారు.


ఇప్పుడు ఏపీలో ఎక్కడ చూసినా దాడులే దర్శనమిస్తున్నాయి. ఆ  పార్టీ చేసిందని.. మరొక పార్టీ దెబ్బకు దెబ్బ తీస్తూ గొడవలు పెంచుకుంటూ పోతున్నారు. వీరికి నాయకుల ప్రోత్సాహం ఒకటి. చివరకు బలయ్యేది కార్యకర్తలే అనేది నిజం. చివరకు తలకాయలు పగలుగొట్టుకుంటూ.. ఓ ముఫ్పై ఏళ్ల రాజకీయ పరిస్థితులను గుర్తు చేస్తున్నారు.


చివరకు ఇలా గొడవపడిన కార్యకర్తలంతా ఆసుపత్రుల చుట్టూ.. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతున్నారు. ఇలా వీళ్లంతా రాబోయే ఐదేళ్ల పాటు కోర్టుల చుట్టూ.. ఆసుపత్రుల చుట్టూ తిరగాల్సిందే. వీరికి ఆయా పార్టీ ముఖ్య నేతల నుంచి ప్రత్యేక గుర్తింపు అంటూ కూడా ఏమీ ఉండదు. ఏదో పదో.. పరకో ఆర్థిక సాయం చేసి చేతులు దులుపుకొంటారు. అందుకే మనం ఆలోచించుకోవాలి. నేతలు వస్తుంటారు. పోతుంటారు. మనమే మేలుకొని మనల్ని, మన చుట్టూ ఉండే వారిని కాపాడుకోవాలి. ప్రతి సారి వచ్చే ఇలాంటి ఎన్నికలకు మనకు ఆయుధంగా ఉండాలి కానీ నాయకులకు అవకాశం కావొద్దు. అంతిమంగా ఓటు అనే ఆయుధంతో మనకి  మంచి చేసే నాయకుడిని ఎన్నుకోవాలి. అంతేకానీ భౌతిక దాడులకు దిగుతూ మన జీవితాలను ఫణంగా పెట్టాల్సిన పని లేదు.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>