Sportspraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohith62474c12-af2d-422c-8d60-06df0b15341c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/sports/libra_libra/rohith62474c12-af2d-422c-8d60-06df0b15341c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం టీమిండియాకు మూడు ఫార్మాట్లలో కూడా కెప్టెన్గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ.. అటు ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఉండేవాడు. అయితే ఒక రకంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా అతను సక్సెస్ కావడం కారణంగానే.. టీమ్ ఇండియా కెప్టెన్సీ కూడా దక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏకంగా ముంబై జట్టుకు అయిదు సార్లు ఐపీఎల్ టైటిల్ అందించిన ఘనత రోహిత్ కే దక్కుతుంది ఇక మిగతా టీమ్స్ కి గట్టి పోటీ చేస్తూ ఛాంపియంగా ముంబైని మార్చిన ఘనత కూడా రోహిత్ దే. అలాంటి రోహిత్ శర్మను 2024 ఐపీఎల్ సీజన్ కి ముందు కెప్టెన్సRohith{#}Rohit Sharma;abhishek;Success;Hardik Pandya;Mumbai;Indiaరోహిత్ కు ఇదే చివరి ఐపీఎల్ సీజనా.. ఆ వ్యాఖ్యల వెనక అర్థమేంటో?రోహిత్ కు ఇదే చివరి ఐపీఎల్ సీజనా.. ఆ వ్యాఖ్యల వెనక అర్థమేంటో?Rohith{#}Rohit Sharma;abhishek;Success;Hardik Pandya;Mumbai;IndiaSun, 12 May 2024 11:15:00 GMTప్రస్తుతం టీమిండియాకు మూడు ఫార్మాట్లలో కూడా కెప్టెన్గా వ్యవహరిస్తున్న రోహిత్ శర్మ.. అటు ఐపిఎల్ లో ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా ఉండేవాడు. అయితే ఒక రకంగా ముంబై ఇండియన్స్ కెప్టెన్ గా అతను సక్సెస్ కావడం కారణంగానే.. టీమ్ ఇండియా కెప్టెన్సీ కూడా దక్కింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఏకంగా ముంబై జట్టుకు అయిదు సార్లు ఐపీఎల్ టైటిల్  అందించిన ఘనత రోహిత్ కే దక్కుతుంది  ఇక మిగతా టీమ్స్ కి గట్టి పోటీ చేస్తూ ఛాంపియంగా ముంబైని మార్చిన ఘనత కూడా రోహిత్ దే.


 అలాంటి రోహిత్ శర్మను 2024 ఐపీఎల్ సీజన్ కి ముందు కెప్టెన్సీ నుంచి తప్పిస్తూ ఆ జట్టు యాజమాన్యం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో అభిమానులు అందరూ కూడా ఒక్కసారిగా షాక్ లో మునిగిపోయారు  అయితే ఇక ఇప్పుడు హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో కూడా ముంబై ఇండియన్స్ దారుణంగా విఫలమైంది. కనీసం ప్లే ఆఫ్ లోకి కూడా అడుగుపెట్టకుండానే.. ఇక టోర్ని నుంచి నిష్క్రమించింది అన్న విషయం తెలిసిందే. మరోవైపు కొత్త కెప్టెన్ హార్దిక్ సీనియర్ అయిన రోహిత్ కు కనీస గౌరవం ఇవ్వడం లేదు అంటూ ప్రచారం కూడా జరుగుతుంది. దీంతో రోహిత్ ఇక తర్వాత సీజన్లో ముంబై జట్టును వీడబోతున్నాడు అని టాక్ వినిపిస్తోంది.



 ఈ క్రమంలోనే ముంబై జట్టులో పరిస్థితులు క్రమక్రమంగా మారుతున్నాయ్ అన్నదానికి నిదర్శనంగా ఇటీవలే ఆ జట్టు మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ చేసిన వ్యాఖ్యలు నిలిచాయి. ఇటీవలే కోల్కతా నైట్ రైడర్స్ ముంబై ఇండియన్స్ మ్యాచ్ జరిగింది. అయితే కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ తో రోహిత్ మాట్లాడిన ఒక వీడియో వైరల్ గా మారింది. అది నా ఇల్లు.. దేవాలయం. దానిని నేనే నిర్మించా. కానీ ఇప్పుడు నాకు అవసరం లేదు.  నాకు ఇదే లాస్ట్ కదా అంటూ రోహిత్ చెప్పాడు. అయితే ఇండైరెక్టుగా రోహిత్ ముంబై ఇండియన్స్ జట్టు గురించే చెప్పాడు అన్నది అర్థమవుతుంది. దీంతో రోహిత్ ముంబైని వదలడం ఖాయం అంటూ అందరూ కామెంట్లు చేస్తున్నారు. ఇక ముంబై నుంచి ఏ జట్టులోకి వెళ్ళబోతున్నాడు అన్నది కూడా హాట్ టాపిక్ గా మారింది.



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>